దీపావళి పర్వదినాన శరీరానికి నూనె పట్టించి స్నానం చేయడం ఎందుకు చాలా ముఖ్యమో తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రాచీన కాలంగా వస్తున్న ఔషధ సంప్రదాయాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. దీనిని హిందువులు వేద కాలం నుండి ఆచరిస్తున్నారు. ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏ వయస్సు వారైనా లింగ బేధంతో సంబంధం లేకుండా, గర్భవతులైన సరే లేక అనారోగ్యం భారిన పడిన వాళ్ళైనా సరే ఇలా ఎవ్వరైనా వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చమురు స్నానం ఒంటికి చాలా మంచిదని, శరీరానికి అంతా నూనె పట్టించుకోని స్నానం చేయడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఈ " చమురు స్నానాన్ని " సంస్కృతంలో " తైల స్నానం " అని కూడా అంటారు. హిందూ గ్రంథముల ప్రకారం చంద్రుడికి సంబంధించిన రోజులు అంటే శనివారం,సోమవారం, బుధవారం మరియు శుక్రవారం చమురు స్నానం చేయడం మంచిది. సూర్యుడికి సంబంధించిన రోజులైనా ఆదివారం, మంగళవారం మరియు గురువారాల్లో అస్సలు చమురు స్నానం చేయకూడదట.

ముఖ్యంగా శనివారం మరియు శుక్రవారం ఈ చమురు స్నానం చేయడం స్త్రీ పురుషులు ఇద్దరికీ చాలా మంచిదని గ్రంధాలు చెబుతున్నాయి. అమావాస్య , పౌర్ణమి మరియు ఒక నక్షత్రాల రోజున ఈ స్నానం అస్సలు చేయకూడదట.

పురుషులు :

పురుషులు ఎప్పుడైతే ఈ చమురు స్నానం చేస్తారో, ఆ సమయంలో వారు తలతో పటు శరీరానికి అంతా చమురు రాసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ ఏడుగురి చిరంజీవులైన అశ్వథామ, బలి, వ్యాస, హనుమాన్, విభీషణ, కృప మరియు పరశురామ ఆశీర్వాదాలు దక్కడానికి ఒక మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం మంచి ఆరోగ్యంతో జీవిస్తారట.

" అశ్వథామో బలిర్ వ్యాసో హనుమానశ్చ విభీషణః,

కృపః పరశురామశ్చ , సప్తైతే చిరంజీవినాహ్ ."

స్త్రీలు :

స్త్రీలు ఈ క్రింద చెప్పబడే మంత్రాన్ని పఠించాలి

" అహల్య ద్రౌపది సీత తార మండోదరి తథా

పంచకన్యాహ్ స్మరేన్నిత్యం మహాపాతక నాశనం "

ఈ మంత్రంలో ఉన్న అహల్య, ద్రౌపది, సీత, తార మరియు మండోదరి అనే ఈ ఐదు పాత్రలను " పంచ కన్యలు " అంటారు. వీరి యొక్క ఆశీర్వాదాలు సర్వపాపాలను పోగొడతాయట.

WHAT IS THE SIGNIFICANCE OF THE OIL-BATH DURING DEEPAVALI?

ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే :

సాధారణంగానే ఈ చమురు స్నానం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఈ కారణం చేతనే చాలా జాతక గ్రంధాలు మరియు పురాణ గ్రంధాల్లో కొన్ని రోజులు మాత్రమే ఈ స్నానం చేయమని చెప్పారు. ఈ చమురు స్నానం వల్ల, ఆ స్నానం చేసిన రోజుల్లో ఒకింత మత్తుగా ఉంటుంది. ఈ చమురు స్నానం చాలా ఆరోగ్యవంతమైనదని మరియు మంచిదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ స్నానం వల్ల ఎందుకు నిద్రావస్థ గా ఉంటుంది మరియు మత్తుగా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

మన శరీరంలో ఉండే శక్తి కేంద్రాలైన వాత, కఫ, పిత ఇవన్నీ ఎప్పుడూ సమతుల్యతతో ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. ఎప్పుడైతే చమురు స్నానం చేస్తామో, వీటి యొక్క సమతుల్యత దెబ్బ తింటుంది, అందువల్ల నిద్ర అనేది వస్తుంది. ఇంతక ముందు మనం చెప్పుకున్నట్లుగానే ఈ చమురు స్నానం కొన్ని రోజులు మాత్రమే చేయమని చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల సాధారణంగా కలిగే అసమతుల్యత ను సరిచేయవచ్చు.

