నవరాత్రి స్పెషల్ : గుప్త నవరాత్రి అంటే?

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

నవరాత్రిని సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు.నవరాత్రి మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ఓపెన్ నవరాత్రి లేదా ప్రతీక్ష్ అని పిలుస్తారు.మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాద నవరాత్రి అని పిలుస్తారు.

ఈ వేడుక చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు. అందువల్ల గుప్త నవరాత్రి అని పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉపాసకులు జరుపుకుంటారు.

నవరాత్రి స్పెషల్: అమ్మవారి అనుగ్రహానికి ఏ రోజు ఏ కలర్ ధరించాలి ?

Gupt Navratri

సరస్వతి, లక్ష్మీ మరియు దుర్గా దేవిలకు గౌరవ సూచకంగా సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులను జరుపుకుంటున్నారు. నవరాత్రి 9 రోజుల్లో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు.

ప్రతీక్ష మరియు గుప్త నవరాత్రి వేడుకల మధ్య తేడా

ప్రతీక్ష నవరాత్రి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సవ ప్రదర్శనతో జరుపుకుంటారు. గుప్త నవరాత్రని మాత్రం దుర్గా దేవి గుడిలో ఏకాంతంలో జరుపుతారు. దేవతకు వినిపించేలా తంత్ర మంత్రాలు మరియు ఇతర రకాల ప్రార్థనలు జరుపుతూ ఉంటారు.

గుప్త నవరాత్రిని జులై నెలలో (ఆషాడ మాసంలో) జరుపుతారు. ఇది సాధారణంగా జూలై 17 న మొదలై జులై 26 వరకు కొనసాగుతుంది. ఇది కూడా ప్రతీక్ష నవరాత్రి వలే తొమ్మిది రోజుల పండుగ. అయితే ఇది పూర్తిగా దేవికి అంకితం చేయబడుతుంది.

Gupt Navratri

గుప్త నవరాత్రి యొక్క ఆచారాలు

గుప్త నవరాత్రి రోజులు తాంత్రికల కోసం మంచిది. ప్రత్యేక ఆచారాలను చేయాలనుకునే వారికి ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు దేవతను శాంతింపచేయడానికి ఉపవాసాలు,శ్లోకాలు మరియు మంత్రాలు చదువుతారు. ఆ భక్తులకు అమ్మవారి దీవెనలు ఉంటాయి. దేవత మూడు రూపాల్లో పూజింపబడుతుంది. మొదటిది నాలెడ్జ్ దేవత,రెండోవది శ్రేయస్సు మరియు సంపద ఇచ్చే దేవత, మూడోవది అనైతిక అలవాట్లను తొలగించే దేవత.

గుప్త నవరాత్రి తొమ్మిది రోజులు ప్రార్థనలను రహస్యంగా చేస్తారు. మార్కండేయ పురాణంలో దుర్గా సప్తసతిలో ఉన్న పాటలను పాడతారు. ఈ పాటలలో దేవత పురాణం మొత్తం ఉంటుంది. మహిషాసుర సంహారానికి దేవత ఆయుధాలను ఎలా సంపాదించిందో వివరంగా ఉంటుంది. ఈ మంత్రాలు దేవి దెయ్యం మీద ఎలా విజయాన్ని సాధించిందో తెలియజేస్తుంది. సప్తశతి కాకుండా,దేవి మహాత్మాయ, శ్రీమద్ దేవి భగవతంలలో ఉన్న పాటలను కూడా పాడతారు.

తాంత్రిక మోడ్ అత్యంత ప్రసిద్ధమైనది. ఇది గుప్త నవరాత్రి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.

గుప్త నవరాత్రి

గుప్త నవరాత్రి ప్రయోజనాలు

Gupt Navratri

రుచికరమైన వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

గుప్త నవరాత్రి యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు క్రింది ఉన్నాయి.

1. దేవత యొక్క శక్తిని శాంతపరచటానికి ఆషాడ నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. దేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది.

2. దుర్గా దేవి తన భక్తుల బాధలను తగ్గిస్తుంది.

3. ప్రతి రోజు ప్రత్యేక ఆచారాలు మరియు దుర్గా సప్తశతి శ్లోకాలను పఠిస్తారు. దేవత దుఃఖంలో ఉన్న ప్రజల పట్ల దయ చూపుతుంది.

4. గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను మరియు ఆందోళనలను తగ్గిస్తుంది. భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు.

5. రహస్య నవరాత్రి సమయంలో "హైం హ్రిమ్ క్లిమ్ చాముండే నమః"అనే మంత్రాన్ని పఠిస్తారు. ఈ శక్తివంతమైన మంత్రం అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తులు భయం మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ విధంగా గుప్త నవరాత్రి రహస్య ఉత్సవంను మీరు చూడవచ్చు, ఇక్కడ మీరు ప్రత్యేకమైన మంత్రాలను ప్రదర్శించడం ద్వారా మీ నిర్దిష్టమైన కోరికలను తీర్చుకోవచ్చు. నిజమైన భక్తులు తొమ్మిది రోజులు ఆచారాలను పాటిస్తారు. అన్ని రోజులు ఉపవాసం ఉండలేని వారు మొదటి రోజు,నాల్గొవ రోజు మరియు తొమ్మిదొవ రోజు ఉంటే సరిపోతుంది. ఈ సమయంలో పండ్లు మరియు పాలు తీసుకోవచ్చు.

English summary

Gupt Navratri

The most general practise that is observed during all the 4 times Navratri is celebrated, is paying homage to the Goddesses Saraswati, Lakshmi and Durga. All the 9 forms of Devi Durga are revered during the 9 days of Navratri.
Story first published: Monday, September 25, 2017, 18:00 [IST]
Subscribe Newsletter