అత్యంత ప్రేమింపబడే దుర్మార్గుడు రావణుడు అని చరిత్ర ఎందుకు చెబుతుందో మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సీతాదేవిని అపహరించి లంకలో దాచిపెట్టిన ఒక రాక్షసుడిగా రావణుడిని అందరూ గుర్తిస్తారు మరియుసీతా దేవిని రావణుడు బంధించాడు. ఆ సమయంలో మహా విష్ణువు తన ఏడవ అవతారంలో రాముడిగా అవతరించి రావణుడిని ఓడించారు. లంకలో జరిగిన భీకరమైన యుద్ధంలో రాముడు రావణుడి ఆట కట్టించి ఓడించడం జరిగింది.

చెడు పై మంచి విజయం సాధించింది, ఎప్పటికి అలాగే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి చిహ్నంగా దసరా అనే పండుగ జరుపుకోవడం జరుగుతుంది. హిందూ పురాణాలలో రావణుడి ది అత్యంత ముఖ్యమైన పాత్ర. రావణుడిని అందరూ ఒక దుర్మార్గుడిలా చూస్తారు. కానీ, అతని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

సాధారణంగా రావణుడు చెడ్డవాడని లేదా రాక్షస మనస్తత్వం కలవాడని అందరూ అంటుంటారు. కానీ, అత్యంత గొప్పవాళ్ళు హిందూ పురాణాల ఆధారంగా చెబుతున్నది ఏమిటంటే, చరిత్రలో అత్యంత ప్రేమించబడ్డ దుర్మార్గులలో రావణుడు ఒకడు. హిందూ దేవుళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. వారిలో ఉన్న మంచి లక్షణాలను మనం అందరం అర్ధం చేసుకొని గ్రహించి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలానే రావణుడు మొత్తంగా చెడ్డవాడు ఏమి కాదు. అతనిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. అవి అతడిని చరిత్రలో రాక్షసుడి కంటే కూడా వేరే స్థానంలో నిలబెడతాయి.

చరిత్రలో రావణుడిని అత్యంత ప్రేమించబడే దుర్మార్గుడిగా ఎందుకు పేర్కొంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1 ఒకసారి రావణుడు రాముడి కోసం యజ్ఞాన్ని చేసాడు :

1 ఒకసారి రావణుడు రాముడి కోసం యజ్ఞాన్ని చేసాడు :

హిందూ పురాణాలూ మరియు ప్రాచీన ఆధారాలు ఏమని చెబుతున్నాయంటే, రావణుడు ఒకసారి రాముడి కోసం యజ్ఞం చేసాడంట. ఎప్పుడైతే రాముడు లంకకు వారధి కట్టాలని నిశ్చయించుకున్నాడో, అటువంటి సమయంలో వారికీ ఆ మహాశివుడి ఆశీర్వాదం కావలసి వచ్చింది. అలాంటి సమయంలో వారు యజ్ఞం చేయాల్సి వచ్చింది. మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం సృష్టిలో శివుడికి పరమ భక్తుడు రావణుడు. దాంతో యజ్ఞానికి రావణుడిని ఎంపిక చేయడం జరిగింది. తన గౌరవాన్ని చూపిస్తూ, రావణుడు రాముడికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది.

2 రావణుడు లక్ష్మణుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు :

2 రావణుడు లక్ష్మణుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు :

ఆ కాలంలో అత్యంత ఉత్తమంగా, ఉన్నతంగా చదివిన పండితుల్లో రావణుడు కూడా ఒకడు అనే విషయం మనందరికి తెలుసు.ఒకానొక సమయంలో రాముడు తన తమ్ముడు లక్ష్మణుడికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. రాక్షస రాజు రావణుడి పక్కన కూర్చొని రాజనీతి గురించి మరియు వివిధ అంశాల గురించి అతిముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సిందిగా సూచించాడు. రావణుడు మంచి పండితుడు కావడంతో తన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఆనందించాడు. వచ్చింది తన శత్రువు అయినా పట్టించుకోలేదు.

3 గ్రహాల అమరికలో జోక్యం చేసుకున్నాడు :

3 గ్రహాల అమరికలో జోక్యం చేసుకున్నాడు :

తన కొడుకు మేఘనాధుడు జన్మించే సమయంలో గృహాలన్నీ కూడా తన కొడుకు యొక్క 11 వ గృహంలో ఉండాలని గ్రహాలని ఆదేశించాడు. కానీ, ఆ రాక్షస రాజు ఉపదేశాలను ఖాతరు చేయకుండా శని పన్నెండవ గృహంలో నిలుచున్నాడు. దీంతో రావణుడి విపరీతంగా కోపోద్రుక్తుడై, శని పై దాడి చేసాడు మరియు చెరసాలలో బంధించాడు. రాక్షస రాజు రావణుడు ఎంత శక్తివంతుడంటే, గ్రహాల వ్యవస్థ పై కూడా తన పూర్తి ఆధిపత్యం ఉండేది.

