For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు.. వ్రతాలు, శుభముహుర్తాలివే...!

అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు, వ్రతాల గురించి తెలుసుకుందాం.

|

2020 సంవత్సరంలో మనం అక్టోబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో.. ఈ నెలలో హిందువులంతా దేవీ నవరాత్రులు, విజయదశమితో పాటు అనేక పండుగలు, వ్రతాలను జరుపుకోవడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

Festivals, Vrats in the month of October 2020

హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వీయుజ అధిక మాసమైన ఈ నెలలో దసరా పండుగతో పాటు సరస్వతి పూజ(దక్షిణ భారతదేశంలో), వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి అనేక ఇతర పండుగలను జరుపుకోనున్నారు.

Festivals, Vrats in the month of October 2020

ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు.. ముఖ్యమైన శుభ ముహర్తాల గురించి కొన్ని వివరాలను తెలుసుకోండి...

ఐశ్వర్య కాళీ దీపం ఏ వారం వెలిగిస్తే మంచి ఫలితాలొస్తాయో తెలుసా...!ఐశ్వర్య కాళీ దీపం ఏ వారం వెలిగిస్తే మంచి ఫలితాలొస్తాయో తెలుసా...!

అక్టోబర్ 1వతేదీ- అధిక మాస పూర్ణిమ..

అక్టోబర్ 1వతేదీ- అధిక మాస పూర్ణిమ..

అధిక మాసంలో (పురుషోత్తమం మాసం) యొక్క పౌర్ణమి రోజు అధిక మాస పూర్ణిమ అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. వారి వారి ఇళ్లలో లేదా కార్యాలయాల్లో సత్యనారాయణ పూజలు చేస్తారు. అలాగే ఈరోజున ఉపవాసం కూడా ఉంటారు.

అక్టోబర్ 5-విభూవన సంకష్ట చతుర్థి..

అక్టోబర్ 5-విభూవన సంకష్ట చతుర్థి..

అక్టోబర్ 5వ తేదీన విభూవన సంకష్ట చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఆరాధించే భక్తులు ఉపవాసం పాటించాలి. ఈ ఉపవాసం విడవాలనుకునేవారు రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని ముగించాలి. దీన్ని అధిక మాసం యొక్క ఈ సంకాష్టాన్ని విభూనవ సంకష్ట చతుర్థి అని పిలుస్తారు.

అక్టోబర్ 13 మరియు అక్టోబర్ 27 - ఏకాదశి

అక్టోబర్ 13 మరియు అక్టోబర్ 27 - ఏకాదశి

ఈ అశ్వీయుజ అధికమాసంలో రెండు ఏకాదశలు వచ్చాయి. అందులో మొదటిది పరమ ఏకాదశి అక్టోబర్ 13న వచ్చింది. పాపన్ కుషా ఏకాదశి అనేది రెండోది ఇది అక్టోబర్ 27వ తేదీ. పవిత్రమైన ఈరోజుల్లో శ్రీ మహావిష్ణువు భక్తులు ఒక రోజంతా ఉపవాసం ఉంటారు.. ఆ స్వామి వారికి పూజలు చేసి మోక్షం పొందటానికి.. ఆ దేవుని ఆశీస్సులు కోరుకుంటారు.

జీవితంలో విజయం సాధించేందుకు శివుడు చెప్పిన రహస్యాలేంటో తెలుసా...!జీవితంలో విజయం సాధించేందుకు శివుడు చెప్పిన రహస్యాలేంటో తెలుసా...!

అక్టోబర్ 14 మరియు అక్టోబర్ 28 - ప్రదోష్ వ్రతం

అక్టోబర్ 14 మరియు అక్టోబర్ 28 - ప్రదోష్ వ్రతం

ఈ రెండు రోజులు శివ భక్తులకు ఎంతో పవిత్రమైనవి. త్రయోదశి తిథిలో పరమేశ్వరుని భక్తులు ఒక రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూజలు చేస్తారు. దీనిని ప్రదోష్ వ్రతం అంటారు.

