For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుడు ఎలా చనిపోయాడో తెలుసా?

అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్ధాముడుకి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం తెలియదు. దీంతో దాన్ని అర్జునుడు సంబంధించిన మనుషులపైకి మళ్లించాల్సి వస్తుంది.

|

మహాభారతంలో మనకు అభిమన్యుడి గురించి తెలుసు. అభిమన్యుడు అర్జునుడు, సుభద్రలకు జన్మిస్తాడు. తండ్రికి తగ్గట్లుగానే అభిమన్యుడు కూడా వీరుడు. కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహ్యంలో చిక్కుకుని ప్రాణాలు వదులుతాడు.

అభిమన్యుడి భార్య ఉత్తర. వీరిద్దరికీ పుట్టిన వాడే పరీక్షిత్తు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడిపైకి అశ్వత్ధాముడు బ్రహ్మాస్త్రం వదులుతాడు. అలాగే అర్జునుడు కూడా అశ్వత్ధాముడు పైకి బ్రహ్మాస్త్రం వదులుతాడు. అయితే మధ్యలో మహర్షులు, శ్రీకృష్ణుడు ఇద్దరికీ నచ్చజెప్పి వాటిని వెనక్కి తీసుకోమ్మని కోరుతారు.

అశ్వత్ధాముడి బ్రహ్మాస్త్రం

అశ్వత్ధాముడి బ్రహ్మాస్త్రం

అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్ధాముడుకి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం తెలియదు. దీంతో దాన్ని అర్జునుడు సంబంధించిన మనుషులపైకి మళ్లించాల్సి వస్తుంది. అలా బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య అయిన ఉత్తర వైపు వెళ్తుంది. ఉత్తర అప్పుడు నిండుగర్భిణి. దీంతో ఆమె గర్భంలో ఉన్న పరీక్షిత్తుడిని ఆ అస్త్రం ఇబ్బందిపెడుతుంది.

ఆ బిడ్డకు మళ్లీ ప్రాణం పోస్తాడు

ఆ బిడ్డకు మళ్లీ ప్రాణం పోస్తాడు

ఆ సమయంలో ఉత్తర కృష్ణుడిని తన బిడ్డను రక్షించమని కోరడంతో కృష్ణుడు ఆ బిడ్డకు మళ్లీ ప్రాణం పోస్తాడు. అయితే తనను రక్షించిన కృష్ణుడు ఎక్కడున్నాడన్నట్లు పరీక్షగా చూస్తాడు. అందుకే అతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. ఇక పరీక్షిత్తుడు తన మేనమామ అయిన ఉత్తరుడు కూతురు ఐరావతి ని పరీక్షిత్ పెళ్లి చేసుకుంటాడు.

మునిని మృగం వచ్చిందా అని అడుగుతాడు

మునిని మృగం వచ్చిందా అని అడుగుతాడు

ఇక పరీక్షిత్ ఒక రోజు వేటకు వెళ్తాడు. ఒక మృగాన్ని తడుముకుంటూ వెళ్తాడు. అయితే అది అకస్మాత్తుగా కనిపించదు. అయితే అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంటుంది. అందులో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మునిని ఇక్కడికి మృగం వచ్చిందా అని అడుగుతాడు.

పరీక్షిత్తుడికి కోపం వస్తుంది

పరీక్షిత్తుడికి కోపం వస్తుంది

ఆ మునికి అతను రాజు అనే విషయం కూడా తెలియదు. దాంతో తన తపస్సు తాను చేసుకుంటూ ఉండిపోతాడు. దీంతో పరీక్షిత్తుడికి కోపం వస్తుంది. అక్కడే చచ్చిపోయి ఉన్న ఒక పామును తీసి మునిపై వేస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రిని చూసి

ఇలా ఎవరైతే చేసి ఉంటాడో అతను కచ్చితంగా పాము వల్లే చనిపోవాలని శపించిపోతాడు.

పరీక్షిత్ భయంతో

పరీక్షిత్ భయంతో

అయితే తపస్సులో నిమగ్నమైన ఉన్న ముని తన దగ్గరకు వచ్చింది పరీక్షిత్ మహారాజు అని తెలుసుకుని అతని దగ్గరకు వెళ్లి అతని కుమారుడు పెట్టిన శాపాన్ని వివరిస్తాడు. దీంతో పరీక్షిత్ భయంతో ఒక చోట దాక్కుంటాడు.

పరీక్షిత్తు కుమారుడే జనమేజయుడు

పరీక్షిత్తు కుమారుడే జనమేజయుడు

అయితే అక్కడికి పాములు మనిషి రూపంలో వెళ్లి పరీక్షితుడికి కొన్ని పండ్లు ఇస్తాయి. వాటిని తీసుకుని తినడానికి ప్రయత్నించిన పరీక్షిత్తును ఒక పాము కాటు వేస్తుంది. దీంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు బతికినన్ని రోజులు ధర్మాన్నే పాటించాడు. ప్రజలందరినీ సమానంగా చూశాడు. పరీక్షిత్తు కుమారుడే జనమేజయుడు.

English summary

how did abhimanyu's son parikshit die

how did abhimanyu's son parikshit die
Story first published:Thursday, August 2, 2018, 18:19 [IST]
Desktop Bottom Promotion