For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ 2021 నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

అక్టోబర్ నెలలో ముఖ్యమైన తేదీలు మరియు వ్రతాల గురించి తెలుసుకుందాం.

|

మరికొన్ని గంటల్లో మనం సెప్టెంబర్ మాసానికి గుడ్ బై చెప్పబోతున్నాం. అదే సమయంలో అక్టోబర్ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెల పదో నెల. హిందూ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి.

ఇక 2021 సంవత్సరంలో అక్టోబర్ ఆరో తేదీన అమావాస్య రోజు తర్వాత అంటే ఏడో తేదీ నుండి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అశ్విని మాసంలో శరన్నవరాత్రులతో పాటు ఇంకా ఏయే ముఖ్యమైన పండుగలొచ్చాయి. ఏయే రోజున ఏకాదశిన జరుపుకుంటారు? శరద్ పూర్ణిమ ఎప్పుడొచ్చింది? ఇంకా ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

1 అక్టోబర్ 2021 : దశమి..

1 అక్టోబర్ 2021 : దశమి..

హిందూ సంప్రదాయం ప్రకారం అక్టోబర్ 1వ తేదీ మరియు రెండో తేదీన చనిపోయిన తమ పూర్వీకులకు పిండం పెట్టడం వంటివి చేస్తారు. ఈరోజున వారిని ఆరాధిస్తే, వారి ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

3 అక్టోబర్ 2021 : ఇందిరా ఏకాదశి..

3 అక్టోబర్ 2021 : ఇందిరా ఏకాదశి..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. అందులో ఒకటి శుక్ల పక్షంలో వస్తుంది. మరొకటి క్రిష్ణ పక్షంలో వస్తుంది. అక్టోబర్ నెలలో మూడో తేదీన ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈరోజున విష్ణుమూర్తి భక్తులందరూ ఉపవాసం ఉంటారు.

4 అక్టోబర్ 2021 : ప్రదోష వ్రతం, మాస శివరాత్రి

4 అక్టోబర్ 2021 : ప్రదోష వ్రతం, మాస శివరాత్రి

అక్టోబర్ నాలుగో తేదీ సోమవారం నాడు ప్రదోష వ్రతం ఆచరించబడుతుంది. ఈరోజున శివుని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు. అలాగే శివుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు. ఈరోజున ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్మకం. మాస శివరాత్రి అక్టోబర్ 4న జరుపుకుంటారు. ఈరోజున శివుడికి జలాభిషేకం చేయాలి.

6 అక్టోబర్ 2021:అమావాస్య..

6 అక్టోబర్ 2021:అమావాస్య..

అక్టోబర్ ఆరో తేదీన పిత్రు పక్షాలు చేయడానికి చివరిరోజు. ఈరోజునే అమావాస్య. ఈ అమావాస్య తిథి నాడు చనిపోయిన బంధువులను ఆరాధిస్తారు. ఈ అమావాస్యను మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు తర్వాత నుండే నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ మహాలయ అమావాస్య నాడు దుర్గాదేవి భూమి మీదకు దిగుతుందని చాలా మంది నమ్ముతారు.

Navratri 2021:నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తమెప్పుడంటే...!Navratri 2021:నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తమెప్పుడంటే...!

7 అక్టోబర్ 2021:నవరాత్రులు ప్రారంభం..

7 అక్టోబర్ 2021:నవరాత్రులు ప్రారంభం..

అక్టోబర్ ఏడో తేదీ నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఘట స్థాపన లేదా కలశ స్థాపన జరుగుతుంది. ఈరోజు నుండే అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజించడంతో పాటు ఉపవాసం ఉంటారు. తొలి రోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఆరాధిస్తారు.

13 అక్టోబర్ 2021:దుర్గాష్టమి..

13 అక్టోబర్ 2021:దుర్గాష్టమి..

అక్టోబర్ 13వ తేదీన దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు. దుర్గామాత ఎనిమిదో రూపాన్ని ఈరోజున అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దుర్గాష్టమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలను పూజించి వారికి నైవేద్యంగా ఆహారం సమర్పిస్తారు.

14 అక్టోబర్ 2021 : మహానవమి..

14 అక్టోబర్ 2021 : మహానవమి..

అక్టోబర్ 14వ తేదీన అమ్మవారి చివరి రూపం సిద్ధి దాత్రిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పవిత్రమైన అమ్మవారికి భూమి నుండి వీడ్కోలు పలుకుతారు. ఈరోజున అమ్మవారు తమ భక్తులకు ఆశీస్సులు ఇస్తారని నమ్ముతారు.

15 అక్టోబర్ 2021 : విజయదశమి..

15 అక్టోబర్ 2021 : విజయదశమి..

నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే విజయదశమి(దసరా) పండుగ ప్రారంభమవుతుంది. రాముడు రావణుడిని చంపడం వల్ల ఎలాంటి సంబరాలు జరుపుకుంటారో.. విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడిని అంతమొందించిన రోజు అని.. అందుకే ఈరోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున బుద్ధ జయంతి కూడా జరుపుకుంటారు.

19 అక్టోబర్ 2021 : పూర్ణిమ..

19 అక్టోబర్ 2021 : పూర్ణిమ..

2021 సంవత్సరంలో అక్టోబర్ 19వ తేదీన శరద్ పూర్ణిమ వస్తుంది. ఈ పూర్ణమినే కోజగర్ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున చంద్రుడు చాలా నిండుగా ప్రతి నెల కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈరోజున చంద్రుని కిరణాల వల్ల భూమి మీదకు అమ్రుతం కురుస్తుందని నమ్ముతారు.

24 అక్టోబర్ 2021 : కార్వా చౌత్..

24 అక్టోబర్ 2021 : కార్వా చౌత్..

హిందూ సంప్రదాయం ప్రకారం కార్వా చౌత్ ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు. కార్తీక మాసంలోని క్రిష్ణ పక్షంలో చతుర్థి నాడు ఈ కార్వా చౌత్ ఉపవాసం జరుపుకుంటారు. ఈరోజున పెళ్లైన మహిళలు కొత్త బట్టలు ధరించి, నిర్జల ఉపవాసం పాటించి తమ భర్తలు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు.

28 అక్టోబర్ 2021 : అష్టమి..

28 అక్టోబర్ 2021 : అష్టమి..

కార్వా చౌత్ ముగిసిని తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు మరియు దీపావళి పండుగకు ఎనిమిది రోజుల ముందు అహోయి అష్టమి వస్తుంది. ఈనెల 28వ తేదీన అహోయి అష్టమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసంలో, తల్లులు తమ పుత్రుల సుదీర్ఘ జీవితం కోసం ఉపవాసం ఉంటారు.

English summary

Festivals and Vrats in the month of October 2021

Here are the festival and vrats in the month of october 2021. Have a look.
Desktop Bottom Promotion