Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మన జాతకంలో శుక్ర గ్రహ ప్రభావం ఉంటే మంచిదా? చెడ్డదా?
మీ రాశిచక్రంపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటే, ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. మనలో చాలా మందికి గ్రహా ప్రభావం అనేది కచ్చితంగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రవాణా లేదా ప్రయాణం వల్ల మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది.

అయితే గ్రహాలలో అతి పెద్ద గ్రహం సూర్యుడు అని చాలా మందికి తెలిసిందే. అయితే దాని తర్వాతే అతి పెద్ద గ్రహం శుక్ర గ్రహమే. ఈ గ్రహ ప్రభావం వల్ల చాలా మంది జీవితాల్లో వైవాహిక ఆనందం, గౌరవం వంటివి లభిస్తాయి.

ఎవరి జాతకాల్లో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో.. వారికి వివాహానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు.

ఈ గ్రహం కదలిక మీ రాశి చక్రాలకు అనుకూలంగా మారి వివాహా సమస్యతో పాటు సంపదకు సంబంధించిన విషయాలతో పాటు మీకు ఆనందం తీసుకొస్తుంది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తక్కువ పని.. ఎక్కువ ఫలితం..
ఏ వ్యక్తులలో అయితే శుక్ర గ్రహం బలంగా ఉంటుందో.. వారు తక్కువ పని చేసి.. ఎక్కువ ఫలితాన్ని అనుభవిస్తారు. వీరి జీవితాలు చాలా సజావుగా సాగుతాయి. అందుకే దీన్ని ప్రేమ గ్రహంగా పిలుస్తారు. ఇది ఆలుమగల మధ్య సంబంధాన్ని కూడా నిర్ణయిస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ గ్రహం మీ వైవాహిక బంధంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఆనందం ఉండదు..
ఎవరి జాతకంలో అయితే శుక్ర గ్రహం బలహీనంగా ఉంటుందో వారి వైవాహిక జీవితంలో ఆనందం అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఆడవారు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిలో కూడా ఏకాగ్రత కుదరదు. ఆహారం తీసుకునేంుదుకు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ప్రతికూల శక్తి పోయేందుకు..
అయితే శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే.. మీరు చింతించాల్సిన పని లేదు. అందుకోసం కొన్ని పరిహారాలు ఉన్నాయి. మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి. దీని వల్ల మీకు ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే, అవి తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలు కూడా ఉంటాయి. ప్రతిరోజూ తులసి చెట్టు ఎదుట సాయంకాలం వేళ దీపం వెలిగిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే మీరు ప్లాటినం లేదా వెండి ఉంగరం ధరిస్తే మీకు శాంతి లభిస్తుంది.

ఓ కుండలోని నీరు..
మీరు శుక గ్రహ ప్రభావం గట్టిగా కోరుకుంటే.. ఓ కుండలో నీరు తీసుకుని అందులో రెండు యాలకులు వేసి ఓ మాదిరిగా ఉడకబెట్టాలి. ఆ నీటితో స్నానం చేయాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీకు మంచి ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

నారాయణుడి స్మరణ..
మీ వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకునేందుకు శుక్రుడు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాడు. శుక్రుడికి అధిపతి విష్ణువు. కాబట్టి మీరు ఆ నారాయణుడు అయిన శ్రీహరిని స్మరించుకున్నా.. లేదా విష్ణువు అవతారమైన శ్రీరాముడిని పూజించినా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

గోమాత పూజ..
మీ జాతకం ప్రకారం శుక్రుడు బలహీనంగా ఉంటే, మీరు గోమాతను పూజించాలి. గోమాతను కొలిస్తే.. ఇతర రత్నాలు ధరించడం లేదా వజ్రాలను ధరించాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాలన్నీ క్రమం తప్పకుండా పాటిస్తే మీకు కచ్చితంగా శుభప్రదంగా ఉంటుంది.
గమనిక : పైన చెప్పిన పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్ర పండితులు చెప్పినవే. మీకు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పొందాలనుకుంటే, వ్యక్తిగతంగా జ్యోతిష్యశాస్త్ర పండితులను మిగిలిన పరిహారాలను తెలుసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోగలరు..



Click it and Unblock the Notifications