మీ ఇంట్లో సరస్వతి పూజను ఈ విధంగా చెయ్యండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

వసంత పంచమి మనకు చాలా దగ్గరలో ఉంది. మీకు తెలిసినట్లు, వసంత పంచమి వసంత ఋతువు ప్రారంభంలో వస్తుంది. ఈ రోజున, జ్ఞానమును ప్రసాదించే దేవత - సరస్వతి దేవిని, దేశం నలుమూలల నుంచి ఆరాధిస్తారు.

జ్ఞానము, వివేకము, సంగీతము మరియు చక్కటి కళల దేవతగా పేరుగాంచిన "సరస్వతి దేవి". ఆమె ఆశీర్వాదాలను పొందడం ద్వారా, ఒక వ్యక్తి తెలివిని మరియు జ్ఞానాన్ని పొందగలడు. వసంత పంచమి రోజున, ప్రతి విద్యార్ధి వారి పుస్తకాలను ఈ దేవత పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది, అలా ఆమె వాటిని ఆశీర్వదిస్తుంది, తద్వారా వారు విద్య మరియు పరీక్షలలో విజయాలను పొందుతారు.

భారతదేశంలో, తూర్పు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వారి పిల్లల శ్రేయస్సు కోసం ఇంటిలో 'సరస్వతి దేవి' పూజను నిర్వహిస్తారు. ఈ పూజ తప్పనిసరిగా విద్యార్థులచేతనే చేయబడాలి. స్నానం చేయడం మొదలుపెట్టి, పూజ కోసం సిద్ధంగా ఉన్న సామాగ్రిని తీసుకొని, మంత్రాలను పఠించడం వంటివి విద్యార్థులు చేస్తారు. ఇంతే కాకుండా, ఇంట్లో ఆచరించే ఈ పూజ విధానం కోసం అనేక ఇతర ఆచారాలు కూడా ఆచరణలో ఉన్నాయి.

మీ ఇంట్లో వసంత పంచమినాడుఆచరించే సరస్వతీ పూజకు అనుసరించవలసిన వివిధ దశల గూర్చి ఈ క్రిందన తెలియజేశాము. వాటిని ఒక్కసారి చూడండి.

Steps To do Saraswati Puja At Home

కావలసినవి :-

సరస్వతి దేవి విగ్రహం

తెల్లటి వస్త్రము

పువ్వులు - లోటస్, లిల్లీస్ మరియు జాస్మిన్

మామిడి ఆకులు మరియు నేరేడు ఆకులు

పసుపు

కుంకుమ

బియ్యం

ఏవైనా 5 రకాల పండ్లు (కొబ్బరి మరియు అరటిని కూడా కలిగి ఉండాలి)

ఒక కలశము

తమలపాకులు, వక్కపొడి మరియు దర్భగడ్డి

దీపములు మరియు అగరుబత్తులు

గులాల్ (హోలీ రంగులు)

పాలు

చెక్క పెన్ను మరియు సిరాబుడ్డి

పుస్తకాలు మరియు సంగీత వాయిద్యాలు

ఇంటి వద్ద సరస్వతి-పూజ చేయడానికి ఆచరించవలసిన దశలు :-

1. ఉదయాన్నే ఆచరించవలసిన ఆచారాలు :

పూజను జరుపుకునే వ్యక్తి ప్రత్యేకమైన ఔషధ జలాలతో కూడిన నీటితో ఉదయాన్నే స్నానము చేయాలి. ఆ స్నానపు నీటిలో వేప మరియు తులసి ఆకులు ఖచ్చితంగా ఉండాలి. అలా స్నానం చేయడానికి ముందు, వ్యక్తి తన శరీరంపై వేప మరియు పసుపు పేస్ట్ల మిశ్రమాన్ని తప్పక ఉపయోగించాలి. ఈ ఆచారమును పాటించడం వల్ల వ్యక్తి శరీరాన్ని శుద్ధి చేస్తుంది మరియు అన్ని రకాలైన ఇన్ఫెక్షన్లకు ఇది వ్యతిరేకంగా పనిచేస్తూ, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలా స్నానం చేసిన తరువాత, పోటీచేసే వ్యక్తి తెలుపు (లేదా) పసుపు రంగు దుస్తులను ధరించాలి.

