For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుద్ధుని తలపై ఉండే రింగుల జుట్టు వెనుక రహస్యాలేంటో తెలుసా...

గౌతమ బుద్ధుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

పురాణాల ప్రకారం గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదో అవతారమని చాలా మంది నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణమి అనే పేర్లతో పిలువబడే పవిత్రమైన బుద్ధుడు జన్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమి మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోదనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా పుట్టాడు. మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ణానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు.

Interesting Facts About Lord Gautama Buddha

మరో వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు. తన తల్లి చనిపోవడంతో గౌతమి అనే స్త్రీ వద్ద సిద్ధార్థుడు పెరిగాడని, అందుకే తనకు గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఈ సందర్భంగా గౌతమబుద్ధుని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Interesting Facts About Lord Gautama Buddha

Buddha Purnima 2021: బుద్ధ పూర్ణిమ ఎప్పుడు? ఈ పూర్ణిమ ప్రత్యేకతలేంటో తెలుసా...Buddha Purnima 2021: బుద్ధ పూర్ణిమ ఎప్పుడు? ఈ పూర్ణిమ ప్రత్యేకతలేంటో తెలుసా...

బుద్ధుని కాలంలోనే..

బుద్ధుని కాలంలోనే..

గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకు పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు తనను పూజించేందుకు పూలు తీసుకొచ్చారు. అయితే బుద్ధుడు ఆ సమయంలో ఎక్కడికో వెళ్లిపోయారు.

బోధి చెట్టుకు పూజలు..

బోధి చెట్టుకు పూజలు..

ఎంతసేపటికీ తను రాకపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. అప్పుడు పూలన్నీ వాడిపోయాయి. ఆ తర్వాత వచ్చిన బుద్ధుడికి ఆనంద పిండకుడు ఈ విషయాన్ని వివరించారు. బుద్ధుడు లేనప్పుడు పూజ చేసేందుకు ఏదైనా వస్తువును ఉంచి వెళ్లాల్సిందిగా కోరాడు. అప్పుడు తన శరీర భాగాలకు పూజలు వద్దని చెప్పిన బుద్ధుడు.. బోధి చెట్టుకు పూజకు అనుమతించాడు.

వేలాది మంది బౌద్ధులు..

వేలాది మంది బౌద్ధులు..

అప్పటి నుండి బేతవన విహారంలో ఒక బోధి చెట్టును నాటి దాన్ని పెద్దగా పెంచాలని నిర్ణయించారు ఆనందుడు. అలా అనుకున్న వెంటనే గయలోని బోధి చెట్టు నుండి విత్తనం తెప్పించి నాటారు. అప్పుడు పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవంలో కోసలదేశపు రాజు కూడా పాల్గొన్నారు. వేలాది మంది బౌద్ధులు తరలివచ్చారు.

Buddha Purnima 2021 : బుద్ధుడు నిజంగా ఆ రోజే పుట్టాడా? ఎందుకని ఆరోజు వేడుకలు జరుపుతారు?Buddha Purnima 2021 : బుద్ధుడు నిజంగా ఆ రోజే పుట్టాడా? ఎందుకని ఆరోజు వేడుకలు జరుపుతారు?

బుద్ధుని తలపై వెంట్రుకలు..!

బుద్ధుని తలపై వెంట్రుకలు..!

చరిత్ర ప్రకారం.. గౌతమ బుద్ధుని తలపై వెంట్రుకలు ఉండవు. తను తన రాజ్యాన్ని వీడటానికి ముందే శిరోముండనం(వెంట్రుకలు తీయించుకుని) చేయించుకున్నాడు. అయితే ప్రతి బుద్ధ విగ్రహం, ఫొటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా.. రింగులు.. రింగులు కనిపిస్తుంటాయి. దీంతో తనకు రింగుల జుట్టు ఉందేమో అనుకుంటారు. అయితే అవి వెంట్రుకలు కావు. వాస్తవానికి బుద్ధుడి తలపై ఉండేది చనిపోయిన 108 నత్తలు.

బుద్ధుడి తల రహస్యం..!

బుద్ధుడి తల రహస్యం..!

బుద్ధుడు ఓ రోజు చెట్టు కింద కూర్చొని ద్యానం చేస్తుండేవాడు. ద్యానంలో మునిగిపోయిన ఆయనకు సమయం తెలియలేదు. సమయం పెరుగుతున్న కొద్దీ సూర్యుడు తన నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధుడిని చూసింది. సూర్యకిరణాల వల్ల తన ఏకాగ్రత దెబ్బ తింటుందోమోనని ఆలోచించింది. వెంటనే అతని తలపైకి ఎక్కేసింది. తన శరీరలంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా మార్చేసింది. ఇదే నత్తను మరిన్ని నత్తలు అనుసరించాయి. ఇవన్నీ బుద్ధుడి తలపై చేరి తన ద్యానానికి భంగం కలగకుండా సహాయపడ్డాయి.

నత్తలను అమరులుగా..

నత్తలను అమరులుగా..

అలా కొన్ని గంటల పాటు బుద్ధుని తలపైనే ఉన్న నత్తలు సూర్యుని వేడిని తట్టుకోలేక నీరసపడ్డాయి. వాటి బాడీలోని మొత్తం నీటి శాతం తగ్గిపోయింది. దీంతో అవి అన్నీ మరణించాయి. ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ద్యానం విరమించే సమయానికి తలపై 108 నత్తలు చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు. తన ద్యానం కోసం అవి ప్రాణాలు కోల్పోయాయని భావించాడు. బుద్ధుని కోసం ప్రాణాలిచ్చిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను, ఫొటోలను తయారు చేస్తుంటారు.

English summary

Interesting Facts About Lord Gautama Buddha

Here are the interesting facts about lord gautama buddha. Have a look
Desktop Bottom Promotion