శాలిగ్రామంని పూజించడానికి గల ప్రాముఖ్యత !

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మన దేశంలో అనేకమంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. దేశవ్యాప్తంగా పూజలందుకుంటూ ఉన్నారు. వివిధ రూపాలలో వీరిని పూజిస్తారు. ఈ రూపాలలో వేటికదే ప్రత్యేకమైనది. ఆయా రూపాలను పూజించే ప్రజలు ఆ దేవుళ్లను హృదయంలో నిలుపుకుని కొలుస్తారు.

రామాయణ మహాభారతాల వంటి పురాతన గ్రంధాలపై హిందూయిజం ఆధారపడి ఉంది. వీటన్నిటిలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ప్రస్తావన విరివిగా వస్తూ ఉంటుంది. ప్రతి దేవుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరి అవతారమని ప్రజల నమ్మకం.

హిందూయిజంలో, కొన్నిచిహ్నాలకి ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రతి దేవుడు ఎదో ఒక చిహ్నంతో అనుసంధానమై ఉంటాడని నమ్మకం. ఆ సింబల్ ని పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడు శివలింగం రూపంలో కొలువై ఉంటాడని ప్రగాఢ నమ్మకం. అదే విధంగా శ్రీమహావిష్ణువు కూడా ఒక రూపంలో దర్శనమిస్తాడు. అదే శాలిగ్రామ రూపం.

Importance of Worshipping Shaligram

శాలిగ్రామం అంటే ఏమిటి?

పవిత్రమైన నల్లటి రాయిగా దర్శనమిచ్చే శాలిగ్రామాన్ని వైష్ణవులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఇందులో కొలువై ఉన్నారని వారు నమ్ముతారు. నేపాల్లోని గండకి నది వద్ద శాలిగ్రామాలు విస్తృతంగా లభిస్తాయి.

కొన్ని వేల ఏళ్ళ క్రితంనుంచి ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని నమ్మకం. పురాణాలలో శాలిగ్రామ శిల ప్రాముఖ్యత గురించి దానిని పూజించడం వెనుక గల ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది.

ఈ ప్రదేశంలో లభించే శాలిగ్రామ శిలలో విష్ణు చిహ్నమైన నారాయణ చక్రం ఉంటుంది. ఇది ఎంతో పవిత్రమైన చిహ్నం. ఈ శిల వివిధ ప్రాంతాలలో లభ్యమైనా కూడా ఇక్కడ కనిపించే శాలిగ్రామ శిలకి వాటికీ దగ్గరి పోలికే ఉండదని అంటారు.

Importance of Worshipping Shaligram

శాలిగ్రామంని పూజించడానికి గల ప్రాధాన్యం

శాలిగ్రామ పురాణం:

శ్రీమహావిష్ణువు ఈ శాలిగ్రామ శిలలో కొలువై ఉండడం వెనుక ఒక ఆసక్తి కార కథనం ఉంది.

ఒకసారి శంఖచూడుడనే రాక్షసుడికి పరమశివుడికి మధ్యన భీకర యుద్ధం సంభవించింది. అయితే, శంఖచూడుడిని వధించడం ఎవరి తరం కాలేదు. అతని భార్య పాతివ్రత్య భంగం కలిగిన తరువాతే శంఖచూడుడికి మరణం కలుగుతుంది.

పరమశివుడిని ఓడించడానికి శంఖచూడుడు మహాశివుడి రూపంలో పార్వతి దేవిని చేరుకున్నాడు. అయితే, ఈ విషయం పార్వతీ దేవి గ్రహించింది. ఇదే సంఘటనని, మహావిష్ణువు దూరం నుంచి గమనించాడు. ఇదే చిట్కాను శంఖచూడుడి భార్య బృందపై ప్రయోగించదలిచాడు.

అందువలన, మహావిష్ణువు శంఖచూడుడి రూపంలో బృంద వద్దకు చేరాడు. ఈ విషయాన్ని ఆమె గ్రహించలేదు. ఇద్దరూ కలిసి సంభోగంలో పాల్గొన్నారు. తద్వారా, బృంద పాతివ్రత్యం దెబ్బతింది.

విష్ణుమూర్తి తన భర్త రూపంలో తన వద్దకు చేరి తన పాతివ్రత్యాన్ని దెబ్బతీశాడని తెలుసుకున్న బృంద ఆగ్రహావేశాలకు గురైంది. విష్ణుమూర్తిని నల్లని శిలగా మారిపొమ్మని శపించింది. విష్ణుమూర్తి వలెనే తన భర్త మరణించాడని వేదన చెందింది. ఆ విధంగా విష్ణుమూర్తి నల్లని శిలగా శాలిగ్రామ రూపంలోకి మారిపోతాడు.

అయితే, ఆ తరువాత తన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని బృంద భావిస్తుంది. అయితే, అది సాధ్యం కాదు గనక ఈ రూపాన్ని మహావిష్ణువు రూపంగా కొలవమని దేవదేవుడు ఆదేశించాడు.

Importance of Worshipping Shaligram

శాలిగ్రామంని పూజించడానికి గల ప్రాధాన్యం

పురాతన గ్రంధాల ప్రకారం శాలిగ్రామాన్ని పూజించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. ఒక రాగి పాత్రలో శాలిగ్రామాన్ని ఉంచి అందులో పళ్ళని అలాగే పూలని ఉంచాలి.

ఉదయాన్నే అలాగే ఈ శాలిగ్రామాన్ని పూజించాలి. ఈ శాలిగ్రామాన్ని తులసితో పాటు పూజించాలి. శాలిగ్రామాన్ని రోజూ పూజించేవారు ఆరోగ్యంతో అలాగే సంపదతో తులతూగుతారు.

శాలిగ్రామాన్ని శుభ్రం చేయడానికి వాడే నీటిని పవిత్ర జలంగా భావిస్తారు. ఇంటిని శుద్ధిచేసుకోవడానికి ఈ నీటిని వాడతారు. అలాగే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని మరియు చెడు దృష్టిని తొలగించేందుకు ఈ నీటిని వాడతారు . వైకుంఠ ధామానికి చేరుకోవడానికి ఈ నీటిని చనిపోయిన వ్యక్తి చేత తాగిస్తారు.

శాలిగ్రామాన్ని పూజించడం వలన శాంతి లభిస్తుంది. అలాగే ఆనందం కూడా లభిస్తుంది. తులసి ఆకులను, అగరబత్తిని, హారతిని, నైవేద్యాన్ని ఉపయోగించే శాలగ్రామాన్ని పూజించాలి. ధ్యానం చేయాలి.

గంగాజలంతో అలాగే పంచామృతంతో శాలిగ్రామాన్ని ప్రతి ఉదయం పూజించాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని లేదా మరేదైనా మంత్రాన్ని జపిస్తూ మహావిష్ణువుని స్మరిస్తూ శాలిగ్రామాన్ని పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

English summary

Importance of Worshipping Shaligram

Shaligram, or Saligram, also known as a black stone, is worshipped by many Hindus, especially by Vaishnavas. Many believe that lord Vishnu himself resides inside the shaligram and these are kept in temples and in many houses. Special pujas and offerings need to be made for the shaligram, as per Hinduism.
Story first published: Monday, February 26, 2018, 11:00 [IST]