నవరాత్రులు-దుర్గాపూజ

నవరాత్రులు-దుర్గాపూజ

ఈ నెలలో అక్టోబర్ 17 నుండి 25 వరకు అత్యంత పవిత్రమైన రోజులు. ఎంతో విశిష్టత కలిగిన ఈ రోజుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 26వ తేదీన దుర్గామాత పూజలను చేసుకుంటారు. ఈ నవరాత్రులు దుర్గామాతకు అంకితమివ్వబడింది. ఈ నవరాత్రి సమయంలో, ఉత్తర భారతదేశంలో భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే దక్షిణాన అమ్మవారి విగ్రహాలు మరియు బొమ్మలను ఏర్పాటు చేసి ఆ దేవిని ఆరాధిస్తారు. తూర్పు, పశ్చిమ భారతదేశంలోని భక్తులు కూడా ఈ ఉత్సవాలను ఎంతో భక్తితో, ఉత్సాహంతో జరుపుకుంటారు.

అక్టోబర్ 25 - విజయ దశమి లేదా దసరా

అక్టోబర్ 25 - విజయ దశమి లేదా దసరా

మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గామాత సంహరించిందని.. ఆ పవిత్రమైన రోజునే విజయ దశమిగా జరుపుకుంటారు. అందుకే ఈరోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అలాగే చెడుపై మంచి విజయం సాధించిందని చాలా మంది నమ్ముతారు.

అక్టోబర్ 26 - మైసూర్ దసరా

అక్టోబర్ 26 - మైసూర్ దసరా

మన దేశంలోనే అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలు జరిగే తొలి ప్రాంతం మైసూరు ప్రాంతం. ఈ వేడుకలను తిలకించడానికి ప్రతి ఏడాది వేలాది మంది సందర్శకులు తరలివస్తారు. పురాతన సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలను నవరాత్రి మొదటి రోజున ప్రారంభమై విజయ దశమి రోజు వరకు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు చాముండేశ్వరి దేవతా విగ్రహాన్ని బంగారు మంటపంలో కూర్చొబెట్టి ఊరేగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు.

అక్టోబర్ 29 - మిలాడ్-ఉన్ నబీ

అక్టోబర్ 29 - మిలాడ్-ఉన్ నబీ

ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో మిలాద్-ఉన్ నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ ఒకటి. మహ్మద్ ప్రవక్త జన్మించినందుకు గుర్తుగా.. ఈ పండుగను జరుపుకుంటారు. అతను ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మూడవ నెల రబీ అల్-అవ్వాల్ యొక్క పన్నెండవ రోజు మక్కాలో జన్మించాడు.

అక్టోబర్ 30 - శరద్ / కొజగర పూర్ణిమ

అక్టోబర్ 30 - శరద్ / కొజగర పూర్ణిమ

అశ్విన్ పౌర్ణమి రోజును శరద్ లేదా కొజగర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, దేశంలోని తూర్పు ప్రాంతాలలో ప్రజలు లక్ష్మి పూజలు జరుపుకునేటప్పుడు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు.

అక్టోబర్ 31 - వాల్మీకి మరియు మీర్బాయి జయంతి

అక్టోబర్ 31 - వాల్మీకి మరియు మీర్బాయి జయంతి

భారత దేశంలోనే గొప్ప సంస్కృత రచయిత, రుషి వాల్మీకి మరియు మీరాబాయి జన్మదిన వార్షికోత్సవాలు ఈరోజునే జరుపుకుంటారు. పురాతన భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని వాల్మీకి రచించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని మనందరికీ తెలుసు. అలాగే మీరబాయి శ్రీకృష్ణుడి పట్ల ఉన్న భక్తికి పేరుగాంచింది.

English summary

Festivals, Vrats in the month of October 2020

Check out know the festivals, vrats in the month of october 2020. Read on
Desktop Bottom Promotion