For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొటనవేలంత దేహంతో పుట్టి..ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయిన దేవదేవుడు...!!

|

భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ గణేష చతుర్థి. మన దేశం మొత్తంలో ఊరూవాడా చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఆ వినాయకుడికి శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం...శుద్ద తదియ రోజు వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయం అయిపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఝాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావల్సింది బ్రహ్మదేవున్ని ప్రార్థిస్తాడు.

ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు తుమ్మగా..

ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు తుమ్మగా..

ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు తుమ్మగా.. ఆ తుమ్మ నుండే యజ్ఝవరాహమూర్తి జన్మిస్తాడు. యజ్ఝ వరాహం అంటే యజ్ఝంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీర భాగాలు కలిగినవాడని అర్థం. బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామిక్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు.హిరణ్యాక్షుడితో యుద్దం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు.

విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ

విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ

విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది. అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయి అంటారు.

భాద్ర పద శుద్ద చవితినే గణేశ చతుర్థిగా

భాద్ర పద శుద్ద చవితినే గణేశ చతుర్థిగా

భాద్ర పద శుద్ద చవితినే గణేశ చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున గణపయ్యను పూజిస్తే విద్యాబుద్దులతో పాటు సకల సంపదలూ లభిస్తాయి.

ఆ తర్వాత రోజు బుుషి పంచమి.

ఆ తర్వాత రోజు బుుషి పంచమి.

ఆ తర్వాత రోజు బుుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీ క్రుష్ణుడే స్వయంగా ధర్మ రాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేప్పుడు కశ్యపుడు అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తరుషులతో పాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.

 స్కంద షష్ఠి , సూర్య షష్ఠి

స్కంద షష్ఠి , సూర్య షష్ఠి

ఆ తర్వాత రోజు షష్టి. దీన్నే స్కంద షష్ఠి , సూర్య షష్ఠి అని పిలుస్తారు. వాస్తవానికి మాఘమాసంలో లాగే బాధ్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలు సూర్యభగవాన్ని అర్చిడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు.

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్థన ఏకాదశి

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్థన ఏకాదశి

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్థన ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషత్పం మీద శయనించిన విష్ణు మూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తే కరువుకాటకాలు ఉండవట.

శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి.

శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి.

భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కడి నుండి వెల్లిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు..అదితి కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి.

 శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుంది

శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుంది

సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగగా సుతలలోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీ దేవి ఈ వ్రతాన్నిచేసి శివుడి శరీరంలోని అర్థభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.

మహాలయ పక్షాలు

మహాలయ పక్షాలు

భాద్రపద బహుళ పాడ్యమి నుంచీ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. దీన్నే పిత్రుదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతారు. ఈ పదిహేను రోజులూ నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ద విధులను నిర్వహించడం ద్వారా పిత్రేదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. పాడ్యమి నుంచి అమావస్య వరకు వీటిని ఆచరించలేని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా పిత్రుదేవతల ఆరాధన చేయాలి.

 కలియుగం భాద్రపత మాసంతోనే మొదలైంది

కలియుగం భాద్రపత మాసంతోనే మొదలైంది

భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ళ తదియ అంటారు. అట్ల తద్దె మాదిరగానే ఉండ్రాళ్ల తద్దెనాడు కూడా పెళ్లీడుకొచ్చిన కన్నెపిల్లులు గైరీదేవని పూజించి నైవేద్యం పెడతారు. ఇంత విశైషమైన మాసం కాబట్టే కలియుగం భాద్రపత మాసంతోనే మొదలైందంటారు. భాద్రపద అంటే కేవలం ఒక మాసాన్నో ఒక నక్షత్రాన్నో కాకుండా ప్రజలంగా భద్రంగా ఉండాలన్న ఆకాంక్షనూ సూచిస్తుందని పెద్దలు చెబుతారు.

English summary

Importance And Significance Of Bhadrapada Month

According to Hindu Panchang, Bhadon or Bhadrapada is the sixth month of the year. This year, Bhadra begins from August 16, 2019 and ends on September 13. This month, which comes after Sawan is known as Lord Krishna’s month. Krishna was born as the eighth incarnation of lord Vishnu on Krishna Paksha (eighth day of the dark fortnight) in the month of Bhadon under Rohini Nakshatra. Some important festivals fall in the month of Bhadon. They are as follows:
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more