13 అదృష్ట సంఖ్య ఎలా అయింది?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఈరోజు శుక్రవారం, 13వ తేది. ఎంతో భయపడే రోజు మరియు సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా 13 సంఖ్య చుట్టూ అనేక కథలు, మూఢనమ్మకాలున్నాయి. దాదాపు చాలా సంస్కృతుల్లో 13ను దురదృష్టసంఖ్యగానే భావిస్తారు.

కానీ అది పాశ్చాత్యుల దృష్టికోణం. మన సంస్కృతిలో 13 ను ఎలా చూస్తారో తెలుసా? ఇక్కడ దాన్ని అదృష్టసంఖ్యగా, అదృష్టమైనరోజుగా భావిస్తారు. థాయిలాండ్, భారత్ వంటి దేశాలలో 13 అదృష్ట సంఖ్య మరియు రోజు కూడా.

why 13 is unlucky in indian

13 అదృష్ట సంఖ్య ఎలా అయింది?

ఏడాది మొత్తంలో శుక్రవారం 13వ తారీఖు అయితే దాన్ని చాలా దురదృష్టకరంగా భావిస్తారు.ఆరోజు ఏ ముఖ్యమైన పనులూ చేయరు.ఆరోజుని అపశకునంగా భావించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని విశ్వసిస్తారు. కానీ మేము మీకు 13 ఎంతో పవిత్రమైన రోజని చెప్తే నమ్ముతారా? అయితే చదవండి;

13వ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఎందుకనీ, 13 నెంబర్ అంటే ఎందుక భయపడుతారు?

13వ తేది శుక్రవారం – ఇది ఒక మూఢనమ్మకమా?

గ్రీకుల విశ్వాసాలు

ప్రాచీన గ్రీసులో, గ్రీకు పురాణాల ప్రకారం జ్యుయెస్ 13వ మరియు ఎంతో శక్తివంతమైన దేవుడు. అందుకని 13 సంఖ్యను స్వచ్చమైన ప్రకృతి,శక్తి, స్వచ్చతగా గుర్తుగా చూస్తారు

13 ఆధ్యాత్మిక సంపూర్ణతకి గుర్తు

13 ప్రధాన సంఖ్య కావటంతో అది తనతో తనే భాగింపబడుతుంది. అందుకని అది ఒక సంపూర్ణసంఖ్య. అలా 13 ఒక సంపూర్ణ స్థితికి గుర్తు.

13 శుక్రవారం లక్కీనా? అన్ లక్కీనా ? బ్యాడ్ లక్కా? లేదా ఒక మూఢనమ్మకమా?

థాయి విశ్వాసాలు

థాయి కొత్త సంవత్సరం 13 ఏప్రిల్ న జరుపుకుంటారు. ఆరోజున అందరిపై నీళ్ళు చల్లుకుని అన్ని చెడు శకునాలు తొలగిపోయాయని పవిత్రమైనరోజుగా గడుపుతారు.

హిందూ నమ్మకాలు

హిందూ మతం ప్రకారం ఏనెల 13 వ రోజైనా చాలా విశిష్టమైనది. హిందూ కాలెండర్లో 13 వరోజు త్రయోదశి. ఈరోజును పరమశివుని రోజుగా భావిస్తారు. శివునికి చేసే ప్రదోష వ్రతం ప్రతినెలా 13 వ రోజున వస్తుంది. ఆరోజు శివుడిని పూజించేవారికి సంపదలు, పిల్లలు, సంతోషం, సమృద్ధి అన్నీ దక్కుతాయి. అందుకని హిందూ మతంప్రకారం ప్రతినెలా 13 వ రోజు చాలా మంచి ఫలితాలనిచ్చే రోజు. హిందువులకి ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన మహాశివరాత్రి కూడా మాఘమాసం 13 రాత్రినే జరుపుకోవటం జరుగుతుంది.

English summary

How Is Number 13 Lucky | 13 Lucky Number | 13 Is Lucky

What if we tell you that 13 is one of the most sacred and purest day of the year? Don't believe? Then read on
Story first published: Friday, October 13, 2017, 18:00 [IST]