For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

|

హిందువుల సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసం అంటేనే అనారోగ్య మాసం అని లేదా ఇది చెడు మాసం అని నమ్ముతారు. ఎందుకంటే ఈ నెలలో విపరీతమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, వరదలు వచ్చే సమయం. ఈ ఆషాఢ మాసంలో కాలువలు, నదులలో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లో చేరే నీరు కూడా కలుషితమై పోతుంది. అందువల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతుంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ రథయాత్ర, బలభద్ర, సుభ్రద రథయాత్రలను కూడా కన్నుల పండుగగా జరుపుతారు.

ఈ మాసంలో స్నానం, దానం, జపాలు, పారాయణాలు వంటివి చేయడం విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్మకం. ఆషాఢంలో చేసే సముద్ర, నదీ స్నానాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతారు. అలాగే పాదరక్షలు, గొడుగు, ఉప్పు వంటివి దానం చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయంట.

ఇదే మాసంలోనే దక్షిణాయానం కూడా ప్రారంభమవుతుంది. కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన నాటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయానం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తూ ఉంటాడు. ఇది మన పూర్వీకులకు ప్రీతికరమని పురాణాలలో చెప్పబడింది.

ఆషాఢ మాసాన్నే భాను సప్తమిగా పేర్కొంటారు. ఉత్తరం నుండి దక్షిణానికి పయనిస్తున్న సూర్యుడు సుమారు మూడు నెలల తర్వాత భూమధ్య రేఖకు చేరుకుంటాడు. ఆరోజున పగలు, రాత్రి అనేవి ఎలాంటి తేడాలు లేకుండా సరి సమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని లేదా శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుండే ఛాతుర్మస వ్రతం ఆరంభమవుతుంది. ఈ సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను, రాయలసీమలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

గోరింటాకుతో లాభాలు.

గోరింటాకుతో లాభాలు.

ఆషాఢం మాసంలో అమ్మాయిలందరూ గోరింటాకుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మహిళలంతా ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఒక ఆచారం కూడా ఉంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఈ గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది.శాస్త్రీయ పరంగా గోరింటాకులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఆషాఢ మాసం విశిష్టత..

ఆషాఢ మాసం విశిష్టత..

ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని, శుభకార్యాలకు తగిన సమయం కాదని అందరూ భావించినప్పటికీ, ఆధ్యాత్మికంగా మాత్రం దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమిగా పండితులు చెబుతారు. ఈరోజున సుబ్రహ్మణ్యస్వామిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలాగే ఆషాఢ షష్టిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు. శుక్ల పక్ష షష్ఠినాడు శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి, ఆ తర్వాతి రోజు ఆలయానికి వెళ్లి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు.

'అమృత లక్ష్మి వ్రతం..

'అమృత లక్ష్మి వ్రతం..

ఆషాఢ శుద్ధ శుక్ల పక్షంలో మహిళలు 'అమృత లక్ష్మి వ్రతాన్ని' జరుపుకుంటారు. ఈ నెలలోనే చాలా మంది ఇళ్లలో పేరంటాలు, పూజలు, వ్రతాలు ఎక్కువగా జరుపుకుంటారు. దీని వల్ల తమ కుటుంబాలకు అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.

ఆశాఢ గుప్త నవరాత్రి డే 2 ప్రాముఖ్యత: బ్రహ్మచారిని పూజ, విధి మరియు మంత్రం

చాముండేశ్వరి దేవి పుట్టినరోజు..

చాముండేశ్వరి దేవి పుట్టినరోజు..

కర్నాటక రాష్ట్రం మైసూరుకు చెందిన చాముండేశ్వరి దేవి పుట్టినరోజు కూడా ఇదే మాసంలోనే వస్తుంది. ఈ సమయంలో ఈ దేవత యొక్క ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని, అలాగే శ్రీమహావిష్ణువుని కూడా పూజించాలని, దీని వల్ల ఆర్థిక సమస్యలు అనేవే రాకుండా పోతాయని చాలా మంది నమ్ముతారు.

శుభకార్యాలు చేయరు..

శుభకార్యాలు చేయరు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. ముఖ్యంగా, వివాహాది కార్యక్రమాలు, ఇల్లు ఓపెనింగ్, ఆస్తి కొనుగోలు, కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త వాహనాల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నింటినీ ఈ నెలలో జరుపుకోకుండా వాయిదా వేస్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక రాష్ట్రంలో ఈ నెలలో అత్తా, కోడలిని, కొత్తగా పెళ్లి అయిన భార్యభర్తలను దూరంగా ఉంచుతారు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఆగస్టు నెలలో మంచి పనికి అంతరాయం కలిగించడానికి మరో శాస్త్రీయ కారణం అధిక వర్షపాతం. స్థిరమైన వర్షం, నదులు, కాలువలు, చెరువులన్నీ నీటితో కలుషితం అవ్వడంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే చాలా వరకు ఈ నెలలో పనులన్నీ వాయిదా వేస్తూ వెళ్తారు.

ఆషాఢంలోని ముఖ్య తేదీలు..

ఆషాఢంలోని ముఖ్య తేదీలు..

ఈ ఆషాఢ మాసంలో కొన్ని ముఖ్యమైన తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం..

జూన్ 23న జగన్నాథ, బలభద్ర రథయాత్ర

జులై 1 ఏకాదశి మరియు గౌరీ వ్రతం..

జులై 3న జయపార్వతి వ్రతం

జులై 4న కోకిల వ్రతం

జులై 5న వ్యాజ పూజ

జులై 6న గురువుకు అంకితం

జులై 8న చక్రవర్తి ఏకాదశి

English summary

Hindu Festivals during the month of Ashada Masam

Here we are discussing about Ashada Masa Date, Significance And Vrata Dates. Read more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more