పవిత్రమైన రోజు :

మాములు రోజుల్లో స్నానం చేయడం ఒక ఎత్తు అయితే " చతుర్దశి " వంటి రోజులలో లింగ బేధంలేకుండా ఎవరైనా ఈ చమురు స్నానం చేయడం మరింత మంచిదని చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సంస్కృతంలో " ఆయుష్ కారకన్ " గా పిలవబడే శని చతుర్దశి ని పరిపాలిస్తాడు మరియు శనివారం ఇందిర పరిపాలిస్తారు అని గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా చేయడం అందరికీ మంచిదని చెబుతున్నారు.

ముఖ్య గమనిక : శని వారాల్లో చమురు స్నానం చేయడం వల్ల శనీశ్వరుడని ప్రసన్నం చేసుకోవచ్చట. అతడు పరీక్షలు పెట్టే సమయం లో జరిగే చెడు ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చంట.

మన్వంతర లో ఏడుగురు గొప్ప ఋషులలో ఒక్కరైనా భరద్వాజ ఏమని చెబుతున్నారంటే, తిధులు మరియు చెప్పబడిన ముఖ్యమైన రోజుల్లో చమురు స్నానం చేయడం చాలా మంచిది.

WHAT IS THE SIGNIFICANCE OF THE OIL-BATH DURING DEEPAVALI?

దీపావళి రోజున చమురు స్నానం :

అశ్విన నెలలో చీకటి పక్షం రోజులలో 14 వ రోజున తెల్లవారుజామున ప్రతిఒక్కరు చమురు స్నానం చేయాలి. శరీరానికి మొత్తం చమురు రాసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఒకవేళ నరకచతుర్దశి ఆదివారం గనుక పడితే, స్వాతి నక్షత్రం ఆ రోజున పరిపాలిస్తూ ఉంటుంది గనుక ఏదైనా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి స్నానం చేసుకోవాలి.

దీపావళి రోజున లక్ష్మి దేవి చమురులో ఉంటుంది మరియు గంగాదేవి గోరువెచ్చని నీటిలో ఉంటుంది. ఈ రెండింటిని ఉపయోగించి స్నానం చేయడం వల్ల దురదృష్టం దూరం అవుతుంది. స్నానం చేసుకున్న తర్వాత కొత్త బట్టలు మరియు నగలు వేసుకోవాలి.

ముఖ్య గమనిక : సాధారణంగా పర్వదినాల రోజున చమురు స్నానాలు చేయకూడదు అని గ్రంధాలు చెబుతున్నాయి. అయితే దీపావళి రోజున మాత్రం ఇది వర్తించదు. ఈ మినహాయింపు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, శ్రీకృష్ణుడు నకరాసురుడికి ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏమిటంటే, అతడి చావుకు గుర్తుగా దీపావళి రోజున ప్రతి ఒక్కరు చమురు స్నానం చేయాలని చెబుతాడు.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

1. తల నుండి క్రింద కాళి బొటన వ్రేలు వరకు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను రాయాలి. ఆ తర్వాత బాగా మర్దన చేయాలి. మొదట తల పై కొద్దిగా రాయాలి, నెమ్మదిగా నిమరాలి, ఆ తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ నూనె వేసి బాగా మర్దన చేయాలి.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

2. ముఖం పైన, కళ్ళకు, ముక్కు పైన, ఎక్కడెక్కడ అయితే వెంట్రుకలు ఉంటాయో అక్కడ అంతా,చెవులు, చంకలు, బొడ్డు, గజ్జ మరియు గుదము భాగాల్లో నూనె రాయాలి.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

3. శరీరం లో మిగతా భాగాల్లో కూడా నూనె రాసుకోవాలి. తల నుండి నూనెను తీసుకొని మిగతా భాగాలకు రాయకండి.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

4. అరగంట నుండి ముప్పావు గంట వరకు శరీరాన్ని అలానే వదిలివేయండి.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

5. ఆ తర్వాత నూనె మొత్తం శరీరం నుండి వెళ్లిపోవడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మొదట తలస్నానం " షికాయి " తో చేయడం మొదలు పెట్టండి.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

6. ఈ చమురు స్నానం చేయడానికి ఎప్పుడు ఉత్తమమైన సమయం ?