2. దేవతా విగ్రహాన్ని & కలశాన్ని ప్రతిష్టించడం :

మీరు పూజగదిలో విగ్రహాన్ని ఉంచడానికి పెంచుకున్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ ఎత్తైన వేదికపై ఒక తెల్లటి వస్త్రమును ఉంచాలి. ఆ తరువాత ఈ వేదికపై విగ్రహాన్ని ఉంచండి. పసుపు, కుంకుం, బియ్యం, పూలదండలు మరియు పువ్వులతో దేవతా విగ్రహాన్ని బాగా అలంకరించండి. విగ్రహానికి దగ్గరగా పుస్తకాలను (లేదా) సంగీత వాయిద్యాలను ఉంచండి. పాలుతో సిరాబుడ్డిని నింపి, దానిలో చెక్క పెన్నును ఉంచి, దేవతా విగ్రహం సమీపంలో వాటిని ఉంచండి. నీటితో కలశమును పూర్తిగా నింపండి, ఆ కలశం చుట్టూ 5 మామిడి ఆకులతో అలంకరించాలి. మరియు దేవతా విగ్రహం దగ్గర ఒక తమలపాకును ఉంచి, దాని పైభాగంలో వక్కపొడిని మరియు దర్భగడ్డిని ఉంచండి. అంతేకాక, సరస్వతి దేవి విగ్రహం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని కూడా ఉంచండి.

Steps To do Saraswati Puja At Home

3. మంత్రాలను పఠించడం :-

మీ చేతిలో పువ్వులను, నేరేడు ఆకులను పట్టుకోని మొదటగా వినాయకుడిని పూజించండి. అలా వినాయకుడిని పూజించేటప్పుడు పువ్వులను మరియు నేరేడు ఆకులను సమర్పించాలి. ఇదే విధంగా సరస్వతి దేవిని కూడా పూజించాలి. దేవతామూర్తులను కొలిచేటప్పుడు ఈ కింద మంత్రాలను పఠించాలి. అవి,

"యా కుందేందు తుషారహారధవళా, యా శుబ్ర వస్త్రవృత్త

యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభీ దేవ్యై సదా వండితా,

సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహా

ఓం సరస్వతియే నమః, థ్యానార్థం, పుష్పం సమర్పయామి"

4. దీపాలను వెలిగించాలి :

దేవతని పై విధంగా ఆరాధిస్తున్నప్పుడు, దీపములను మరియు అగరభత్తులను వెలిగించండి. దేవతకు స్వీట్లు, పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలను నైవేద్యంగా నివేదించండి. సరస్వతీ దేవిని స్తుతిస్తూ కీర్తినలను, పాటలను పాడండి. పూజ ముగిసిన తరువాత చదవవద్దు. ఈరోజున మాత్రం శాఖాహార ఆహారాన్ని మాత్రమే తినండి.

5. మరుసటి రోజు :

వసంత పంచమి తరువాత రోజు, విగ్రహాన్ని తీయడానికి ముందు, "ఓం సరస్వతి నమః" అని నేరేడు ఆకుల మీద పాలలో ముంచిన చెక్క పెన్తో రాయండి. ఇలా రాసిన నేరేడు ఆకులను దేవతకు సమర్పించి మరల ప్రార్థించండి. ఆ తర్వాత విగ్రహాన్ని నీటిలో ముంచండి.

English summary

Steps To do Saraswati Puja At Home

Goddess Saraswati is known to be the Goddess of learning, wisdom, knowledge, music and fine arts. By invoking Her blessings, a person can gain knowledge and wisdom. On the day of Vasant Panchami, every student is supposed to lay his/her books at the feet of the Goddess so that She blesses them and they can gain success in education and exams.