For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చినెలలో హిందువులకు పవిత్రమైన దినాలు

|

ఈ దేశంలోని అన్ని మాతాలను పర్యవేక్షించి చూడగా, హిందూ మతంలో ఉండే పండుగలు, పవిత్రమైన రోజులూ మరే ఇతర మతంలో లేవు. మరియు హిందూ మతం ఇప్పుడు మనుగడలో ఉన్న అన్ని మతాలలోనూ ప్రపంచంలోనే అతి పురాతనమైన మతంగా ఉంది. మరియు మూడవ అతి పెద్ద మతంగా దీనికి పేరుంది. హిందూ మతంలో ముక్కోటి దేవతలు కొలువు దీరి ఉంటారని చెప్పడం జరుగుతుంటుంది. ప్రతి గ్రామానికి గ్రామ దేవతల దగ్గర నుండి, ప్రధానమైన దేవుళ్ళ వరకు ఆయా ప్రాంతాలను అనుసరించి, ఆ దేవతలను ప్రార్ధించడం దృష్ట్యా, అనేక పండుగలను జరుపుకోవడం జరుగుతుంటుంది. ఈ మార్చి నెలలో కూడా అనేక తిథులు (కృష్ణ మరియు శుక్ల పక్ష దినాలు ) నిర్దిష్ట ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అంతేకాక కొన్ని ఆంగ్లమాన కాలెండర్ అనుసరించి కూడా వారాల ప్రకారం జరుపబడుతాయి.

Auspicious Days

వివిధ పౌరాణిక ఘట్టాలు కూడా ఈ హిందూ మతంలో పలు పండుగలకు మరియు ఉత్సవాలకు దారితీస్తుంటాయి. ప్రతి నెలా అనేక రకాల పండుగలతో నిండుకుని ఉంటుంది. క్రమంగా మార్చి నెలలో ఉన్న పండుగల సంబంధించిన వివరాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.కొన్ని పండుగలు మీ కాలెండర్లలో కూడా కనపడకపోవచ్చు. ఇవి ప్రాంతాలను ఆచారాలను అనుసరించి నిర్ణయించబడుతాయి. మీరు ఆచరించదగిన పండుగల మరియు వ్రతాల గురించిన విధివిధానాలను మరియు సంబంధిత పురాణాలను తెలుసుకునేందుకు మీ ఆలయ పూజారి లేదా పండితులని సంప్రదించడం మేలు. కొన్ని గ్రహస్థితుల ఆధారితంగా, వారు మీరు ఆచరించదగిన పండుగల గురించిన వివరాలను అందించగలరు.

మార్చి 2019 నెలలో వస్తున్న పండుగలు మరియు పవిత్ర దినాలు :

మార్చి 8 - ఫులేరా డూజ్, రామకృష్ణ జయంతి

మార్చి 8 - ఫులేరా డూజ్, రామకృష్ణ జయంతి

ఫులేరా డూజ్ రోజున శ్రీకృష్ణ భగవానుని పూజించడం జరుగుతుంది. దీనిని మార్చి 8 నాడు గమనించవచ్చు. ద్వాదశి తిథి మార్చి 7 నాడు రాత్రి 11.43 నుండి మొదలై మార్చి 9 వేకువజామున 1.34 గంటలకు ముగుస్తుంది. రామకృష్ణ పరమహంస జన్మదిన మహోత్సవం కూడా మార్చి 8 న వస్తుంది. ఆయన 19 వ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువు. ఈ రోజున చంద్ర దర్శనం కూడా పరిశీలించబడుతుంది.

మార్చి 10 - మాస వినాయక చవితి

మార్చి 10 - మాస వినాయక చవితి

ప్రతి నెలా వినాయక చవితి వస్తుంది, క్రమంగా ఈ మార్చి నెలలో 10 వ తేదీన ఈ వినాయక చవితి పరిశీలించబడుతుంది. ఈ రోజున ఉదయం 11.21 నుంచి మధ్యాహ్నం 1.42 వరకు పూజా సమయం ఉంటుంది. మరియు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ వేళలు వరుసగా ఉదయం 6.41 మరియు సాయంత్రం 6.22 గా ఉన్నాయి.

మార్చి 12 - స్కంద షష్టి మరియు మాసిక్ కార్తిగై

మార్చి 12 - స్కంద షష్టి మరియు మాసిక్ కార్తిగై

స్కంద షష్టి నాడు కార్తికేయుని పూజ నిర్వహించబడుతుంది. ఈనెల మార్చి 12 నాడు దీనిని గమనించవచ్చు. అదే పండుగను భారతదేశంలోని తమిళనాడు వంటి దక్షిణ భాగ ప్రాంతాలలో మాసిక్ కార్తిగై అని పిలవబడుతుంది. ఈరోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వేళలు ఉదయం 6.39 నుండి సాయంత్రం 6.24 వరకు ఉంటాయి.

