For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బతుకమ్మ పండుగను పూలతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!

|

తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా.. ఎప్పుడు.. ఎందుకు ప్రారంభమైందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.. అయితే ఇది వేల సంవత్సరాల నుండి జరుగుతూ వస్తోందని చెప్పడానికి మాత్రం కొన్ని రుజువులు ఉన్నాయి.

ఈ బతుకమ్మ పండుగ ప్రారంభం వెనుక చాలా కథలే అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు మహిళలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారట.

ఆ సమయంలో అందరూ 'బతుకమ్మ' అంటూ ఆమెను వేడుకున్నారట. అలా తొమ్మిదిరోజుల పాటు చేసిన తర్వాత పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుండీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందట.

ఇదొక్కటే కాదు.. ఇంకా కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారో.. ఈ పూల వల్ల పర్యావరణానికి ఏమైనా లాభాలున్నాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

శీతాకాలం ప్రారంభంలో...

శీతాకాలం ప్రారంభంలో...

అందరి ఇంటి చుట్టు పక్కల దొరికే పూలతోనే బతుకమ్మను తయారు చేస్తారు. దీని వెనుక పర్యావరణానికి లాభం చేకూర్చే కారణం కూడా ఉంది. ఈ పండుగ శీతాకాలం ప్రారంభమయ్యే రోజల్లో వస్తుంది. అప్పటికీ చెరువులన్నీ నీళ్లతో నిండిపోతూ ఉంటాయి. అప్పటికే పడిన వర్షాలకు రంగురంగుల పూలు కూడా పూసి ఉంటాయి.

ఆయుర్వేద గుణాలు..

ఆయుర్వేద గుణాలు..

ఈ పూలలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి. వీటిని అందమైన గోపురాల రూపంలో పేర్చి పండుగలా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను ఆడటంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

బతుకమ్మను అందంగా..

బతుకమ్మను అందంగా..

ముందుగా ఇళ్ల ముందు కల్లాపి జల్లి.. అందమైన రంగవల్లులను వేసి ఆ తర్వాత పూలతో బతుకమ్మను అందంగా పేర్చుకుంటారు. వాటికి అగరబత్తులను ఉంచి.. వాటి చుట్టూ ఐదుసార్లు తిరుగుతారు. తర్వాత ఊరంతా కలిసి గుడి లేదా చెరువు గట్టుకు వెళ్లి అక్కడ అందరూ కలిసి బతుకమ్మ ఆడతారు.

వెంపల్లి చెట్టును..

వెంపల్లి చెట్టును..

బతుకమ్మలను ఆడే సమయంలో మధ్యలో ముగ్గులు పెట్టి.. అందులో వెంపల్లి చెట్టును నాటుతారు. దాని చుట్టూ బతుకమ్మలను ఉంచి.. వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ.. కోలాటలు ఆడుతూ.. పాటలు పాడుతూ తిరుగుతారు. ఇలా తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు.

తొమ్మిదిరోజుల పాటు..

తొమ్మిదిరోజుల పాటు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు అయిన తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ.. అంటూ వివిధ రూపాలలో దేవతను పూజిస్తారు.

పురాతన శిల్పాలు..

పురాతన శిల్పాలు..

ఇప్పటికీ సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాదు సమీపంలోని మాందాపురంలో కొన్ని పురాతన శిల్పాలు కనిపిస్తాయి. ఆ శిల్పాలలో కూడా పూల బతుకమ్మ చిత్రాలు చెక్కబడటం విశేషం.

బోడెమ్మ పండుగ..

బోడెమ్మ పండుగ..

తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కావడానికి ముందే.. మరో గ్రామీణ దేవత పండుగ కూడా ప్రారంభమవుతుంది. అదే బొడ్డెమ్మ పండుగ. ఈ పండుగ ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగైపోయింది. అయితే కొన్నిచోట్ల ఇప్పటికీ ఈ బొడ్డెమ్మను పూజించడం సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

విదేశాలలో కూడా..

విదేశాలలో కూడా..

ఇటీవలి కాలంలో విదేశాలలో కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇతర దేశాలలో సెటిల్ అయిన తెలంగాణ వాసులంతా బతుకమ్మ సంబురాలను అక్కడు నిర్వహించడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ అసొసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్(TALK)ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ వేడుకలను చాలా ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకలో ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది కుటుంబాలు పాల్గొంటాయి. గతేడాది యూకేలో జరిగిన బతుకమ్మ సంబరాలకు భారత హైకమీషన్ ప్రతినిధి ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు.

English summary

How to celebrate bathukamma festival

Here we talking about how to celebrate bathukamma festival. Read on