For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివుడిని పూజించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపొట్లు..!!

శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. ఐతే శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.

By Swathi
|

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి.

Lord Shiva's Puja

శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

బిల్వ పత్రం

బిల్వ పత్రం

శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బిల్వపత్రం కోయకూడని రోజులు

బిల్వపత్రం కోయకూడని రోజులు

బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి తీయకూడదు. ముక్క పోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి.

కుంకుమ వద్దు

కుంకుమ వద్దు

శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధంను మాత్రమే ఉపయోగించాలి. శివుడి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల.. ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి.

కొబ్బరినీళ్లు వద్దు

కొబ్బరినీళ్లు వద్దు

కొబ్బరి నీళ్లను ఎట్టిపరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు.

ఏ పండ్లు సమర్పించాలి

ఏ పండ్లు సమర్పించాలి

శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్షాయుష్షుని సూచిస్తుంది.

ఇలాంటి పూలు వద్దు

ఇలాంటి పూలు వద్దు

సంపంగి పూలను శివుడికి ఎట్టిపరిస్థితుల్లో సమర్పించరాదు. శివుడికి వాటికి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూవులను అడుగుతాడు. దీంతో.. బ్రహ్మ, సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు.

స్టీల్ స్టాండ్

స్టీల్ స్టాండ్

శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే.. జలధార కంపల్సరీ ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా.. శివలింగం పెట్టుకుంటే.. నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

పూజించే విధానం

పూజించే విధానం

శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు.

తులసి

తులసి

శివపురాణం ప్రకారం శివుడు తులసి భార్యను చంపేశాడు. కాబట్టి తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు.

శుభ్రంగా

శుభ్రంగా

ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలుపెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

మంత్రం

మంత్రం

పూజలు చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది.

English summary

If You Are Performing Lord Shiva's Puja on Monday, Becareful of these things

If You Are Performing Lord Shiva's Puja on Monday, Becareful of these things. 10 Things to Be Careful About, If You Are Performing Lord Shiva's Puja on Monday. Or It May Bring Bad Luck.
Story first published: Monday, December 12, 2016, 15:16 [IST]
Desktop Bottom Promotion