మార్చి 13 - ఫల్గుణ్ అష్టనిక మొదలయ్యే రోజు, రోహిణి వ్రతం

మార్చి 13 - ఫల్గుణ్ అష్టనిక మొదలయ్యే రోజు, రోహిణి వ్రతం

ఈ నెలలో రోహిణి వ్రతం మార్చి 13 న రానుంది. ఈరోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలు వరసగా, ఉదయం 6.37 మరియు సాయంత్రం 6.24 గా ఉండనున్నాయి. ఫల్గుణ అష్టనిక కూడా జైన సమాజపు తొమ్మిది రోజుల పండుగగా ఉంటుంది. ఇది మార్చి 13న ప్రారంభం అవుతుంది. వీటితో పాటు రోహిణీ వ్రతం, జైన స్త్రీలకు ఉపవాసం రోజుగా కూడా ఉండనుంది. భర్తల ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం నిర్వహించబడుతుంది.

మార్చి 14 - మాస దుర్గాష్టమి, కర్దైయాన్ నోమ్బు

మార్చి 14 - మాస దుర్గాష్టమి, కర్దైయాన్ నోమ్బు

దుర్గా దేవికి ఉపవాస దినంగా చెప్పబడుతున్న మాస దుర్గాష్టమి, ఈ నెల మార్చి 14 నాడు రానుంది. అదేవిధంగా కర్దైయాన్ నోమ్బు (నోము) పండుగను కూడా ఇదే రోజున గమనించవచ్చు. ఈ పండుగ నిజానికి భర్తల దీర్ఘకాలిక జీవితం కోసం మహిళలు ఉపవాసం ఆచరించే రోజుగా చెప్పబడుతుంది. ఈరోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయ వేళలు వరుసగా ఉదయం 6.36 మరియు సాయంత్రం 6.25 గా ఉండనున్నాయి.

మార్చి 15 - మీన సంక్రాంతి

మార్చి 15 - మీన సంక్రాంతి

మీన సంక్రాంతి హిందూ క్యాలెండర్ యొక్క పన్నెండవ నెల ఆరంభాన్ని సూచిస్తుంది. అనగా ఉగాది ముందు చివరి నెల. క్రమంగా ఈరోజున సూర్య దేవుని పూజించడం, విరాళాలు, దానాలు ఇవ్వడం కోసం ప్రత్యేకించబడిన రోజుగా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజున మహా పుణ్యకాల ముహూర్తంగా ఉదయం 6.35 నుండి 8.34 వరకు 2 గంటలు సుమారుగా ఉంది. ఇక పుణ్యకాల ముహూర్తం మధ్యాహ్నం 12.30 వరకు విస్తరించనుంది.

మార్చి 17 - అమలాకి ఏకాదశి

మార్చి 17 - అమలాకి ఏకాదశి

ఈ నెల రెండవ ఏకాదశి, అమలాకి ఏకాదశి మార్చి 18 న రానుంది. ఈ ఏకాదశి తిథి మార్చి 16 న మధ్యాహ్నం11.33 గంటలకు ప్రారంభమై మరియు 17 మార్చి సాయంత్రం 8.51 వరకు ఉండనుంది. మరియు మార్చి 18 ఉదయం 6.32 నుండి 8.55 వరకు పారణ సమయంగా ఉండనుంది.

మార్చి 18 - నరసింహ ద్వాదశి, ప్రదోష వ్రతం

మార్చి 18 - నరసింహ ద్వాదశి, ప్రదోష వ్రతం

నరసింహ ద్వాదశి మార్చి 18 నాడు రానుంది. నరసింహ స్వామిని విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్పబడుతుంది - తల వరకు సింహం,మొండెం నరుని రూపంలో ఉన్న నరసింహుని ఈ రోజున ప్రధానంగా పూజించడం జరుగుతుంది. ఈ రోజు సూర్యోదయం 6.46న మొదలై, సూర్యాస్తమయం 6.19 గా ఉంది. ప్రదోష వ్రతాన్ని కూడా అదే రోజున గమనించవచ్చు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలోని నరసింహ స్వామి ఆలయాలలో పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి.

మార్చి 20 - ఫాల్గుణ చౌమాసి చౌదాస్, చోటి హోలీ, హోళికా దహనం, ఫాల్గుణ పూర్ణిమ వ్రతం

మార్చి 20 - ఫాల్గుణ చౌమాసి చౌదాస్, చోటి హోలీ, హోళికా దహనం, ఫాల్గుణ పూర్ణిమ వ్రతం

ఫాల్గుణ చౌమాసి చౌదాస్, చాహోతి హోలీ (హోలీ ముందు రోజు), ఫాల్గుణ పూర్ణిమ మూడూ ఒకేరోజున మార్చి 20 న పరిశీలించబడుతుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ వేళలు వరుసగా ఉదయం 6.29 నుండి సాయంత్రం 6.28 గాఉంటాయి.

