శని దేవుని ఆశీస్సులు పొందడమెలా .. ?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సౌర కుటుంబ వ్యవస్థ లోనే అత్యంత బలమైన గ్రహాలలో శని గ్రహం కూడా ఒకటి. ఈ గ్రహన్ని ఆంగ్లము లో సాటర్న్ అని వ్యవహరిస్తారు. శని దేవుడు సూర్యుని కుమారుడు. మరియు శని దేవుని ముఖ్యంగా శనివారం నాడే పూజిస్తారు. జన్మ కుండలిలో శని ప్రభావం సరిగ్గా లేని, దహియా, ఏలినాటి శని , మరియు మహర్ధశ సమస్యలు కలిగిన వ్యక్తులు శనివారం నాడు ఉపవాసం చేయవలసినదిగా సూచించడమైనది. తద్వారా శని దేవుడు తన ప్రతికూల ప్రభావిత అంశాలను తొలగించి, జీవితంలో శాంతిని చేకూరుస్తాడని ప్రజల విశ్వాసం. కానీ శని దేవుని దీక్షను ఖచ్చితత్వంతోనే చేయాలి. ఎటువంటి సందేహాలు ఉన్నా, పండితుని కాని ఆలయ పూజారిని కానీ అడిగి తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.

శని దేవుని వ్రతం:

శని దేవుని శనివారం నాడు ముఖ్యంగా పూజిస్తారు. నల్ల నువ్వులు, నువ్వుల నూనె , మినుములు మరియు నల్లని వస్త్రము శని దేవునికి సమర్పించవలసి ఉంటుంది. ఇవి శని దేవునికి అత్యంత ప్రీతి పాత్రమైనవిగా చెప్పబడినవి. పూజ సమయంలో శని దేవుని స్తోత్రo చదవడం , దేవాలయాలకు వెళ్ళడo వంటివి శని దేవుని వ్రతంలో ముఖ్య భాగాలు. 11 లేదా 51 వారాల పాటు ప్రతి శనివారం ఇలా నియమ నిష్ఠలతో శని దేవుని పూజించడం ద్వారా అనేక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం ద్వారా మొదలైన ఉపవాస దీక్ష, చంద్రోదయం తర్వాత ముగుస్తుంది. కొందరు ఉపవాస దీక్షలో భాగంగా, దాన ధర్మాలు , అన్నదానాలు కూడా చేస్తుంటారు.

How To Get The Blessings Of Shani Dev

శని దేవుని వ్రత కథ:

ఒకసారి అన్ని గ్రహాలూ ఒక చర్చకు పూనుకున్నాయి. ఆ చర్చలో ఎవరంటే ఎవరు గొప్ప అని వాగ్వివాదాలు జరిగాయి. అందరిలో కన్నా నేనే గొప్ప అన్న భావన అందరిదీ. ఈ చర్చ ఎంతకీ తెగక పోవడంతో, అత్యంత గొప్ప రాజైన విక్రమాదిత్యుని సంప్రదించారు.

విక్రమాదిత్యునికి న్యాయ విచారణలో గొప్ప రాజుగా పేరు ఉంది. తద్వారా విక్రమాదిత్యుని అన్ని నిర్ణయాలను కూడా అందరూ విశ్వసిస్తారు, పాటిస్తారు. కావున ఈ ప్రశ్న విక్రమాదిత్యుని ముందుకు చేరింది.

విక్రమాదిత్యుడు, తన సపరివారాన్ని పిలిచి ఏడు రకాల లోహాలతో తయారు చేయించిన ఏడు కుర్చీలను ఏర్పాటు చేయమని ఆదేశించగా, వారు రాజు ఆజ్ఞాపించినట్లే చేశారు. అన్ని గ్రహాలను ఒక్కొక్క కుర్చీలో ఆసీనులు కమ్మని సూచించాడు. ఇనుము శని దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావడంతో అన్నిటికన్నా చివరలో ఉన్న ఇనుము కుర్చీపై ఆసీనుడయ్యాడు.

How To Get The Blessings Of Shani Dev

రాజు వెంటనే మీరు ఎంచుకున్న కుర్చీల ద్వారా మీ స్థానాలను మీరే నిర్ణయించుకున్నారు అని ప్రకటించాడు.

