For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబరు 2020 : ఈ నెలలో దీపావళితో పాటు ఇతర పండుగలెప్పుడో తెలుసుకోండి...

నవంబర్ నెలలో వ్రతాలు, పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వంటి మహమ్మారి కాలంలో చూస్తుండగానే అక్టోబర్ మాసం ముగిసింది. దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి, దసరా పండుగ ఉత్సవాలు కూడా ముగిశాయి. ఇప్పుడు మనం నవంబరు మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం.

Festivals, Vrats in the month of November 2020

హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో దీపావళి, లక్ష్మీపూజ, నరక చతుర్దశి, గోవర్దన పూజ, భాయ్ దూజ్ ఛట్ పూజతో మరెన్నో పండుగలు ఈ నవంబర్ నెలలో రానున్నాయి.

Festivals, Vrats in the month of November 2020

ఈ సందర్భంగా ఏయే పండుగలు ఏయే తేదీలలో వచ్చాయి... ఆ పండుగల ప్రాముఖ్యత, విశిష్టత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

3,4 నవంబర్ 2020 : అట్ల తద్ది..

3,4 నవంబర్ 2020 : అట్ల తద్ది..

హిందూ క్యాలెండర్ ప్రకారం 3 నవంబర్ 2020 (మంగళవారం) సంవత్సరంలో అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి అయిన వివాహిత మహిళలు తమ భర్తలతో పాటు తమ కుటుంబం జీవితాంతం హాయిగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుకుంటారు. దీన్నే ఉత్తర భారతంలో కార్వాచౌత్ పేరిట జరుపుకుంటారు.

ఈ అట్ల తద్ది యొక్క తిథి నవంబర్ 3వ తేదీన అర్థరాత్రి 1:13 గంటలకు ప్రారంభమై నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున 3:24 గంటలకు ముగుస్తుంది.

8 నవంబర్, 2020 : అహోయి అష్టమి..

8 నవంబర్, 2020 : అహోయి అష్టమి..

నవంబర్ నెలలో వచ్చే మరో ముఖ్యమైన రోజు అహోయి అష్టమి. ఇది 2020 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీ(ఆదివారం) నాడు వచ్చింది. ఈ పండుగ దీపావళికి ముందు సరిగ్గా వారం రోజుల ముందు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున తల్లులు, పిల్లల శ్రేయస్సు కోరుతూ ఉపవాసం ఉంటారు. ఈరోజున ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పూజించిన తర్వాతే ఉపవాసాన్ని విడిచిపెడతారు.

11 నవంబర్ 2020 : రామ ఏకాదశి..

11 నవంబర్ 2020 : రామ ఏకాదశి..

కార్తీక మాసంలో క్రిష్ణ పక్షం సమయంలో వచ్చే ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం రామ ఏకాదశి నవంబర్ 11వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజును శ్రీమహావిష్ణువు మరియు తల్లి లక్ష్మీకి అంకితం చేయబడింది.

13 నవంబర్ 2020: దంతేరాస్,

13 నవంబర్ 2020: దంతేరాస్,

2020 సంవత్సరంలో నవంబర్ 13వ తేదీన ఉత్తర భారతంలో దంతేరాస్ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో క్రిష్ణ పక్షం యొక్క త్రయోదశి రోజున ఈ పండుగ వస్తుంది. ఈరోజున చాలా మంది కొత్త పాత్రలు, బంగారం, ఆభరణాలు, కారు వంటి వాటితో పాటు విలువైన వాటిని కొనుగోలు చేస్తారు. సంపద మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి, కుభేరుడిని ఆరాధిస్తారు.

13 నవంబర్ 2020 : ప్రదోష్ వ్రతం..

13 నవంబర్ 2020 : ప్రదోష్ వ్రతం..

ఈరోజున మన తెలుగు రాష్ట్రాల్లో మాస శివరాత్రి మరియు ప్రదోష్ వ్రతం(క్రిష్ణ) కూడా జరుపుకుంటారు. శివుని రాత్రిని ప్రతి నెలలో ఒకసారి పాటిస్తారు. దీనినే మాస శివరాత్రి అంటారు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రి అన్నింటికన్నా ముఖ్యమైనది. ఈరోజున శివుని భక్తులందరూ ఉపవాసం పాటించి, ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తారు.

14 నవంబర్ 2020 : దీపావళి, లక్ష్మీపూజ..

14 నవంబర్ 2020 : దీపావళి, లక్ష్మీపూజ..

హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ పండుగ సందర్భంగా చాలా మంది హిందువులు లక్ష్మీపూజను, వినాయకులను అమావాస్య తిథి, పాడ్యమి రోజున జరుపుకుంటారు. మరోవైపు నరకాసరుని సంహరణ కూడా ఈరోజే జరిగిందని.. తమ జీవితాల్లో వెలుగులు నిండాయని.. అందుకు ప్రతీకగా చాలా మంది టపాసులు కాల్చితే తమ జీవితాల్లో కాంతులు వస్తాయని నమ్ముతారు.

15 నవంబర్ 2020 : గోవర్దన పూజ..

15 నవంబర్ 2020 : గోవర్దన పూజ..

గోవర్దన పూజను దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజున జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో శుక్ల పక్షంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఒకప్పుడు శ్రీక్రిష్ణ పరమాత్ముడు గోవర్దన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి ప్రజలను భారీ వర్షాల నుండి రక్షించాడని నమ్ముతారు. ఈ పర్వతం కిందే అందరూ ఆశ్రయం పొందారని భావిస్తారు. అందుకే గోవర్ధన పూజ శ్రీక్రిష్ణుడికి అంకితం చేయబడింది.

16 నవంబర్ 2020 : భాయ్ దూజ్..

16 నవంబర్ 2020 : భాయ్ దూజ్..

భాయ్ దూజ్ అనే పండుగ తోబుట్టువుల సంబంధం పవిత్రతను సూచిస్తుంది. దీన్ని కూడా ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు. తోబుట్టువుల మధ్య విడదీయరాని సంబంధం మరియు ఆప్యాయతను ఈ పండుగ చూపిస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న భాయ్ దూజ్ పండుగ ఈ సంవత్సరం నవంబర్ 16వ తేదీన వచ్చింది. భాయ్ దూజ్ ను భయ్యా దూజ్, భాయ్ టికా, యమ ద్వితియా, భత్రు ద్వితియా మొదలైన పేర్లతో పిలుస్తారు.

18 నవంబర్ 2020 : నాగుల చవితి..

18 నవంబర్ 2020 : నాగుల చవితి..

హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో దీపావళి ముగిసిన నాలుగోరోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను ఆరాధిస్తారు. ఈ పండుగను ఎక్కువగా వివాహిత మహిళలు జరుపుకుంటారు. తమ పిల్లలు మంచిగా ఎదగాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఎక్కువగా జరుపుకుంటారు.

20 నవంబర్ 2020 : ఛట్ పూజ..

20 నవంబర్ 2020 : ఛట్ పూజ..

ఛట్ పూజను మహాపర్వ అంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో ఈ ఛట్ పూజను జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఛట్ పూజలో భాగంగా సూర్యభగవానుడిని ఆరాధిస్తారు.

25 నవంబర్ 2020 : దేవుత్తన ఏకాదశి..

25 నవంబర్ 2020 : దేవుత్తన ఏకాదశి..

ఈ సంవత్సరం దేవుత్తని ఏకాదశి నవంబర్ 25వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజున విష్ణువు తన యోగా నిద్ర నుండి మేల్కొన్నాడని నమ్ముతారు. ప్రభోదిని ఏకాదశినే దేవుత్తన ఏకాదశి అని అంటారు. ఈరోజున చాలా మంది ఉపవాసం ఉండి.. మరుసటి సూర్యోదయం తర్వాత ద్వాదశి రోజున ఉపవాసాన్ని విడిచిపెడతారు.

30 నవంబర్ 2020 : కార్తీక పూర్ణిమ..

30 నవంబర్ 2020 : కార్తీక పూర్ణిమ..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఎనిమిదో నెల అయిన కార్తీక మాసంలో ప్రకాశవంతమైన పక్షం యొక్క పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ పవిత్రమైన రోజున మహాదేవుడు త్రిపురసుర అనే రాక్షసుడిని చంపాడని నమ్ముతారు. ఈరోజున గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. అలాగే పేదలకు దానం చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గురునానక్ జయంతి కూడా నవంబర్ 30వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగను సిక్కు వర్గానికి చెందిన వారు జరుపుకుంటారు. ఈ పండుగ సిక్కు మతం వ్యవస్థాపకుడు మరియు ఈ సమాజానికి చెందిన మొదటి గురువు గురునానక్ జన్మదినాన్ని సూచిస్తుంది.

English summary

Festivals, Vrats in the month of November 2020

Read on to know about those festivals that will be celebrated in November month, check out this article.
Desktop Bottom Promotion