For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురు పూర్ణిమ, చంద్ర గ్రహణం ఒకేరోజున వస్తే ఎంత ప్రభావం ఉంటుందో చూడండి...

గురుపూర్ణిమ, చంద్ర గ్రహణం ఒకే రోజు రావడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం గురు పూర్ణిమ జులై 5వ తేదీన వచ్చింది. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజునే గురు పూర్ణిమగా జరుపుకుంటారు.

Gurupurnima and Lunar Eclipse on same day, know the effects

అంతేకాదు వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా ఆరోజు. ఆ గురు భగవానుడికి స్మరించుకునేందుకు ఈరోజును పవిత్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా చాలా మంది హిందువులు భావిస్తారు. ఈ వేడుకను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు.

Gurupurnima and Lunar Eclipse on same day, know the effects

ఇదిలా ఉండగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే జులై 5వ తేదీన మరో చంద్ర గ్రహణం కూడా ఏర్పడబోతోంది. గత నెలలో జూన్ 5వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణం కూడా ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేవలం నెలరోజుల వ్యవధిలోనే మరో గ్రహణం రావడం విశేషం.

Gurupurnima and Lunar Eclipse on same day, know the effects

అయితే ఈసారి గురు పూర్ణిమ రోజున ఏర్పడే ఈ చంద్ర గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. దీంతోపాటు ఇలా ఒకేరోజు రెండు విశేషాలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ సందర్భంగా వీటి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!

గురు పూర్ణిమ తేదీ, సమయం..

గురు పూర్ణిమ తేదీ, సమయం..

గురు పూర్ణమి ఈ నెలలో 4వ తేదీ ఉదయం 11:33 గంటలకు ప్రారంభమై, జులై 5వ తేదీ ఉదయం 10:13 గంటల వరకు కొనసాగుతుంది.

గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత..

గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత..

ఈ పౌర్ణమి రోజును హిందువులు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు భారతదేశంలో ప్రసిద్ధ గురు శిష్య సంప్రదాయాన్ని జరుపుకునే రోజును సూచిస్తుంది. ఈ దేశంలో గురువులకు భగవంతుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒక గురువు మాత్రమే ఒక వ్యక్తికి అజ్ణానం అనే చీకటి నుండి వెలుగులోకి నడిపించగలడు. ఇది ఇప్పటిది కాదు. పురాతన కాలం నుండి ఈ దేశంలో గురువులకు గౌరవనీయమైన స్థానం ఇవ్వబడింది. గురు పూర్ణిమ రోజున గురువులను పూజించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని హిందువుల నమ్మకం.

గురు పూర్ణిమ రోజున చంద్ర గ్రహణం..

గురు పూర్ణిమ రోజున చంద్ర గ్రహణం..

ఈ పవిత్రమైన పండుగ రోజునే చంద్ర గ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇది జులై 5వ తేదీన ఉదయం 8:38 గంటలకు ప్రారంభమై ఉదయం 11:21 గంటలకు ముగుస్తుంది. ఇలా గ్రహణం మొత్తం 2 గంటల 43 నిమిషాల 24 సెకన్ల పాటు కొనసాగనుంది. అయితే ఆయా ప్రాంతాలను గ్రహణ సమయాలు మారే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం మన దేశంలో మాత్రం కనబడదు. అయితే ఇది అమెరికా, యూరప్ మరియు ఆస్ట్రేలియాలో చూడొచ్చు.

Guru Purnima 2020 : వ్యాసుని అనుగ్రహం పొందాలంటే?Guru Purnima 2020 : వ్యాసుని అనుగ్రహం పొందాలంటే?

చంద్ర గ్రహణ ప్రభావం...

చంద్ర గ్రహణ ప్రభావం...

గురు పూర్ణమి రోజున చంద్ర గ్రహణం భారతదేశంలో ప్రభావవంతంగా ఉండదని పండితులు చెబుతున్నారు. దీనికి కారణం ఇది మన దేశంలో కనిపించకపోవడమే.

ఈ రాశి వారికి సానుకూలం..

ఈ రాశి వారికి సానుకూలం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ చంద్ర గ్రహణం ధనస్సు రాశిలో జరగబోతోంది. ఈ సమయంలో గురుడు మరియు రాహువు ఉంటారు. దీని వల్ల ధనస్సు రాశి వారికి గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అయితే మీకు ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావచ్చు. మీ మనసును అదుపులో ఉంచేందుకు ధ్యానం చేయాలి.

గ్రహణం యొక్క ప్రభావం..

గ్రహణం యొక్క ప్రభావం..

ధనస్సు రాశితో పాటు మరికొన్ని రాశుల వారికి ఈ చంద్ర గ్రహణం అనుకూలంగా ఉండబోతోంది. వాటిలో కర్కాటక రాశి, సింహ రాశి, కన్య రాశిలపై ఈ గ్రహణం యొక్క ప్రభావం కొంతమేరకు ఉంటుంది. ఈ సమయం ఈ రాశుల వారు ద్యానం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

Gurupurnima and Lunar Eclipse on same day, know the effects

Lunar Eclipse and Guru Purnima to take place on same day; here’s everything you need to know.
Desktop Bottom Promotion