For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Guru Purnima 2021 : వ్యాసుని అనుగ్రహం పొందాలంటే?

|

ఆషాఢ శుద్ధ పూర్ణమని 'గురు పూర్ణమి' లేదా 'వ్యాస పూర్ణిమ' అని అంటారు. ఈ పౌర్ణమి ఈ సంవత్సరం జులై నెలలో 24వ తేదీ వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది.

అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు.

ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు.. ఒక పండుగలాగా కూడా జరుపుకుంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనావాయితీగా వస్తోంది.

ఇలా గురు భగవానుడిని స్మరించుకుని, గురు పూర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. అయితే గురువు అనగానే వ్యాస మహర్షినే ఎందుకు గుర్తుకొస్తారు? ఎందుకని ఈరోజున ఆయనను అందరూ పూజిస్తారు? అతని ఆశీర్వాదం కోరతారు? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!

ఛాతుర్మాసంలో..

ఛాతుర్మాసంలో..

‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః' గురు పూర్ణమి చాతుర్మస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడీ వెళ్లకుండా ఒకేచోట ఉండి శిష్యులకు జ్ణానబోధ చేసి సమయమే ఛాతర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు.

గురు పౌర్ణమి భూమిక..

గురు పౌర్ణమి భూమిక..

ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపసంపన్నులను సమీపించి, పూజించి, జ్ణానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది. అందుకే గురుపూజ శ్రేష్టమైనదిగా నిలిచింది. అయితే దీనిక ఒక విశిష్ఠమైన కథ దాగి ఉంది.

గురుపౌర్ణమి కథ..

గురుపౌర్ణమి కథ..

పురాణాల ప్రకారం, పూర్వకాలంలో వారణాసి ప్రాంతంలో పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఈ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. వీరికి ఎల్లప్పుడూ భక్తి భావనే. అయితే వీరు ఎన్ని పూజలు చేసినా.. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని నోములు, వ్రతాలు చేసినా వీరికి సంతానం మాత్రం కలగలేదు.

మీరు జులై నెలలో జన్మించారా? అయితే ఈ సందర్భంలో వారిని అస్సలు నమ్మకండి...!

వ్యాసుడు స్నానానికి వస్తున్నాడని..

వ్యాసుడు స్నానానికి వస్తున్నాడని..

అయితే అదే సమయంలో ఓ రోజు వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ గంగానదికి స్నానం చేసేందుకు రహస్యంగా వస్తున్నాడని తెలుసుకుంటారు. దీంతో వారు ఎలాగైనా ఆ గురువును దర్శించుకోవాలని భావిస్తారు.

వేయి కళ్లతో...

వేయి కళ్లతో...

ఆరోజు నుండే వారు ఆ స్వామి దర్శనం కోసం వేయి కళ్లతో వెతకడం ప్రారంభిస్తారు. ఈ సందర్భంలోనే ఒక రోజు బిక్షగాడి రూపంలో చేతిలో దండం, కమండంలతో పాటు వచ్చిన ఓ వ్యక్తిని చూసి వారు వెంటనే అతని పాదాలపై పడి నమస్కరించారు. ఆ సమయంలో ఆ బిక్షగాడు వారిని కసురుకుంటాడు. అయినా సరే వారు మాత్రం ఆయన పాదాలను విడవకుండా ‘మహానుభావుడా తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడు' అని మేము గ్రహించాము. కాబట్టి మమ్మల్ని ఆశీర్విందచమని కోరుతున్నాం అంటారు.

ఏమి కావాలో కోరుకో..

ఏమి కావాలో కోరుకో..

ఆ మాటలు విన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున మొత్తం అన్ని దిక్కులను ఒకసారి చూస్తాడు. ఎవరూ తనను చూడలేని నిర్ధారించుకున్నాక, వెంటనే వారికి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి కార్యం. దానికి మీరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటారు.

జులై నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

ఇచ్చిన మాట ప్రకారం..

ఇచ్చిన మాట ప్రకారం..

వారికి ఇచ్చిన మాట ప్రకారం వారి ఇంటికి విచ్చేసిన వ్యాసమహార్షిని ఆ దంపతులు సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పూలను సిద్ధం చేసి, పూజను నిర్వహించి, అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ముగ్ధుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమంటారు.

సంతానం కావాలని కోరితే..

సంతానం కావాలని కోరితే..

అప్పుడు ఆ స్వామి వారికి, తాము ఎన్ని వ్రతాలు, నోములు చేసినా సంతానం మాత్రం కలగడం లేదని, ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకుంటారు. అందుకు అనుగ్రహించిన మహర్షి త్వరలోనే మీకు తెలివైన, ఐశర్యవంతులైన పది మంది పిల్లలు జన్మిస్తారని ఆశీర్వదిస్తారు.

సంతాన యోగం..

సంతాన యోగం..

ఆ వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతికి సంతానయోగం లభించింది. దీంతో వారు అప్పటి నుండి సుఖసంతోషాలతో పాటు వారి జీవిత చరమ అంకంలో విష్ణు సాయుజ్యాన్ని పొందగలిగారు. అందుకే గురు పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండిస్తున్నారు.

English summary

Guru Purnima 2020 : Interesting facts about guru purnima

Here we talking about Guru purnima 2020 :Interesting facts about purnima. Read on
Desktop Bottom Promotion