For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా..

|

హిందూ మతంలో అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. వాటిని మంచి ఉద్దేశ్యాలతో జపిస్తే అవి కచ్చితంగా మంచి ఫలాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అలాంటి మంత్రాలలో మహా మృత్యుంజయ మంత్రం ఒకటి. ఈ మంత్రం ఈశ్వరునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా ఈ మంత్రం సృష్టించబడినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహా మృత్యుంజయ మంత్రం నాలుగు వేదాలలోనూ కనిపిస్తుంది. ఒకసారి చంద్రుడు దక్ష రాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోతాడు.

Maha Mrityunjaya

అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి చంద్రుడిని కాపాడినట్లు పురాణాలలో వివరించబడింది. అప్పటి నుండి ఈ మంత్రాన్ని సుదీర్ఘ తపస్సు ద్వారా ఉపయోగించారు. అలాగే ప్రాపంచిక సంక్షేమం కోసం ఉపయోగించారు. అంతేకాదు ఈ మంత్రం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. మనం తిరిగి యవ్వనం పొందడానికి, మనకు కష్టాలు తొలగిపోవడానికి ఇంకా మరెన్నో ప్రయోజనాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) మహా మృత్యుంజయ మంత్రం..

1) మహా మృత్యుంజయ మంత్రం..

ఓం త్రయంబకం యజామహే సుగంధీమ్ పుష్టి వర్దనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ మోక్షం అమృత:

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రాన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు.

2) ఈ మంత్రం యొక్క అర్థం..

2) ఈ మంత్రం యొక్క అర్థం..

మహా మృత్యుంజయ మంత్రం అర్థం ఏమిటంటే అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన ఈశ్వరుడిని మేము పూజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కోసం మృత్యువు నుండి విడపించు దేవా అని అర్థం.

3) ఈ మంత్రంలో అంశాలు..

3) ఈ మంత్రంలో అంశాలు..

మహా మృత్యుంజయ మంత్రం ఈశ్వరుడి యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కన్నులతో ఉన్న దేవుడిని చూపిస్తుంది. అన్ని జీవులను నిలబెట్టేవాడు. రెండోది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి బాధ్యతను తీసుకున్నాడు.

4) ఈ మంత్రాన్ని ఎలా జపించాలంటే..

4) ఈ మంత్రాన్ని ఎలా జపించాలంటే..

మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఒక వ్యక్తి ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశి చక్రాలను, 9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తగ్గిపోయి జీవితం సులభంగా మరియు ప్రశాంతంగా ఉండేందుకు ఈ మంత్రాన్ని జపించాలి. రెండోది, ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును.ఈ మంత్రాన్ని పగలు లేదా రాత్రి ఏ సమయంలో అయినా జపించవచ్చు. ఇలా 40 రోజులు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది మన ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

5) ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత..

5) ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత..

మహా మృత్యుంజయ మంత్రం జపించటం వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనసు మరియు శరీరానికి ఒక స్వస్థత బలంగా పని చేస్తుంది.

6) యవ్వనానికి..

6) యవ్వనానికి..

ఈ మంత్రం ఒక వ్యక్తి యొక్క పునర్ యవ్వనానికి సహాయపడుతుంది. ఇది దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ మహా మృత్యుంజయ మంత్రం ఒక వ్యక్తి చుట్టూ దైవ కంపనాలను సృష్టిస్తుంది. అందువలన అతడు లేదా ఆమె అన్ని భయాలను అధిగమించడానికి సహాయపడుతుంది.

7) పరీక్ష భయాలు తొలగిపోవడానికి..

7) పరీక్ష భయాలు తొలగిపోవడానికి..

విద్యార్థులు రాసే పరీక్షల్లో భయం పోగొట్టేందుకు ఈ మహా మృత్యుంజయ మంత్రం ఉపయోగపడుతుంది. దీన్ని పఠిస్తే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. ఈ మంత్రం పరీక్షా భయాలను తగ్గించడానికి పరీక్షను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, దృష్టి మరియు దృక్పథాన్ని పెంచుతుంది. చెడు ఆలోచనలను తొలగిస్తుంది.

8) మంచి ఫలితాల కోసం..

8) మంచి ఫలితాల కోసం..

పరీక్షల్లో మంచి మార్కలు పొందడానికి ఉదయాన్నే లేచిన తరువాత, స్నానం చేసి శివుడి విగ్రహం లేదా ఫోటో ముందు కూర్చుని ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. మీకు చదవడానికి ఏమైనా సమస్యలు ఉంటే ఇది ఉపశమనం పొందుతుంది. మంచి ఫలితాల కోసం పాఠశాలకు వెళ్ళే ముందు మరియు పడుకునే ముందు ఈ మంత్రాన్ని మూడుసార్లు పఠించండి.

9) మనశ్శాంతి..

9) మనశ్శాంతి..

మనం జీవితంలో చేసిన అప్పుల నుండి బయట పడటానికి డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అప్పు మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. ఒత్తిడికి కూడా గురి చేస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం, జీవితంపై ఆసక్తి కోల్పోవడం, ఆత్మహత్య, జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టడంలో వైఫల్యం వంటి కొన్ని పరిణామాలు ఎదురవుతాయి.

10) అప్పులు తీర్చడానికి..

10) అప్పులు తీర్చడానికి..

అప్పులు తీర్చడానికి మరియు డబ్బును తిరిగి పొందడానికి కచ్చితంగా మీరు ఆందోళన చెందుతారు. మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అప్పుల నుండి అవలీలగా బయటపడొచ్చు. మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం మరియు సాయంత్రం పఠించాలి. మీరు ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది. మీ ఆదాయన్ని పెంచుకోండి మరియు విశ్వాసం తిరిగి వస్తుంది.

11) లక్ష్య సాధనలో..

11) లక్ష్య సాధనలో..

మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అనేవి సహజం. అయితే కొన్నిసార్లు కార్యాలయాల్లో లేదా ఇంకా ఎక్కడైనా ఇతర చోట్ల వైరుధ్యాలు ఉంటాయి. ఇది మీ జీతం పెంపుదలలో ఇబ్బంది కలిగించొచ్చు. అందుకే ఇలాంటి వాటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. మీ లక్ష్యాన్ని సాధించడంలో సాధన చేయండి.

12) శత్రువుల నాశనం..

12) శత్రువుల నాశనం..

మీరు మీ వృత్తి జీవితంలో విజయవంతం కావడానికి... మీ వృత్తిపరమైన విజయాన్ని, పురోగతిని సహించని వారు చాలా మందే ఉంటారు. ఇది మీ పనితీరుకు ఆటంకం కలిగించవచ్చు. మీరు ఈ మంత్రాన్ని ఉదయం, సాయంత్రం 54 సార్లు పఠించాలి. మీ రోజువారీ పనులను ప్రారంభించడానికి ముందు ఈ మంత్రాన్ని మూడుసార్లు పఠించండి. సూర్యకాంతి కింద మంచు కరగడంతో మీ శత్రువులు నాశనం అవుతారు.

English summary

How Maha Mrityunjaya Mantra Can Fulfill Your Wishes

Here we talking about how maha mrityunjaya mantra can fulfill your wishes. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more