కానీ విక్రమాదిత్యుని న్యాయం, శని దేవునికి నచ్చలేదు. అత్యంత హేయమైన న్యాయంగా భావించి, భాధపడ్డారు. వెంటనే గద్గద స్వరంతో ఓ రాజా, నా గురించి మీకు కనీస అవగాహన లేదు. అందుకే ఇటువంటి న్యాయాన్ని సూచిoచావు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, సూర్యుడు తన రాశిలో ఒక నెల మాత్రమే ఉంటాడు, చంద్రుడు 2 నెలల కన్నా కొన్ని రోజులు ఎక్కువగా, గురుడు ఒకటున్నర నెల, బృహస్పతి పదమూడు నెలలు, మరియు బుధుడు, శుక్రుడు ఒక్కొక్క నెల మాత్రమే తమ రాశులలో ఉంటారు.

కానీ నేనొక్కడినే అందరికన్నా ఎక్కువకాలం గరిష్టంగా రెండున్నర సంవత్సరాల నుండి ఏడున్నర సంవత్సరం వరకు రాశి లో ఉంటాను. ఏలినాటి శని ప్రభావం రాజులను, దేవతలను కూడా వదలలేదు. ఆఖరికి శ్రీరాముడు కూడా ఏలినాటి శని కారణంగా వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నా ఏడున్నర సంవత్సర ఏలినాటి శని ప్రభావమే. మరోపక్క ఏలినాటి శని ప్రభావం వలనే వానరుల సైన్యం సహాయంతో వచ్చిన రాముడి చేతిలో ఓడిపోయి రావణుడు కూడా సంహరించబడ్డాడు. ఇలాంటి అనేక విషయాలు తెలిసి కూడా నన్ను చులకన చేసి చూశావు. ఈ ప్రభావం అనుభవించినవారికే తెలుస్తుంది, అని శని దేవుడు రాజుకు వివరించి నిష్క్రమించాడు.

How To Get The Blessings Of Shani Dev

తద్వారా కాలక్రమేణా శని దేవుని ప్రభావం తో ఏలినాటి శని కారణంగా, విక్రమాదిత్యుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. అడవులకు వెళ్ళాడు, ఆకలితో అలమటించాడు, ఆఖరికి నూనె గింజల నుండి నూనెను తీసే పనికి కూడా ఉపక్రమించాడు. క్రమంగా ఇలాంటి అనేక కష్టసాధ్యమైన మరియు ఊహకు కూడా అందని పనులకు కూడా ఉపక్రమించవలసి వచ్చింది. చివరికి ఈ సమస్యలు చేతులు తెగే దాకా కూడా వెళ్ళాయి అంటే ఆశ్చర్యం గొల్పక మానదు.

తన చివరి ఏలినాటి శని రోజులలో, పొలాలలో కూడా పని చేసాడు. క్రమంగా ఏలినాటి శని చివరి రోజున, పని లో భాగంగా గట్టిగా పాడుతూ ఉండగా, ఆ గొంతు ఒక రాజు కూతురు చెవిన పడి , విక్రమాదిత్యుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి, సిద్దపడింది. అతని కష్టాలను చూసి చలించింది కానీ, అతను కూడా రాజు అన్న విషయం కూడా ఈ రాజు కూతురుకు తెలీదు.

వీరి పెళ్లి ద్వారా నెమ్మదిగా విక్రమాదిత్యునికి తన రాజభోగాలను , కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెట్టాయి. అప్పుడు కానీ విక్రమాదిత్యుడు, శని దేవుని బలాలను గురించిన అంచనాలకు రాలేకపోయాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన విక్రమాదిత్యుడు, ప్రతి శనివారం శని దేవునికి ఉపవాస దీక్షను ఆరంభించాలని సంకల్పించాడు.

తద్వారా విక్రమాదిత్యుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజూ విగ్రహారాధన చేసేవాడు కూడా. తన ఉపవాస దీక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన రాజ భోగ వైభోగాలను తిరిగి పొంది సుఖ సంతోషాలతో రాజ్యపాలన గావించాడు. అప్పటినుండి శనిదేవుని తన ప్రధాన ఆరాధ్యదైవంగా భావించాడు విక్రమాదిత్యుడు.

English summary

How To Get The Blessings Of Shani Dev

How To Get The Blessings Of Shani Dev ,Saturn is one of the strongest planets in the solar system. Its Indian name is Shani. Shani Dev is the son of Sun God. Shani Dev is worshiped on a Saturday. Fasts are specially prescribed for those who have a weak Shani in their birth chart, who have a Dahiya, Saade Saati, Mahadas