For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

July 2021 Festivals List:జులైలో బోనాలు, రథయాత్ర, బక్రీద్ తో వచ్చే పండుగలు, వ్రతాలివే...

|

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, జులై మాసం ఏడో నెల. ఈ మాసం ఎన్నో పండుగలకు, వ్రతాలకు ప్రత్యేకమైనది. ఈ నెలలో తెలంగాణ బోనాలు, జగన్నాథ రథయాత్ర, గుప్త నవరాత్రి, గురు పూర్ణిమ, బక్రీద్ తో పాటు ఇంకా ఎన్నో పండుగలొచ్చాయి.

ఇదే నెలలో చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. అలాగే దేవశయని ఏకాదశి నుండి దేవతలు 4 నెలలు నిద్రిస్తారని పండితులు చెబుతారు. అనంతరం నాలుగు నెలల తర్వాత వచ్చే ఏకాదశి నుండి శుభకార్యాలు ప్రారంభమవుతాయని చెబుతారు.

ఇవే కాదు. ఇదే మసాంలో మరికొన్ని ముఖ్యమైన వ్రతాలు కూడా ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి...!

జులై 1న కలాష్టమి..

జులై 1న కలాష్టమి..

జులై ఒకటో తేదీన కలాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భైరవ్ బాబా కోసం అంకితం చేయబడింది. కలాష్టమి సందర్భంగా ఈరోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది ఈ పర్వదినం జులై 1వ తేదీ అంటే గురువారం నాడు రానుంది.

జులై 5న యోగిని ఏకాదశి..

జులై 5న యోగిని ఏకాదశి..

జ్యేష్ఠ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజున వ్రతం చేయడం వల్ల భక్తులకు అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ వ్రతం వల్ల ప్రాపంచీక ఆనందాన్ని, పరలోకంలో విముక్తిని పొందుతారని చెబుతారు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 88 వేల మంది బ్రాహ్మాణులకు అన్నదానం చేస్తే పుణ్యం పొందుతారని క్రిష్ణుడు స్వయంగా చెప్పారట. ఈ పవిత్రమైన రోజు జులై 5వ తేదీన సోమవారం నాడు రానుంది.

జులై 7న ప్రదోష్ వ్రతం..

జులై 7న ప్రదోష్ వ్రతం..

ఇదే మాసంలో ఏడో తేదీ అంటే త్రయోదశి రోజున ప్రదోష్ వ్రతం జరుపుకుంటారు. ఈరోజున పరమేశ్వరుడిని ఆరాధించే పండుగగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల పిల్లలు ఆనందంగా ఉండటమే కాకుండా కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. మరోవైపు పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు దీర్ఘాయువు పొందుతారు. మీ జీవితంలో సుఖ, సంతోషాలను కలిగి ఉంటారు.

Yogini Ekadashi 2021: యోగిని ఏకాదశి రోజున ఉపవాసముంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!

జులై 8న మాస శివరాత్రి..

జులై 8న మాస శివరాత్రి..

జులై మాసంలో క్రిష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈసారి జులై 8వ తేదీన రానుంది. ప్రతి నెల మాన శివరాత్రిని జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. ఈరోజున ఉపవాసం ఉంటే.. మోక్షం పొందడానికి అవకాశం లభిస్తుంది.

జులై 11న తెలంగాణ బోనాలు..

జులై 11న తెలంగాణ బోనాలు..

జులై 11వ తేదీ నుండి బోనాల పండుగ ప్రారంభమవుతుంది. గోల్కొండ కోట నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జులై 25వ తేదీన సికింద్రబాద్, ఆగస్ట్ ఒకటో తేదీన లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే తొలి పండుగ ఇదే. ఈ సమయంలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అంటే ఆ తల్లికి సమర్పించే నైవేద్యం. మహిళలు ఇంట్లో వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం వంటి వాటితో బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తలపై పెట్టుకుని డప్పు కోలాహాలతో గుడికి వెళ్తారు. మరోవైపు జులై 11 నుండి ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇవి జులై 18వ తేదీతో ముగుస్తుంది.

జులై 12న రథయాత్ర..

జులై 12న రథయాత్ర..

జులై 12వ తేదీన ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ రథయాత్ర జులై 12న సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర ఉత్సవాలు సుమారు పదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి.

Ashada Masam 2021:ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా...

జులై 13న వినాయక చతుర్థి..

జులై 13న వినాయక చతుర్థి..

జులై 13వ తేదీ అంటే.. మంగళవారం నాడు వినాయక చతుర్థి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వినాయకుడిని పూజిస్తారు.

జులై 20న దేవశయని ఏకాదశి..

జులై 20న దేవశయని ఏకాదశి..

జులై 20వ తేదీన వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఈరోజు నుండే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని చాలా మంది నమ్ముతారు.

జులై 21న బక్రీద్..

జులై 21న బక్రీద్..

ముస్లిముల ప్రధాన పండుగలలో బక్రీద్ కూడా ఒకటి. ఈద్ జరిగిన రెండు నెలల తర్వాత సరిగ్గా చెప్పాలంటే 70 రోజుల తర్వాత జరుపుకుంటారు. త్యాగాన్ని స్మరించుకొని నమస్కరించే పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్లో దీన్ని ఈద్ ఉల్-అజా అని పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ చివరి నెలల్లో జూ-అల్-హిజ్ జరుపుకుంటారు. ఈసారి జులై 21న బక్రీద్ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను చంద్రుడిని చూసిన తర్వాతే జరుపుకుంటారు.

మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...!

జులై 24న గురుపూర్ణిమ..

జులై 24న గురుపూర్ణిమ..

ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్షం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈరోజు గురు పూజా విధానం ఉంటుంది. ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు మహాభారత రచయిత వేద వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆయన గౌరవార్థం గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

జులై 26న ప్రత్యేక సోమవారం..

జులై 26న ప్రత్యేక సోమవారం..

జులై 26వ తేదీ వచ్చే సోమవారం శివునికి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో రాబోయే సోమవారం వేరే ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.

జులై 27న సంకష్ట చతుర్థి..

జులై 27న సంకష్ట చతుర్థి..

హిందూ పంచాంగం ప్రకారం, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్ఠ చతుర్థి అంటారు. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో జులై మాసంలో 27వ తేదీన సంకష్ఠ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును వినాయకుడిని ఆరాధించడం ద్వారా ప్రత్యేక వరం పొందొచ్చు. ఈరోజున ఉపవాసం ఉండటంతో పాటు వినాయకునికి నైవేద్యంతో పాటు తేనే అర్పించాలని పండితులు చెబుతారు.

English summary

Festivals and Vrats in the month of july 2021

Here are the list of festivals and vrats in the month of july 2021. Have a look
Desktop Bottom Promotion