For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రగ్రహణం రోజు ఆ రాశి వారిని పాత శత్రువులు వెంటాడుతారు, అన్ని రాశుల వారు దానాలు చేస్తే మంచిది

|

చంద్ర గ్రహణం జూలై 27 శుక్రవారం రోజున గంట నలభై నిమిషాలు ఉండనుంంది. అయితే ఈ రోజు మరో అద్భుతం కూడా ఆకాశంలో చోటు చేసుకోనుంది. 104 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది. మనదేశంలో ఈ గ్రహణం కనపడనుంది. అంతేకాదు ఆ రోజు చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు. దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. నార్త్ అమెరికా, పసిఫిక్‌ తో పాటు ఆర్కిటిక్‌ ప్రాంతాల్లో తప్ప దీన్ని ప్రపంచం అంతటా చూసే అవకాశం ఉంది.

How 27th julys lunar eclipse will affect your horoscope

ఢిల్లీలో అంటే మనదేశంలో నైట్ 10 గంటల 44 గంటలకు కనువిందు నిమిషాలకు ఇది చోటుచేసుకోనుంది. అయితే ఫుల్ పెడ్జ్ గా గ్రహణాన్ని మిడ్ నైట్ ఒంటి గంట టైమ్ లో చూడగలుగుతాం. మనదేశంతో పాటు సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, సౌదీ తో పాటు మిడిల్ ఆఫ్రికాలలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

How 27th julys lunar eclipse will affect your horoscope

అయితే ఈ చంద్ర గ్రహణం ఏయే రాశిపై ఏయే ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. గ్రహణం ఏర్పడ్డాక కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం ఆయా రాశులపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటుంది.

మేషం

మేషం

మేష రాశి వారికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి.

మీకు కొన్ని సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు పూలను దానం చెయ్యడం మంచిది. మీ జీవితం ప్రశాంతంగా కొనసాగనుంది. మీ దాంపత్యంలో అడ్డంకులు తొలుగుతాయి.

వృషభం

వృషభం

వృషభరాశి వారికి కొన్ని రకాల చిక్కులు ఏర్పడవచ్చు. మిమ్మల్ని మీ సన్నిహితులు కొన్ని విషయాల్లో కాస్త తప్పుగా అర్థం చేసుకునే అకకాశం ఉంది. అయితే మీ అభిప్రాయం ఏమిటో మీరు కచ్చితంగా ఎదుటి వారికి చెప్పండి. అందులో సంకోచించకండి. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది. మీరు బియ్యం, చక్కెర, పాలు, తెల్లని పూలు దానం చెయ్యండి మంచిది.

మిథునం

మిథునం

మిథున రాశి వారు కొన్నిశారీరక, భౌతిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీరికి గ్రహణం కలిసి రాదు. మిథునరాశి వారు ఆకుపచ్చని బట్టలు, కూరగాయలు, గింజలు, గంధం వంటివి గ్రహణం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీనివల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది.

కర్కాటకరాశి

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారి జీవితంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. మీరు చంద్రగ్రహణం రోజు కొన్ని రకాల దానాలు చేస్తే మంచిది. గ్రహణం రోజు బియ్యం, వెండి పాత్రలు, పాల ఉత్పత్తులు వంటివి దానం చెయ్యడం మంచిది.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారు అన్ని విషయాల్లో విజయం పొందుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రాలు, సింధూర్, కొవ్వొత్తులు వంటివి దానంగా ఇస్తే మంచిది.

కన్యరాశి

కన్యరాశి

కన్యరాశి వారు చంద్ర గ్రహణం సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎన్నో రోజులుగా దాచుకున్న రహస్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీరు చంద్ర గ్రహణం రోజు కొన్నిరకాల దానాలు చేస్తే చాలా మంచిది. కూరగాయలు, పుస్తకాలు, కాపర్, పూలు, ఆహార ధాన్యాలు వంటివి మీరు ధానం చేస్తే మంచిది.

తులరాశి

తులరాశి

తులరాశి వారు చంద్ర గ్రహణ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు అనవసరంగా మిమల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా మెలగండి. మీరు బియ్యం, చక్కెర, గంధం వంటివి దానం చేస్తే మంచిది.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశి వారు చంద్ర గ్రహణం శుభాలను తీసుకొస్తుంది.

మీరు స్వీట్స్, రెడ్ ప్లవర్స్ (ఎరుపు రంగు ఉన్న పుష్పాలు) ఉన్ని దుస్తులు వంటివి దానం చేస్తే మంచిది.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, పబ్లిక్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చనా దాల్, పసుపు రంగు పుష్పాలు, చందనం, పసుపు వంటివి దానం చేయాలి.

మకరం

మకరం

మకరరాశి వారికి మానసికి ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. వీళ్లు నూనె, నల్ల బట్టలు, ఇనుము, నలుపు రంగులో ఉండే పప్పు ధాన్యాలు వంటివి దానం చేయాలి. ఇలా చేస్తే మకరరాశి వారికి మంచిది.

కుంభం

కుంభం

కుంభరాశి వారు చంద్ర గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో రోజుల నుంచి మీపై పగ పట్టిన మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వీరు ఆహార ధాన్యాలు, పువ్వులు, బియ్యం, పప్పు, దుప్పట్లు వంటివి ఇతరులకు దానం చేయడం మంచిది.

మీనం

మీనం

మీనరాశి వారు చాలా లక్కీ. ఎందుకంటే ఎన్నో రోజులుగా వీరు ఎదుర్కొనే సమస్యలు తొలిగిపోనున్నాయి. వీరు పసుపు రంగు పువ్వులు, పసుపు, బట్టలు, టవల్ వంటివి దానంగా ఇస్తే మంచిది.

Image Credit (all pics)

English summary

How 27th julys lunar eclipse will affect your horoscope

How 27th julys lunar eclipse will affect your horoscope
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more