For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకునికి మూషికం ఎలా వాహనం అయింది

|

హిందూ మతంలో అందరు దేవతలకు ఒకచోటు నుండి వాహనాలను కలిగి ఉన్నారు. పరమశివునికి నంది, దుర్గాదేవికి సింహం, విష్ణువు వాహనం గరుడుడు, సుభ్రమణ్యేశ్వరస్వామికి నెమలి, సరస్వతీ దేవికి హంస, కానీ వినాయకునికి మాత్రం ఎలుక. దాని చిన్న పరిమాణము వలన ఎలుక వినాయకుని మోయగలదా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అసలు వినాయకుని వాహనంగా ఎలుక ఎలా మారింది ? చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కానీ తెలియని వారు కూడా ఉంటారు కదా! వారి కోసమే ఈ వ్యాసం.

ఇంద్ర సభలో :

కొంతమంది దేవతలు కొన్ని ఆంతరంగిక విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశమయ్యారు. వారిలో, గంధర్వులు మరియు అప్సరసలు వంటి వారు కూడా ఉన్నారు. తీవ్రమైన చర్చ జరుగుతూ, ఉద్రిక్త వాతావరణం అలముకున్న నేపధ్యంలో , క్రౌంచుడు అనే గంధర్వుడు, మొత్తం సమావేశానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేకమంది పాల్గొన్నప్పటికీ, ఈ గంధర్వుడు అప్సరలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు.

How A Mouse Became Lord Ganeshas Vehicle

ఇంద్రుడి శాపం :

విష్ణువు ఈ గంధర్వుని తీరుకి మొదట్లో పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నించారు. కానీ క్రౌంచుడు విష్ణువు హెచ్చరికలన్నింటినీ నిర్లక్ష్యం చేసి, ఇంద్రునికి కోపం తెప్పించాడు. తద్వారా ఇంద్రుడు, అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. గంధర్వుడు క్షమాభిక్షను కోరినా, ఫలితం దక్కలేదు.

ఒక ఎలుకగా మారిన తర్వాత కూడా, అతను దేవ లోకాలన్నీ తిరుగుతూ, మళ్ళీ విసుగు తెప్పించాడు. ఇతని ప్రవర్తనతో తీవ్ర నిరాశకు లోనైన ఇంద్రుడు, దేవ లోకo నుండి కూడా అతన్ని తరిమెయ్యమని ద్వార పాలకులకు పురమాయించాడు. రక్షకులు ఇంద్రుడు సూచనలను అనుసరించారు, తద్వారా ఎలుకను భూమికి విసిరివేశారు.

పరాశరుని ఆశ్రమానికి చేరిక :

భూమిపై పడిన ఈ మూషికం పరాశరుని ఆశ్రమానికి చేరుకుంది. ఇక్కడ కూడా, తన చర్యలకు స్వస్థి పలకలేదు. తద్వారా స్వీట్లు, ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు, వస్త్రాలు మరియు అక్కడ నివసిస్తున్న ఋషులు ఉపయోగించే ఇతర వస్తువులను తునాతునకలు చేసేవాడు లేదా తినేవాడు. చివరికి ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుని సంబంధించిన వస్తువులను కూడా వదలలేదు. ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో, విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు, తక్షణమే చర్యకు పూనుకున్నాడు.

క్రౌంచునిపై వినాయకుని దాడి :

గణేషుడు తన ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని మూషికం పై ప్రయోగించగా. పాశం క్రౌంచుని మెడకు చుట్టుకుని, వినాయకుడి వద్దకు తీసుకువచ్చింది. క్రౌంచుడు వినాయకుని కాళ్ళ వద్ద పడి, భయంతో వెంటనే క్షమించమని వినాయకుడిని అడిగాడు. గణేషుడు శిశువు యొక్క హృదయం కలిగి ఉన్నాడని నమ్ముతారు మరియు అతని హృదయం వెంటనే కరిగిపోతుంది. తద్వారా క్రౌంచుడిని క్షమించి, మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు. మూషికం వినాయకుని ఆదేశాలను పాటించటానికి ఒప్పుకుంది. కానీ క్రౌంచుడు ఆ శాపాన్ని వదిలించుకోవాలని కోరుకున్నాడు, తద్వారా మరలా గంధర్వునిగా మార్చమని వేడుకున్నాడు. మూషికాన్ని క్షమించినా కూడా, ఆ మూషికం సంతోషంగా లేదు, తద్వారా వినాయకుడు మానసిక గందరగోళానికి గురయ్యాడు. కొన్ని పరిశోధనల తరువాత క్రౌంచుడు ఒక గంధర్వుడు అని తెలుసుకుని, తిరిగి తన అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు.

