ఈ గణేష మంత్రాలను మనసారా స్మరిస్తే మంచి లాభాలు

By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

ఇష్ట దైవాన్ని మనసారా ఆరాధిస్తే కష్టాలు తొలుగుతాయని చాలామంది నమ్మకం. ఆలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులకు ధూపదీపాలు, నిత్యనైవేద్యాలు సమర్పించడం పరిపాటి. నిత్యం నిర్మలమైన మనస్సుతో మంత్రాలు జపిస్తే దేవుళ్లను పూజిస్తే మంచి చేకూరుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు దేవుడిపై భారం వేయాలంటారు.

కానీ కొంత మంది సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అని భావిస్తుంటారు. మరికొందరు దేవుడా నీవే దిక్కు అని చెబుతుంటారు. కొంత మంది ఎలాంటి సమస్యనైనా ఒడిదుడుకులైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు సహాయపడుతాయి.

10 చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

మీకున్న సమస్య నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించడానికి మంత్రాలు సహాయపడతాయి. అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది. సంపద, శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీ దేవిని పూజిస్తారు. కాబట్టి అమ్మవారిని మంత్రం ద్వారా స్మరించుకోవడం వల్ల జీవితంలో శ్రేయస్సు పొందుతారు. మరి ఆ మంత్రాలు ఏమిటి, వాటిని ఎలా జపించాలనే విషయాలను తెలుసుకుందామా...

గణపతి మంత్రం

గణపతి మంత్రం

"ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపథాయే.. వర వత్ర సర్వజనమాయ్ వాసమానయ స్వాహా ఏకదంతాయ విద్ మహే వక్రతుండాయా దీమహి తన్నో దంతి ప్రచోదయాత్"

ఈ మంత్రాన్ని ఇలా పఠిస్తే మంచి ఫలితాలు పొందగలుతారు. మీరు వినాయకుడి విగ్రహం ముందు కూర్చుని ఈ మంత్రం పఠించండి. ఈ శ్లోకాన్ని 108 లేదా 1008 సార్లు పఠించడం చాలా మంచిది. ఇలా 21 రోజుల పాటు చేస్తే అద్రుష్టం మీ తలుపు తడుతుంది.

ప్రేమను చూరగొనాలంటే.. ఈ మంత్రం

ప్రేమను చూరగొనాలంటే.. ఈ మంత్రం

"ఓమ్ కాం దేవాయ విద్యుమహే పుష్పబాణాయ ధీమాహి టన్నో అంగ ప్రచోదయత్ కాం దేవ్ భీజ్ మంత్ర ఖ్లేం"

ఈ మంత్రాన్ని మీరు పఠించేపటప్పుడు కొన్ని జాగ్ర్తత్తలు తీసుకోవాలి.

మీరు శుక్రవారం రాత్రి ఈ మంత్రాన్ని జపించండి. వినాయకుడిని ఆరాధించిన తర్వాత ఈ మంత్రాన్ని పాటిస్తే విజయం సొంతం అవుతుంది. అలాగే నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా 40 రోజుల పాటు చేస్తే అందరి మన్ననలు, ప్రేమను మీరు చూరగొంటారు. మీరు అనుకున్నవి సాధించే అవకాశం ఉంటుంది.

సంపద కొరకు అష్టవినాయక మంత్రాలు!

అదృష్టాన్ని తీసుకొచ్చే మంత్రం

అదృష్టాన్ని తీసుకొచ్చే మంత్రం

అదృష్టం మీ వెంటే ఉండాలని భావిస్తున్నారా? అయితే మీరు మహాలక్ష్మి మంత్రం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి. మీరు జపించాల్సిన మంత్రం ఇదే...

"ఓం శ్రీం అఖండ్ సౌభాగ్యం ధన్ సమిరిదిమ్ దేహి దేహి నమః"

అయితే ఈ మంత్రాన్ని బుధవారం జపిస్తే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు. అలాగే మంత్రం పఠించే సమయంలో మీరు నెయ్యితో దీపం వెలిగించాలి. లక్ష్మి దేవిని నిష్టతో పూజించాలి. 11 రోజుల పాటు మంత్రాన్నిజపిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది.

English summary

Ganesha Mantras That Can Make You Rich

These mantras need to be chanted at the right time for their best results.
Story first published: Friday, November 3, 2017, 17:30 [IST]
Subscribe Newsletter