మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్‌ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!

తొమ్మిది రోజుల పాటు ఘనంగా సాగే గణపతి పూజలకు సమయం ఆసన్నమవుతోంది. విఘ్నాలు బాపే విఘ్నేశ్వరుడు మూషిక వాహనంపై భూలోకానికి విచ్చేయనున్నాడు. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథినాడు గణేశుడు కొలువుదీరనున్నాడు. భక్తుల ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, అలంకరణలతో ప్రతి ఇంటా, ప్రతి గల్లీ గణపతి బప్బా మోరియా అంటూ మార్మోగనుంది. మరి అరచేయంత కూడా లేని చిట్టి ఎలుక మన బొజ్జ గణపయ్యకి వాహనంగా ఎలా మారింది. ఎలుక వాహనం లేకుండా పూజలు చేయకూడదా.. దీని వెనుక పురాణ కథ, శాస్త్రాలు చెబుతున్న సంగతులివే..

Importance of Mouse vehicle in lord ganesh puja during vinayaka chavithi

హిందూ సంప్రదాయం, పురాణాల ప్రకారం వినాయకుడికి ఎలుక వాహనం వెనుక ప్రత్యేక ఇతివృత్తం ఉంది. ఎలుకను ఉల్లాసానికి ప్రతీకగా భావిస్తారు. అరచేయంత ఉండే ఎలుక చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో దానిపైన సవారీ చేసే గణేశుడు ప్రజలకు గంభీరమైన సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రతి గణేశుడి విగ్రహం ఉన్న చోట చిన్న ఎలుక తప్పనిసరిగా ఉంటుంది. పూజ సమయంలో ఎలుక ఉండటం అవసరమా అని చాలా మంది భావిస్తారు. వారి సందేహాలకు సమాధానం ఇదే..

గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.!గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.!

క్రౌంచ గంధర్వుడి అహం

పురాణ గాథల ప్రకారం.. క్రౌంచ అనే గంధర్వుడు తన అహంకారంతో బీభత్సం సృష్టించేవాడు. మహర్షుల ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవాడు. వారి కష్టాలను ఆలకించిన గణపయ్య.. తన పాశాన్ని ప్రయోగించి క్రౌంచుడిని అదుపులోకి తీసుకువచ్చి గుణపాఠం కలిగేలా చేశాడు. దీంతో తప్పు ఒప్పుకొన్న క్రౌంచుడు క్షమాపణలు కోరడంతో కరుణించిన గణేశుడు అతడిని ఎలుకగా మార్చి తన వాహనంగా మలుచుకున్నాడు. అహాన్ని పూర్తిగా పోగొట్టుకున్న క్రౌంచుడు ఎలుక రూపంలో ఆయనకి సేవలు చేశాడు. ఎంతటి అహంకారులైనా దేవుడి ముందు తలవంచుతారనే ఈ కథ తెలియజేస్తున్న సందేశం.

Importance of Mouse vehicle in lord ganesh puja during vinayaka chavithi

శాస్త్రాల ప్రకారం ఎలుకను జీవిగా, వాహనంగా మాత్రమే చూడకుండా చంచలత్వం, కామం, అజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఒకే చోట ఉండకుండా పరుగులెట్టడం, దొరికిందల్లా కొరకడమే ఎలుక పని. దీనిపై గణేశుడు సవారీ చేస్తూ దాని చంచలత్వాన్ని, వాంఛను నియంత్రించాడు. జ్ఞానం, విచక్షణతో మనలోని చెడు గుణాలను సులభంగా తొలగించుకోవచ్చనేదే ఎలుక వాహనం ఇచ్చే సందేశం. ఓర్పు, సంయమనం, జ్ఞానంతో చెడును జయించగలమని నిరూపిస్తున్నాడు బొజ్జ గణపయ్య.

చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.?

విగ్రహంలో ఎలుక ఉండటం తప్పనిసరా

పూజలో గణేశుడి విగ్రహంతో పాటు వాహనంగా ఎలుక ఉండటం ఆవశ్యకంగా భావిస్తారు. ఎలుక లేకుండా గణపతి పూజ అసంపూర్తిగా చెబుతారు. వినాయకుడి మొదటి సేవకుడిగా ఎలుక.. భక్తులు చేసే ప్రతి పూజను స్వామికి చేరవేస్తుంది. అలాంటి పూజతోనే ఆ ఇంట్లో ఐశ్వర్యం, సంతోషాలు వచ్చి చేరడంతో పాటు అడ్డంకులు తొలగి విజయం సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

Story first published: Sunday, September 13, 2026, 10:55 [IST]
Desktop Bottom Promotion