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

6. సూర్యుడు ఉదయించిన తర్వాత మూడు గంటల లోపల ఈ చమురు స్నానం చేయడం చాలా మంచిది.

చమురు స్నానం ఎలా చేయాలంటే :

చమురు స్నానం ఎలా చేయాలంటే :

ముఖ్య గమనిక : మీరు తీసుకొనే నూనె ఈ రకంగా కూడా కలుపుకోవచ్చు. 50% కొబ్బరి నూనె, 40% నువ్వుల నూనె, 10% ఆముదం నూనె.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

1. శరీరం మొత్తంలో చర్మం పై ఉండే జిడ్డు పదార్ధాలన్నింటిని ఇది తొలగిస్తుంది మరియు లోపల ఉండే వేడిని బయటకు తీసుకొస్తుంది. ఇలా చేయడం వల్ల ఎంతో ఉత్తేజితులవుతారు. వారిలో ఎంతో శక్తి మరియు ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది, ఆధ్యాత్మిక శక్తి బాగా పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా బాగా కలుగుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

2. మైగ్రేన్ ( పార్శ్వపు నొప్పి ), ఒత్తిడి, పొట్ట రుగ్మత, మధుమేహం, శృంగార రుగ్మత, పచ్చకామెర్లు, క్యాన్సర్ మరియు వివిధ రకాల అంటురోగాలు నయం చేయడానికి లేదా చికిత్స చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

3. బాగా నిద్రపట్టడానికి మరియు మనం రోజు చేసే పనుల్లో ఏకాగ్రత కుదరడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

4. చర్మం యొక్క ఛాయ మరియు నిర్మాణాన్ని పెంపొందిస్తుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

5. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

6. కంటికి చాలా లాభం కలిగిస్తుంది. ఎందుకంటే, కంటి చూపుని మెరుగుపరుస్తుంది మరియు కంట్లో ఉండే దుమ్ము ధూళిని బయటకు పంపిస్తుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

7. నరాలకు చాలా మంచి చేస్తుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

8. మోచేతులు, మోకాళ్ళు, పాదాలు మరియు చేతులు దగ్గర చర్మం పొడిబారకుండా అరికడుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

9. ఒత్తిడిలో ఉన్న కండరాలకు స్వాంతన చేకూరుస్తుంది మరియు తల్లుల్లో వక్షోజాల నుండి పాలు అధికంగా రావడానికి దోహద పడుతుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

10. మానసిక మరియు శారీరిక ఒత్తిడిలను తగ్గిస్తుంది.

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

చమురు స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

11. కొన్ని సిద్ద గ్రంధాల ప్రకారం, చమురు స్నానం ఆకర్షణ గుణాన్ని పెంపొదిస్తుందట. దీని ఫలితంగా సానుకూల దృక్పధం కలిగిన వ్యక్తులను మరియు శక్తులను ఎక్కువగా ఆకర్షిస్తారట మరియు అదే సమయంలో వ్యతిరేక భావం కలిగిన వ్యక్తులను మరియు శక్తులను తమ దారుల నుండి తొలగించుకొని దూరం పెడతారట.

English summary

WHAT IS THE SIGNIFICANCE OF THE OIL-BATH DURING DEEPAVALI?

WHAT IS THE SIGNIFICANCE OF THE OIL-BATH DURING DEEPAVALI? , During on the 4th day of Diwali or the Narak Chaturdashi or Roop Chaudas, we have head bath with scented oil. The most important ritual of the Naraka Chaturdashi is, people wake up early in the morning (before sunrise) or during moon-rise,
Subscribe Newsletter