For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమంతుని అల్లరి చేష్టలతో నారదమునిని ఎలా ఆడుకున్నాడు

|

ఒకసారి హనుమంతుడు తన తల్లితో కలిసి రాజభవనములో కూర్చొని, కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు వీణ శబ్దంతో కూడుకుని, పాటలు పాడుతూ ఎవరో అంతరాయం కలిగించారు. వాస్తవానికి అంతరాయం కలిగినందుకు మొదట భాదపడినా ఆ సంగీతానికి ముగ్ధులయ్యారు. హనుమంతుడు, అతని తల్లి ఇద్దరూ ఆ గానామృతానికి ఎంతగానో తన్మయత్వానికి లోనై, కొన్ని క్షణాల పాటు ఆ సంగీతాన్ని వింటూ, దాని మూలాలను తెలుసుకోవాలని అడవిలోనికి బయలుదేరారు.

క్రమంగా హనుమంతుడు ఆ దివ్య ఋషి వద్దకు వచ్చి, పాట పాడిన వ్యక్తి నారద మునిగా నిర్ధారించుకుని అతని పాదాల ముందు కూర్చున్నారు. నారద ముని హనుమంతుడిని చూసిన వెంటనే, హనుమంతుడు లేచి నారద ముని పాదాలను తాకి, కొన్ని నిమిషాలు ప్రార్థనను ఆపమని కోరగా., నారదుడు వారి శుభాకాంక్షలు, మరియు విజ్ఞప్తిని అంగీకరించి, ఇలా అడిగాడు., "ప్రియమైన హనుమా, నాకు ఒక స్వకార్యం ఉన్నది, కార్యం నిమిత్తం త్వరగా వెళ్ళవలసి ఉన్నది, కావున త్వరితగతిన నా సంగీతాన్ని ఆపడానికి గల కారణాన్ని చెప్పు." అని.

 Story Of Lord Hanuman

హనుమంతుడు భగవానుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ. "ఓ నారద మునీంద్రా, నువ్వు అతి సుందరంగా పాడగలవు! మేము మీ స్వరాన్ని ఆస్వాదిస్తూ, ఆ శబ్దాన్ని అనుసరిస్తూ మేమిద్దరమూ మీ చెంత చేరినాము”. మీ ఆశీస్సులు ఎంత శక్తివంతమైనవో మాకు అర్ధమైంది. కావున ముందుగా మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాతనే ముందుకు సాగవలసినదిగా కోరుతున్నాము అని అడిగాడు.

అందుకు నారద ముని అంగీకరించి, ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి హనుమంతుడు అనేక మంది దేవుళ్ళ నుండి వరాలు పొందిన కారణంగా, ఏ వరం కావాలో నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. కావున, మీరే నిర్ణయించుకుని ఏదైనా మంచి వరాన్ని ప్రసాదించవలసినదిగా మనవి అని అడిగాడు.

 Story Of Lord Hanuman

క్రమంగా ఆలోచించిన నారద ముని హనుమంతునికి తెలియని సంగీతాన్ని వరంగా అందించాడు. క్రమంగా సంగీతపు జ్ఞానాన్ని, మంచి కంఠస్వరాన్ని ఆశీర్వాదంగా పొందిన హనుమంతుడు ఎంతో సంతోషించి నారద మునిని స్తుతించాడు.

నారద ముని సమయాభావం వలన అక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ధారించుకుని వెళ్ళబోతున్న తరుణంలో, హనుమంతుడు మళ్ళీ నారద మునిని ఆపి, మీ సంగీత జ్ఞానానికి మేమిద్దరం ఏవిధంగా సాక్షులుగా ఉన్నామో, అదేవిధంగా మీరు కూడా నా సంగీత జ్ఞానానికి సాక్షిగా ఉండగలరా అని కోరుకున్నాడు. ఓర్పు, సహనం పరిధి దాటుతున్నా కూడా హనుమంతుని కోరికను మన్నించి కొంతసేపు అక్కడే ఉండేందుకు అంగీకరించాడు నారద ముని.

 Story Of Lord Hanuman

క్రమంగా హనుమంతుడు, నారద ముని ఇద్దరూ అడవికి చేరి, ఒక చెట్టు కింద కూర్చుని సంగీత సాధనకు ఉపక్రమించారు. నారద ముని తన వీణను చెట్టు ప్రక్కనే ఉన్న ఒక పెద్ద బండ మీద ఉంచగా, హనుమంతుడు గానం చేయడం ప్రారంభించాడు. ఆ కంఠస్వరం నిస్సందేహంగా అద్భుతమైనది. నారద ముని కళ్లు మూసుకుని సేద తీరి హనుమంతుని సంగీతాన్ని ఆలకించడం ప్రారంభించాడు.