క్రౌంచునికి వరమిచ్చిన వినాయకుడు:

అయినప్పటికీ, దేవరాజు ఇంద్రుడు రాజు ఇచ్చిన శాపమును తీసివేయుటకు అతనికి ఏ విధమైన అధికారమూ లేదు. తద్వారా ఆ శాపాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని భావించాడు. ఈ ప్రతిపాదనకు మూషికం కూడా తన అంగీకారాన్ని తెలిపింది.

ఈ ప్రతిపాదన ప్రకారం, ఏ దేవుని పూజించడానికి ముందైనా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ, కావున వినాయకునితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు.

ఏమైనప్పటికీ, ఇంకా పరిష్కరించాల్సిన మరొక సమస్య ఏర్పడింది. క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడి శరీరం బరువును మోయలేడు. కావున అతన్ని గణనీయంగా తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి తాను వాహన దారిగా మారు సమయాన క్రౌంచుడు తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు.

మరొక కధ ప్రకారం, గజముఖాసురుడు లేదా మూషికాసురుడు అనే అసురుడు ఉండేవాడు. ఎటువంటి ఆయుధం అతన్ని చంపకుండా వరాన్ని కలిగి ఉన్న ఈ రాక్షసుడు లోక కంఠకునిగా తయారవడం మూలంగా, ఆ రాక్షసుడిని సంహరించే క్రమంలో భాగంగా, వినాయకుడు తన దంతాలలో ఒకదానిని విరిచి, గజముఖాసురుని మీద దాడి చేశాడు. దంతం సమీపించడంతో మరణానికి భయపడి, రాక్షసుడు ఒక ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నo చేసాడు. అయితే వినాయకుడి ఆయుధమైన పాశం ఆ రాక్షసుని మెడ పట్టి వినాయకుని పాదాల చెంతకు చేర్చింది. భయంతో క్షమించమని కోరగా, జాలి గుండె కలిగిన వినాయకుడు మూషికాసురుని తన వాహనంగా మారమని వరాన్ని ప్రసాదించాడు.

ఇలా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మరొక కథనం ప్రకారం, మూషికాసురుని దంతం తరుమునప్పుడు, ఎలుక గా మారి తప్పించుకునే ప్రయత్నం చేయు సందర్భంలో, మూషికాసురుని భార్య, తాను అమితంగా ఆరాధించే పార్వతీ దేవిని శరణు కోరగా, పార్వతీ దేవి ఆ దంతానికి అడ్డంగా తన గాజుని విసిరి మూషికుని కాపాడింది. తద్వారా వినాయకుని శాంత పరచి మూషికుని భార్యను చూసి వదిలి వయవలసినదిగా కోరగా, తల్లి మాటను గౌరవించిన వినాయకుడు, మూషికుని తన వాహనంగా మరియు మూషికుని భార్యను తనకు ఛత్రంగా మారేలా వరాన్ని ప్రసాదించాడని మరొక కథ కూడా ప్రధానంగా ఉన్నది.

మరొక కథనం ప్రకారం అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులలో అగ్ర పూజ(ఆది పూజ) అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు నివేదించగా, కార్తికేయుడు తన వాహనం అయిన నెమలిని అధిరోహించి విశ్వ పర్యటనకు పూనుకున్నాడు. ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశము. కానీ, వినాయకునికి ఎటువంటి వాహనమూ లేదు. కార్తికేయుని గెలవడానికి. ఆ సమయంలో నారద మునీంద్రుల సలహా మేరకు, తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. తద్వారా కార్తికేయుడు ఎక్కడికెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు, వినాయకుడే అగ్ర పూజకు అర్హుడని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఆది పూజ వినాయకునికి చేయడం హిందూమతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు, మూషికాసురుని గెలిచిన తర్వాత తన వాహనం ఎలుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు.

English summary

How A Mouse Became Lord Ganesha's Vehicle

How A Mouse Became Lord Ganesha's Vehicle,Every Hindu deity has a vehicle to ride upon. However, Lord Ganesha has a vehicle which seems too tiny to carry him. Read on to know how a mouse became Lord Ganesha’s vehicle.
Story first published: Saturday, May 12, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more