Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Holi 2023: హోలీ వేళ వీటిని దానం చేస్తో పుణ్యం కంటే పాపమే ఎక్కువట
హోలీ సందర్భంగా ఈ వస్తువులను దానం చేయకూడదట...
హోలీ పండుగ వస్తోందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఈ పండుగ సమయంలో చిన్నా పెద్ద, కులం, మతం అనే భేదం లేకుండా వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు ఆప్యాయంగా రంగులు చల్లుకుంటారు.

అలాంటి రంగుల పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం చివరి మాసం అయిన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ హోలీ వేడుకలు ఈ ఏడాది మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం కాముని దహనంతో ప్రారంభమవ్వనున్నాయి.

రెండురోజుల పాటు జరుపుకునే ఈ వేడుక కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయాయి. అయితే ఇలాంటి పవిత్రమైన సమయాల్లో కొందరు పేదలకు దానధర్మాలు చేస్తుంటారు.

ముఖ్యంగా బట్టలను, కొన్ని వస్తువులను దానం చేస్తుంటారు. అయితే హోలీ వేళ ఈ వస్తువులను దానం చేయకూడదని మీకు తెలుసా.. ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పుస్తకాలు..
సాధారణంగా విద్యా దానం చేయడాన్ని గొప్పగా భావిస్తారు. అయితే హోలీ పండుగ వేళ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదట. అలాగే పుస్తకాలను మరియు విద్యకు సంబంధించిన వస్తువులను వేటిని మంటల్లో వేయడం వంటివి చేయకూడదట. హోలీ సమయంలో ఇలాంటి వస్తువులను హోలికా దహనంలో వేసినా.. పుస్తకాలను ఎవరికైనా ఇచ్చినా వారి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయని చాలా మంది నమ్మకం.

ఉక్కు పాత్రలు..
హోలీ సమయంలో ఉక్కు పాత్రలను కూడా అస్సలు దానం చేయకూడదట. ఒకవేళ తెలియక ఈ వస్తువులను దానం చేస్తే వారి కుటుంబంలో సంపద మరియు ఐశ్వర్యం, అద్రుష్టం అనేవి తగ్గిపోతాయట. అంతేకాదు మీ కుటుంబంలో ప్రశాంతత అనేదే ఉండదట. కాబట్టి హోలీ రోజున ఉక్కు పాత్రలను అస్సలు దానం చేయకండి. ఎవరైనా దానం చేస్తుంటే.. వద్దని చెప్పేయండి..

ప్లాస్టిక్ వస్తువులు..
హోలీ సందర్భంగా చాలా మంది ప్లాస్టిక్ వస్తువుల్లో రంగులు నింపి వేడుకలను జరుపుకుంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ గన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే అకస్మాత్తుగా ఎవరితో అయినా ఇవి లేకపోతే.. వారితో అదనంగా ఉండే వాటిని దానంగా ఇచ్చేస్తుంటారు. అయితే ఇలా ఇవ్వడం వల్ల మీ ఇద్దరిలో ఎవరో ఒకరి కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయట. బాధలు కూడా పెరుగుతాయట. అదే విధంగా ఈ పవిత్రమైన పండుగ రోజున ప్లాస్టిక్ వస్తువులతో పాటు చీపురును కూడా దానం చేయకుండా ఉండాలట.

వాడిన నూనె..
మనం నివసించే ఇళ్ల వద్ద చాలా మంది పప్పు, ఉప్పు, చక్కెర, టీపొడి వంటివి అరువు తెచ్చుకుంటారు లేదా కొందరు దానంగా ఇస్తుంటారు. అయితే హోలీ సందర్భంగా ఇవి ఇస్తే పర్వాలేదు కానీ.. వాడిన నూనెను మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదట. ఎందుకంటే ఈ వాడిన నూనె వల్ల మీ కుటుంబంలో దుఃఖం, చెడు శకునాలు పెరుగుతాయట. ఇది శని దేవునికి కూడా కోపం తెప్పిస్తుందట. కాబట్టి వాడిన నూనెను హోలీ రోజున ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

పాత బట్టలు..
సాధారణంగా మన ఇళ్లలో పాత బట్టలు పేరుకుపోతే చాలు.. ఇల్లు శుభ్రం చేసే సమయంలో వాటిని ఎవరికైనా దానం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పండుగల వేళ ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఇచ్చేస్తుంటాం. అయితే హోలీ వేళ మీరు ధరించిన మరియు పాత బట్టలను అస్సలు దానం చేయకూడదంట. ఇలా చేయడం వల్ల మీ సంపదకు ఆకస్మిక నష్టం జరుగుతుంది. ఒకవేళ మీరు బట్టలు దానం చేయాలనుకుంటే.. కొత్త వాటిని దానం చేయాలని గుర్తుంచుకోండి. మనం చేసే దానం వల్ల అది అందుకున్న వారు ప్రయోజనం పొందాలి. ప్రయోజనం లేని దానం వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలాంటి రంగుల పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం చివరి మాసం అయిన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ హోలీ వేడుకలు ఈ ఏడాది మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం రోజున ప్రారంభం కానున్నాయి.



Click it and Unblock the Notifications