మహాలక్ష్మి అమ్మవారి ప్రసిద్ధ ఆలయాలు

By: Deepti
Subscribe to Boldsky

ధనసంపదలకి, సుఖసంతోషాలకి అధీన దేవత మహాలక్ష్మి అని అందరికీ తెలిసిందే. ఆమె సుఖసంపదలను ఇచ్చే తల్లి మాత్రమే కాదు. దయ, మంచితనానికి కూడా ప్రతీక.

మహావిష్ణువు తన భక్తులకు సులభంగా వరాలివ్వడని ప్రతీతి. కానీ అదే భక్తుడి గురించి అమ్మవారు నివేదిస్తే, వెంటనే మహావిష్ణువు వారి కోరికలన్నీ తీరుస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి దయ, కరుణ అటువంటివి.

భక్తులు ఆమె బిడ్డల వంటివారు మరియు ఏ తల్లి తన బిడ్డ కష్టాన్ని చూడలేదు. మన జీవితాల్లో కూడా చూస్తుంటాం, తండ్రి అడిగినది ఇవ్వకపోతే, బిడ్డ తల్లి ద్వారా అది సాధించుకుంటాడు.

మనదేశంలో ఆమె కోసం ప్రత్యేక ఆలయాలు వెలిసాయి. ఇవి జీవితంలో ఒక్కసారన్నా చూసి తీరాల్సినవి. అమ్మవారి అనుగ్రహం కోసం చేసే వరమహాలక్ష్మి వ్రతం ఆమెకు మనల్ని దగ్గరచేయటమే కాదు, ఆమె నివాసముండే ఆలయాలను దర్శించడం వల్ల ఈ వ్రత విధి,పండగ పూర్తి అవుతుంది.

ఈ వ్యాసంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల గురించి వివరించాం.

అక్షయ తృతీయ రోజున తప్పకుండా పఠించాల్సిన 'మహాలక్ష్మీ' స్త్రోత్రం..

లక్ష్మీదేవి ఆలయం – హస్సన్ – దొడ్డగొడ్డవల్లి

లక్ష్మీదేవి ఆలయం – హస్సన్ – దొడ్డగొడ్డవల్లి

11వ శతాబ్దంలో హస్సన్- లక్ష్మీదేవి ఆలయాన్ని విష్ణువర్ధన అనే మహారాజు హొయసల రకపు నిర్మాణశైలిలో కట్టించాడు. ఇందులో నాలుగు ఆలయాలుండి ఆ శైలిని చతుష్కుట శైలి అని కూడా అంటారు. ఆలయంలోని దేవతలు మహాలక్ష్మి, విష్ణువు, భూతనాథుడు మరియు మహాకాళి. ఈ ఆలయం హసన్- బేలూర్ హైవే పైన ఉన్న హస్సన్ జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

లక్ష్మీనారాయణ ఆలయం లేదా బిర్లా మందిర్ – న్యూఢిల్లీ

లక్ష్మీనారాయణ ఆలయం లేదా బిర్లా మందిర్ – న్యూఢిల్లీ

ఈ గుడి అరఎకరం విస్తీర్ణంలో విశాలంగా కట్టబడింది. చుట్టూ అద్భుత దృశ్యాలు, ఫౌంటెన్లతో అలంకరించబడింది. ఇక్కడి ప్రధాన దేవతలు లక్ష్మీనారాయణుడు లేక మహావిష్ణువు, మరియు ఆయన ప్రియభార్య మహాలక్ష్మి అమ్మవారు. పరమశివుడు, కృష్ణభగవానుడు మరియు బుద్ధుడి చిన్న చిన్న ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

మహాలక్ష్మి ఆలయం – కొల్హాపూర్

మహాలక్ష్మి ఆలయం – కొల్హాపూర్

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మి ఆలయం దేశానికే గర్వకారణమైన సంస్కృతికి నిదర్శనం. అద్భుత నిర్మాణశైలి మాత్రమే కాక మతపరంగా కూడా ప్రసిద్ధమైనది. దీన్ని చాళుక్య రాజులు 17వ శతాబ్దంలో కట్టించారు. పురాణాల ప్రకారం అమ్మవారి శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి.

మహాలక్ష్మి విగ్రహం ఏకశిలపై 40 కిలోల బరువు, 3అడుగుల ఎత్తులో, నల్లరాయితో చెక్కబడినది. అమ్మవారికి నాలుగు చేతులుంటాయి. దేవతా విగ్రహం వెనుక సింహవాహనం లేక రాతి సింహం నిలపబడి ఉన్నాయి. కిరీటంపై మహావిష్ణువు కొలువుండే శేషనాగు కూడా అలంకరింపబడి ఉంటుంది.

నాలుగు చేతుల్లో ఈ కింది వివిధ శిల్పాలు కొలువుదీరి ఉంటాయి.