మార్చి 21 - హోలీ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, లక్ష్మీ జయంతి, ఫల్గుణీ ఉదిరం, డోల్ పూర్ణిమ, ఫాల్గుణ అష్టనిక సమాప్తం, చైతన్య మహాప్రభువు జయంతి

మార్చి 21 - హోలీ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, లక్ష్మీ జయంతి, ఫల్గుణీ ఉదిరం, డోల్ పూర్ణిమ, ఫాల్గుణ అష్టనిక సమాప్తం, చైతన్య మహాప్రభువు జయంతి

లక్ష్మి జయంతి మరియు చైతన్య మహాప్రభు జయంతితో పాటు మార్చి 21 న హోలీ కూడా గమనించబడుతుంది. ఫాల్గుణ అష్టనిక తొమ్మిది రోజుల జైన ఉత్సవం కూడా ఈ రోజున ముగుస్తుంది. సూర్యుని స్థానాలలో మార్పునకు సంబంధించిన రోజుగా ఫల్గుణి ఉథిరం అనే తమిళ ఉత్సవం కూడా ఈ రోజునే రానుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ వేళలు వరుసగా ఉదయం 6.28 నుండి సాయంత్రం 6.29 గా ఉంటాయి.

మార్చి 22 - భాయ్ డూజ్

మార్చి 22 - భాయ్ డూజ్

ప్రతి సంవత్సరం హోలీ తరువాత రోజున భాయ్ డూజ్ జరపడం ఆనవాయితీ. క్రమంగా మార్చి 22 న భాయ్ డూజ్ ను గమనించవచ్చు. ద్వాదశ తిథి మార్చి 22 నాడు ఉదయం 3.52 వద్ద ప్రారంభమవుతుంది మరియు మార్చి 23 న వేకువ జామున 00.55 గంటలకు ముగుస్తుంది.

మార్చి 24 - బాలచంద్ర సంకష్ట చతుర్ధి

మార్చి 24 - బాలచంద్ర సంకష్ట చతుర్ధి

బాలచంద్ర సంకష్ట చతుర్ధి, వినాయకునికి అంకితం చేయబడింది. ఈరోజున చవితి తిథి మార్చి 23, సాయంత్రం 10.32 గంటలకు మొదలై మార్చి 24, సాయంత్రం 8.51 కి ముగియనుంది. ఈరోజున భక్తులు ఉపవాసం ఉండటాన్ని గమనించవచ్చు.

మార్చి 25 - రంగ పంచమి

మార్చి 25 - రంగ పంచమి

రంగ పంచమిని భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీను పోలి ఉండేలా జరుపుకుంటారు. పంచమి తిథి మార్చి 24న 8.51 గంటలకు ప్రారంభమవుతుంది మరియు మార్చి 25, సాయంత్రం 7.59 గంటలకు ముగియనుంది.

మార్చి 28 - కాలాష్టమి, బసోడా, శీతలాష్టమి, వర్షితాప ఆరంబ్

మార్చి 28 - కాలాష్టమి, బసోడా, శీతలాష్టమి, వర్షితాప ఆరంబ్

బసోడా, లేద శీతలాష్టమి మార్చి 28, 2019 న రానుంది. . కాలాష్టమి, కాల భైరవుని పూజ నిమిత్తం జరుపబడుతుంది. ఇది కూడా మార్చి 28 న పరిశీలించబడుతుంది. వర్షితాప జైన పండుగ కూడా అదే రోజున ప్రారంభం అవుతుంది.

మార్చి 31 - పాపమోచిని ఏకాదశి

మార్చి 31 - పాపమోచిని ఏకాదశి

చైత్ర నవరాత్రి మరియు హోళికా దహనాల మధ్య వచ్చే ఏకాదశిని పాపమోచిని ఏకాదశిగా చెప్పబడుతుంది. ఇది మార్చి 31 న పరిశీలించబడుతుంది. ఏకాదశి తిథి మార్చి 31, ఉదయం 3.23 గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఏప్రిల్ 1 న ఉదయం 6.04 వద్ద ముగుస్తుంది.

గమనిక : కొన్ని పండుగలు ప్రాంతాల వారీగా పేర్ల మార్పుతో కూడుకుని ఉంటాయి. ఆయాప్రాంతాలను అనుసరించి హిందూ కాలెండర్లలో కూడా మార్పులు చోటుచేసుకుని ఉంటాయని గమనించవలసినది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: festivals పండగలు
English summary

Hindu Auspicious Days In The Month Of March 2019

Given below is the list of fasts and auspicious days that will be observed in the month of March 2019. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more