For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరుడ పురాణం ప్రకారం వాళ్ల ఇళ్లలో అన్నం తినకూడదు, వ్యభిచారిణి, దొంగలు ఇలా చాలా మంది ఇళ్లలో తినొద్దు

ఇతరులను బెదిరించే డబ్బు సంపాదంచేవారి ఇళ్లలో అస్సలు తినకండి. నీచపు గుణాలున్న వ్యక్తులు ఇతరుల మనోభావాలను దెబ్బతీసి డబ్బు సంపాదిస్తుంటారు. అలాంటి వారి ఇళ్లలో అస్సలు తినకండి. బ్యాకెట్స్, ఒకరి మాటలను మర

|

గరుడ పురాణం వేద వ్యాసుడు రచించాడు. ఈ పుస్తకంలో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉంటాయి. తోటి మానవులతో ఎలా మెలగాలనే విషయాలపై చాలా అంశాలు ఈ పుస్తకంలో వివరించారు. కొందరు ఇళ్లలో అన్నం తినకూడదని గరుడపురాణంలో చెప్పారు.

అలా తింటే వాళ్ల ఇళ్లలో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం మీ శరీరంలోక వస్తుంది. ఆ ప్రతికూల శక్తి మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల అలా తినకండి అని గరుణపురాణంలో పేర్కొన్నారు.

దొంగ లేదా క్రిమినల్

దొంగ లేదా క్రిమినల్

ఎప్పుడగానీ ఒక నేరస్థుడి ఇంటిలో అన్నం తినకూడదు. వాళ్లు అరాచకాలు, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో తయారు చేసిన అన్నాన్ని తింటే ఆ పాపం నీకు కూడా తగులుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగల ఇంట్లోగానీ, క్రిమినల్ ఇళ్లల్లోగానీ అన్నం తినకండి. ఆ పాపంలో మీరు కూడా భాగం కాకండి.

 చెడు గుణాలున్న స్త్రీ ఇంట్లో

చెడు గుణాలున్న స్త్రీ ఇంట్లో

మోసం చేసేటటువంటి గుణం ఉన్న స్త్రీ ఇంట్లోగానీ, వ్యభిచారం చేసే అమ్మాయి ఇంట్లోగానీ అన్నం తినకూడదు. అలాంటి వాళ్ల ఇంట్లో అన్నం తింటే ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములే అవుతారు. వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బుతో వండిన ఆ అన్నం తింటే నువ్వు కూడా వ్యభిచారం చేసిన కిందకే లెక్క అని గరుణపురాణంలో ఉంది.

అధిక వడ్డీ

అధిక వడ్డీ

కొందరు అవతలి వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని వచ్చే వారిపై కాస్త కూడా కనికరం లేకుండా అధిక వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. అలాంటి వ్యక్తుల ఇళ్లలో కూడా అస్సలు భోజనం చేయకండి. ఆ పాపం మీకు కూడా తగులుతుంది.

Most Read :యుద్ధనీతి విడిచి భీముడు దుర్యోధనుడి తొడలపై ఎందుకు కొట్టి చంపాడు, బలరాముడు భీమున్ని ఎందుకు చంపాలనుకున్నాడుMost Read :యుద్ధనీతి విడిచి భీముడు దుర్యోధనుడి తొడలపై ఎందుకు కొట్టి చంపాడు, బలరాముడు భీమున్ని ఎందుకు చంపాలనుకున్నాడు

అనవసరంగా కోపం తెచ్చుకునే వారు

అనవసరంగా కోపం తెచ్చుకునే వారు

కోపాన్ని నియంత్రించలేని వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండడమే మంచిది. కోపం ఎక్కువగా ఉండే వ్యక్తులు చాలా ప్రమాదకం. వాళ్లకు అనవసరం వచ్చే కోపం వల్ల మీరు కూడా ఇబ్బందులుపడతారు. అందువల్ల అలాంటివారి ఇళ్లలో కూడా అస్సలు తినకండి.

నీచపు గుణాలండే వ్యక్తి లేదంటే రాజు

నీచపు గుణాలండే వ్యక్తి లేదంటే రాజు

ఇతరులను బెదిరించే డబ్బు సంపాదంచేవారి ఇళ్లలో అస్సలు తినకండి. నీచపు గుణాలున్న వ్యక్తులు ఇతరుల మనోభావాలను దెబ్బతీసి డబ్బు సంపాదిస్తుంటారు. అలాంటి వారి ఇళ్లలో అస్సలు తినకండి.

బ్యాకెట్స్, ఒకరి మాటలను మరొకరికి చెప్పేవారు

బ్యాకెట్స్, ఒకరి మాటలను మరొకరికి చెప్పేవారు

మీ విషయాలను మరొకరికి చెప్పడం, ఇతరుల విషయాలను మీకు చెప్పే వారిని అస్సలు నమ్మకండి. అలాంటి వారు లేని పోని విషయాలను స్రుష్టించి చెబుతుంటారు. వాళ్లు ఆడే ఆటలో మీరు కీలుబొమ్మలుగా మారకండి. అలాంటి స్వభావం ఉన్న వాళ్లకు దూరంగా ఉండడంతో పాటు వాళ్ల ఇళ్లలో ఎప్పుడు కూడా అన్నం తినకండి.

డ్రగ్స్ డీలర్స్, స్మగ్లర్స్

డ్రగ్స్ డీలర్స్, స్మగ్లర్స్

మాదకద్రవ్యాల డీలర్లు తరచూ వారి స్నేహితులకు మర్యాదలు చేయాలని భావిస్తుంటారు. అలా మర్యాదలు చేసి వారిని కూడా డ్రగ్స్ కు అలవాటు చేస్తారు. అలాంటి వ్యక్తులు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. వాళ్లు చేసే పనుల వల్ల చాలా మంది అమాయకుల జీవితాలు నాశనం అవుతాయి. అందువల్ల అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వాళ్ల ఇళ్లలో అస్సలు తినకండి.

Most Read :ఈ రాశి చక్రాల వారు ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు, ఆత్మవిశ్వాసం ఆయుధం, విజయమే లక్ష్యంMost Read :ఈ రాశి చక్రాల వారు ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు, ఆత్మవిశ్వాసం ఆయుధం, విజయమే లక్ష్యం

పేదవారి ఇంటిలో

పేదవారి ఇంటిలో

పేద వారు ప్రేమగా అన్నం తినమని మిమ్మల్ని పిలవచ్చు. కానీ వారి ఇళ్లలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే కూటికి లేని వారి ఇళ్లలో తింటే ఆ పాపం మీకు తగులుతుంది. వాళ్లు తినడానికే అన్నం ఉండదు. మరి మీకు వారు ఎలా పెట్టగలరనే విషయాన్ని మీరు ఆలోచించాలి.

English summary

Garuda Puran: One Should Never Have Food In these People Houses

Garuda Puran: One Should Never Eat In The House Of These People
Desktop Bottom Promotion