For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడా? వాస్తవాలేమిటి? చరిత్ర ఏం చెబుతోంది...

|

పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు అయోధ్య నుండి పరిపాలన సాగించాడని పండితులు చెబుతారు. శ్రీరాముని పూర్వీకులైన అయుథ్ మహారాజు పేరు వల్లే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ నగరాన్ని ఔద్ లేదా అవధ్ అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాదుకు తూర్పున గంగానది తీరంలో కొలువై ఉన్న పవిత్ర నగరమే అయోధ్య.

మన దేశంలో పూర్వ కాలం నుండి హిందువులు ఏడు నగరాలను పవిత్ర నగరాలుగా భావించేవారు. అందులో ఒకటి అయోధ్య నగరం. ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన నేల ఇదే అని చాలా మంది నమ్మకం.

రాముడు పట్టాభిషేకం పొందిన తర్వాత, అక్కడ ఆ సమయంలోనే భారీగా జనం నివసించేవారు. వారంతా రాముడి పాలనలో నిత్యం సుఖ సంతోషాలతో, ఆర్థికంగా, ఉన్నత స్థితిలో ఉండేవారు.

కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేదని పెద్దలు చెబుతుంటారు. బుద్ధుడి కాలంలో (క్రీస్తు పూర్వం 5-6వ శతాబ్దంలో) అయోధ్య నగరానికి శ్రావస్థి పాలకుడిగా ఉండేవాడు. బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి అయోధ్యకు చాలా సారూప్యత ఉందని పూర్వీకులు చెబుతుండేవారు.

అయోధ్య నగరం కేవలం హిందువులకే కాదు.. ఇతర సంప్రదాయాలైన జైన, బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉండేది. మధ్యయుగంలో భారత్ లోని ప్రముఖ సన్యాసి రామానంద్ జన్మించింది ప్రయాగలోనే అయినా రామానంద సంప్రదాయానికి ముఖ్య కేంద్రం అయోధ్యే అయ్యింది.

800 ఏళ్ల వరకూ..

800 ఏళ్ల వరకూ..

అయోధ్య నగరాన్ని 800 ఏళ్ల నాటి కాలంలో శ్రావస్తి పాలించగా.. తర్వాత ఈ నగారన్ని మగథకు చెందిన మౌర్యులు.. వారి నుండి గుప్తులు, కన్నోజ్ పాలకుల ఆధీనంలో ఉంటూ వచ్చింది. చివర్లో ఇక్కడ మహమ్మద్ గజని మేనల్లుడు సయ్యద్ సోలార్ ఇక్కడ టర్కీ పాలనను స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే అతనిని బహ్రయిన్ లో 1033లో హత్య చేశారు.

1400 ఏళ్ల కాలంలో..

1400 ఏళ్ల కాలంలో..

ఆ తర్వాత అయోధ్య నగరం షర్కుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 1440లో ఇది షక్ పాలకుడు మహముద్ షాకు దక్కింది. ఈయన తరవ్వాత 1526 బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

1992లో కూల్చివేత..

1992లో కూల్చివేత..

అయితే 1992లో రామ జన్మభూమి ఆందోళనల సమయంలో ఆ మసీదును కూల్చివేశారు. దీంతో అప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడ నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండేది. ఇది కాస్త భూ రాజకీయం, వ్యాపార విషయంగా మారిపోయిందని, అందుకే ఈ కేసు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిందని పెద్దలు చెబుతుంటారు.

ఎన్నో శతాబ్దాల చరిత్ర..

ఎన్నో శతాబ్దాల చరిత్ర..

ఈ అయోధ్య నగరం ఎన్నో శతాబ్దాల నగరంగా పేరు గాంచినప్పటికీ, అక్కడ పౌరాణిక కట్టడాలు, ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది 2019 సంవత్సరంలో నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తన తీర్పును అయోధ్య ట్రస్టును అనుకూలంగా ప్రకటించింది. వివాదస్పద స్థలం 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, అదే సమయంలో సున్నీ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తెలిపింది. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు.

English summary

Interesting Facts about Ayodhya Ram Mandir in Telugu

Here we talking about interesting facts about Ayodhya Ram Mandir. Read on.