కింద కుడిచేయి, నిమ్మజాతి పండు - మ్హాలుంగ

పైన కుడిచేయి, పెద్ద గద నేలకి తాకుతూ ఉంటుంది - కౌముదకి

పైన ఎడమచేయి, ఒక డాలు - ఖేతక

కింద ఎడమచేయి, ఒక పాత్ర - పన్ పాత్ర

ఉత్తరం లేదా తూర్పు అభిముఖంగా ఉండే ఇతర హిందూ దేవత విగ్రహాల లాగా కాకుండా, ఈ అమ్మవారు పశ్చిమం వైపు తిరిగి ఉంటారు. పడమరవైపున్న గోడకి చిన్న కిటికీ ఉండి, ప్రతి మార్చి మరియు సెప్టెంబరు నెలల్లో 21వ తేదీ వద్ద దాదాపు మూడురోజుల పాటు అస్తమిస్తున్న సూర్యకిరణాలు ఆ కిటికీ ద్వారా అమ్మవారి విగ్రహంపై పడతాయి.

శ్రీ మహాలక్ష్మి ఆలయం ముంబై

శ్రీ మహాలక్ష్మి ఆలయం ముంబై

ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం భూలాభాయి దేశాయ్ రోడ్డులో ఉంది. ఈ గుడిలో ముగ్గురు దేవతలుంతారు -శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, మరియు మహాశక్తి. ముస్లింల దాడి నుంచి తప్పించటానికి ఈ మూడు విగ్రహాలను వర్లి వద్ద సముద్రంలో ముంచి దాచారని నమ్ముతారు.

బ్రిటీష్ పాలన రాకతో మార్పులు వచ్చి, వర్లి, మలబార్ లను కలపాలని నిర్ణయించుకున్నారు. ఈ పని ప్రభుత్వ ఇంజనీరు శ్రీ రామ్జీ శివ్జీ ప్రభు ఆధ్వర్యంలో జరిగింది. కానీ కట్టిన ప్రతిసారీ ఈ వంతెన కూలిపోతుండటంతో ఈ పని పూర్తవ్వకుండానే ఉండిపోయింది.

మహాలక్ష్మి అమ్మవారు లార్డ్ హార్న్ బై, బ్రిటీష్ అధికారి కలలో కన్పించి విగ్రహాలను నీటిలోంచి తీసి కొండపై ప్రతిష్టించమని ఆదేశించారని అనుకుంటారు. ఈ సూచనలు పాటించగానే, వంతెన పడిపోకుండా నిలిచి పని ఆగకుండా పూర్తయింది. ఈ ఆలయాన్ని 1761 నుండి 1771 మధ్యప్రాంతంలో నిర్మించారు.

అష్టలక్ష్మి ఆలయం – చెన్నై

అష్టలక్ష్మి ఆలయం – చెన్నై

అష్టలక్ష్మి ఆలయం లేదా తమిళభాషలో కోవెల, చెన్నైలోని ఎల్లియట్'స్ బీచ్ లో ఉన్నది. ఈ గుడి మహాలక్ష్మి ఎనిమిది ప్రముఖ సంపద రూపాలైన - సంతానం, విజయం, సంపద, సుఖం, ధైర్యం, ఆహారం, జ్ఞానంలకు అంకితమిస్తూ కట్టబడింది.

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వకూడదు? కారణం ఏమిటి?

కంచి మఠానికి చెందిన హిందూ గురువు శ్రీ చంద్రశేఖర పరమాచార్య సంరక్షణలో నిర్మించబడింది.అనేక అంతస్తులలో కట్టబడిన ఈ గుడిలో భక్తులు అన్ని ఎనిమిది ఆలయాలను ఏ పవిత్ర శక్తి పీఠాలను తొక్కకుండా దర్శించుకునే విధంగా కట్టబడింది. ఇది 1974 లో నిర్మాణం మొదలై 1976లో భక్తుల కోసం తెరవబడింది.

సిరిపురం బంగారు ఆలయం – వెల్లూర్

సిరిపురం బంగారు ఆలయం – వెల్లూర్

సిరిపురం కోవెల వెల్లూర్ లోని తిరుమలైకోడిలో ఉన్నది. కొండల మధ్యలో కింద ఉన్న ఈ గుడి వద్ద ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి ఈ ఆలయం 1500 కిలోల బంగారంతో నిర్మించబడింది. నక్షత్ర ఆకారంలో శ్రీ చక్రానికి గుర్తుగా నిర్మించబడ్డ గుడి 1.8కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గర్భగుడికి నడిచి వెళ్ళేదారిలో వేదాలలో ఉన్న భక్తి సందేశాలను గోడలపై చదవవచ్చు.

English summary

Goddess mahalakshmi | significant temples dedicated to goddess mahalakshmi

Take a look at the significant temples dedicated to Goddess Mahalakshmi.
Subscribe Newsletter