For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

June 2022 Vrat And Festivals :జూన్ మాసంలో వ్రతాలు, పండుగల వివరాలివే...!

2022 జూన్ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో ఇప్పుడే తెలుసుకోండి.

|

మన క్యాలెండర్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే జూన్ నెలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మూడో నెల అయిన జ్యేష్ఠ మాసం ఈ నెలలోనే వస్తుంది.

Festivals and Vrats in the month of June 2022

ఈ నెలలో నిర్జల ఏకాదశి, గంగా దసరా, జగన్నాథ రథయాత్ర వంటి ముఖ్యమైన పండుగలతో పాటు ఇతర వ్రతాలు ఈ నెలలో హిందువులు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 2022 జూన్ మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో రానున్నాయి.. ఏ వ్రతాలు ఏ రోజున చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రంభ తృతీయ..

గత మాసంలో అక్షయ తృతీయ ముగిసింది. ఈ నెలలో రంభ తృతీయ జూన్ రెండో తేదీన గురువారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మరియు పిల్లల శ్రేయస్సు కోసం వ్రతం చేస్తారు. అంతేకాదు ఉపవాసం ఉంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Festivals and Vrats in the month of June 2022

గంగా దసరా..

హిందూ పంచాంగం ప్రకారం, గంగా దసరా పండుగను జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని పదో రోజున జరుపుకుంటారు. ఈరోజున గంగా మాతను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈరోజు గంగాస్నానం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబడింది. ఈ ఏడాది గంగా దసరా పండుగను జూన్ 9వ తేదీన జరుపుకోనున్నారు.

నిర్జల ఏకాదశి..

హిందూ మత విశ్వాసా ప్రకారం, ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 11వ తేదీ అంటే శనివారం నాడు జరుపుకుంటారు. అన్ని ఏకాదశి తిథిలలో, నిర్జల ఏకాదశి అత్యంత ఫలప్రదమైనదిగా చెబుతారు.

Festivals and Vrats in the month of June 2022

కబీర్ జయంతి, సావిత్రి వ్రతం..

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమి రోజున సావిత్రి ఉపవాసం వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి, తమ భర్త దీర్ఘాయువు పొందేందుకు రావి చెట్టును పూజిస్తారు. జూన్ 14వ తేదీన సంత్ కబీర్ జయంతి కూడా ఈరోజున జరుపుకుంటారు.

యోగిని ఏకాదశి..

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఏకాదశి ఉపవాసం యోగిని ఏకాదశిని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని పూర్ణ క్రతువులతో పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలియక చేసిన పాపాలు నశించి జీవితంలో సుఖసంతోషాలు వస్తాయని విశ్వాసం.

మాస శివరాత్రి..

ప్రతి నెలా క్రిష్ణ పక్షంలో చతుర్దశి తిథిని మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక ప్రజలు చేస్తారు. ఈ రోజున పరమశివుడిని చిత్తశుద్ధితో స్మరించే వ్యక్తికి తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. జూన్ మాసంలో 27వ తేదీన మాస శివరాత్రి వచ్చింది. అంతేకాదు జూన్ 30వ తేదీన జగన్నాథ రథయాత్ర జరగనుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నది, ఊహాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునేముందు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.

English summary

Festivals and Vrats in the month of June 2022

June Calendar 2022 Vrat Festivals List: To know about those festivals that will be celebrated in June month 2022, check out this article.
Desktop Bottom Promotion