హనుమంతుని గానామృతానికి రాళ్ళు సైతం కరగడం ప్రారంభించాయి. క్రమంగా నారదుడు వీణను ఉంచిన బండ మరియు వీణ కూడా కరగడం ప్రారంభించాయి. అంతేకాకుండా ఆ శిల పూర్తిగా కరిగి ద్రవ రూపంలోకి మారడం ప్రారంభించింది.

 Story Of Lord Hanuman

వీణ ఆ రాయిలో కరిగిపోవడం ప్రారంభించింది. క్రమంగా, తన చేయవలసిన కార్యం ఒకటి గుర్తొచ్చి, అక్కడ నుండి కదిలేందుకు సిద్దపడిన నారద ముని, హనుమంతుని పాట పాడడం ఆపమని కోరుకున్నాడు. వెంటనే ఆజ్ఞను స్వీకరించిన, హనుమంతుడు పాడటం ఆపివేయగా, మళ్ళీ ఆ బండ యధాస్థితికి రావడం ప్రారంభించింది. కానీ అందులో వీణ మునిగిపోయి అతుక్కొని ఉండడం గమనించిన నారద ముని, హనుమంతుని మళ్ళీ పాడమని కోరాడు.

కానీ హనుమంతుడు, నారద మునిని ఆటపట్టించడానికి పాడేందుకు నిరాకరించాడు. క్రమంగా అడవి చుట్టూ తిరగడం, గెంతడం ప్రారంభించాడు. నారద ముని అతని వెంట అడవి మొత్తం పరుగెత్తి చివరికి హనుమంతుడు, అతని తల్లి అంజనా దేవి ఉండే భవనానికి చేరుకున్నాడు.

నారద మునిని ఆటపట్టించడం వెనుక, హనుమంతుని తల్లి అయిన అంజనా దేవి పరంగా ఒక మర్యాదపూర్వక ఉద్దేశ్యం ఉంది హనుమంతునికి. అంజనా మాతను చూసిన నారద ముని లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చి, పలకరింపుగా నవ్వాడు. శుభాకాంక్షలు తెలిపిన తర్వాత, నారద ముని హనుమంతుడు తనను ఆటపట్టిస్తున్న విషయం గురించి ఆమెకు ఫిర్యాదు చేశాడు.

 Story Of Lord Hanuman

ఎందుకలా చేశావని అంజనా దేవి, హనుమంతుని అడుగగా, నారద ముని దివ్య ఋషి అయినందువలన, తమ ఇంటికి రావాలని కోరుకున్నానని హనుమంతుడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. "ఆయన అడుగులు తన భవనంలోని ప్రతి గదిని తాకి ఆ ప్రాంతాలన్నీ పునీతంగా మారేలా ఆశీర్వాదాన్ని అందించమని కోరుకున్నాడు”.

సమాధానంతో ముగ్ధుడైన నారద ముని సంతోషించి, హనుమంతుని క్షమించి, హనుమంతుని కోరిక ప్రకారం భవనం మొత్తం కలియ తిరిగాడు”. క్రమంగా నారద ముని కోరుకున్నట్లుగా పాట పాడి, ఆ శిలను కరిగించి ఆ వీణను తిరిగి నారద మునికి అందజేశాడు హనుమంతుడు. హనుమంతుని చేష్టలకు నవ్వుకున్న నారద ముని, అతన్ని ఆశీర్వదించి అక్కడ నుండి నిష్క్రమించాడు.

తన చిలిపి చేష్టల వెనుక గల అంతరార్దానికి అంజనా దేవి, నారద ముని ఇద్దరూ హనుమంతుని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. హనుమంతుడు తన తల్లిని ఎంతగా ప్రేమిస్తాడో, పెద్దలను అంతగా గౌరవిస్తాడని భక్తులకు తెలియనిది కాదు. కానీ హనుమంతుని ప్రతి కథలోనూ, అతని ధైర్యం తెగింపులతో పాటుగా విజ్ఞత, నిబద్దతల గురించి కూడా తెలుసుకునేందుకు వీలవుతుంది. క్రమంగా హనుమంతుని ఆదర్శమూర్తిగా పేర్కొనడం జరుగుతుంది. ఇందుచేతనే, దేవుళ్ళందరికీ ప్రియమైన వ్యక్తిగా మన్ననలను పొందాడు హనుమంతుడు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Story Of Lord Hanuman And Veena Of Narad Muni

Lord Hanuman and his mother were impressed with the melodious voice of Narad Muni. Believing that only a divine being could have such a voice, he asked for a blessing when he met this wandering sage. Narad Muni blessed him with the knowledge of music. Lord Hanuman played a mischief, making Narad Muni visit his home and bless the place as well.
Desktop Bottom Promotion