4 రావణుడి పేరుని మహాశివుడు పెట్టడం జరిగింది :

4 రావణుడి పేరుని మహాశివుడు పెట్టడం జరిగింది :

మహాశివుడు కైలాశము లో కాకుండా లంకలో ఉండాలని రావణుడు భావించాడు. దానిని నిజం చేయడానికి పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో తన యొక్క పాదాన్ని పర్వతం పై పెట్టడం తో రావణుడి యొక్క వేలు నలిగిపోయింది. దీంతో రావణుడు నొప్పితో విపరీతంగా అరిచాడు. అంతేకాకుండా శివతాండవం చేసాడు. ఆ సమయంలో నొప్పిని భరించలేక చేతి నుండి నరాలను బయటకు తీసి సంగీతం వాయించాడని కూడా చెబుతూ ఉంటారు. శివుడు రావణుడి యొక్క పనిని చూసి ఎంతగానో ముచ్చట పడి అతడికి రావణుడు అని నామకరణం చేసారు. రావణ అంటే అత్యంత బిగ్గరగా అరిచేవాడు అని అర్ధం.

5. నాలుగు వేదాలకు సంబంధించి యితడు ఒక పండితుడు :

5. నాలుగు వేదాలకు సంబంధించి యితడు ఒక పండితుడు :

చరిత్ర మరియు కొన్ని ఆధారాల ప్రకారం తెలిసే విషయం ఏమిటంటే, రావణుడు సాధారణమైన వ్యక్తి అస్సలు కాదు. తన తండ్రి విశ్రవ శిక్షణలో ఎంతో జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఎన్నో పవిత్రమైన పుస్తాకాలు మరియు వేదానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాడు. రావణుడు ఒక గొప్ప పండితుడు అని చాలామంది బలంగా నమ్ముతారు.

6 అతడు ఒక గొప్ప రాజు :

6 అతడు ఒక గొప్ప రాజు :

వాల్మీకి రామాయణం ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే, రావణుడు రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించేవాడు. అతడి పాలనలో లంకను బంగారు లంకగా పిలిచేవారట. లంక చరిత్రలోనే ఆ కాలం ఎంతో ఖ్యాతిని, కీర్తిని పొందింది. కొన్ని ఆధారాల ప్రకారం చాలామంది నమ్మే విషయాలు ఏమిటంటే, పరిపాలకుడిగా రావణుడు అందరిని ఎంతో బాగా సంరక్షించేవాడు మరియు తన క్రింద పనిచేసేవారిని ఎంతో బాగా చూసుకునే వాడట. అతడి పరిపాలనలోనే విశ్వకర్మ లంకను నిర్మించడం జరిగింది. అత్యంత గొప్ప శిల్పుల్లో విశ్వకర్మ కూడా ఒకరు.

7 విష్ణువు యొక్క ద్వారపాలకుల అవతారాలే రావణుడు మరియు అతడి సోదరుడు కుంబకర్ణుడు :

7 విష్ణువు యొక్క ద్వారపాలకుల అవతారాలే రావణుడు మరియు అతడి సోదరుడు కుంబకర్ణుడు :

హిందూ పురాణాలు చెబుతున్న విషయం ఏమిటంటే, రావణుడు మరియు అతడి సోదరుడు కుంభకర్ణుడు విష్ణువు ద్వారపాలకుల యొక్క అవతారాలట. వారి అసలు పేర్లు జయ మరియు విజయ. వీరు ఒకానొక సమయంలో కొద్దిగా అహంకారపూరితంగా వ్యవహరించడం జరిగింది. వీరిద్దరూ ఎంతలా తమని తాము మరచి కోపం తెప్పించేలా ప్రవర్తించారంటే, ఒకానొక సమయంలో బ్రహ్మ మెదడు నుండి ఉద్భవించిన కొడుకులు, విష్ణువు ద్వారం వద్దకు వచ్చారు. వారిని నగ్న పిల్లలుగా భావించి పొరపాటుచేసారు. దీంతో మునులు మరియు ఋషులకు విపరీతమైన కోపం వచ్చింది. జయ మరియు విజయ విష్ణువు చేత సంహరింపబడతారని వారు శపించారు. అందులో భాగంగానే మూడు సార్ల లో ఒకసారి జయ మరియు విజయ, రావణుడు మరియు కుంభకర్ణుడి రూపాల్లో జన్మించడం జరిగింది.

English summary

Here's Why Ravana Is Known As The Most Loving Villain In History

Here's Why Ravana Is Known As The Most Loving Villain In History,why ravana is known as the most loving villain in history, reasons why ravana is the most loving villian, unknown stories of ravana,
Story first published: Tuesday, March 13, 2018, 7:00 [IST]