For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణభారతంలోని ఆ దేవుడిని దర్శస్తే.. కంటిచూపు కచ్చితంగా తిరిగొస్తుందట...!

|

మన దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ అశేష ఆలయాలు నిత్యం కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఎంతమంది దేవుళ్లు ఉన్నా.. ఎన్ని ఆలయాలు ఉన్నా ఆ పరమేశ్వరుడికి ఉన్న ప్రత్యేకతే వేరు.

Interesting Facts about Srikanteshwara Swamy

ఈ భోళా శంకరుడికి అనేక పేర్లు ఉన్నాయి. శివుడు, మంజునాథ, నీలకంఠ, ముల్లోకాలను పాలించే త్రినేత్రుడు అని రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే శివుడు వెలసిన కర్నాటకలోని ఈ ప్రాంతంలో మాత్రం శివుడిని నంజుండేశ్వరస్వామి అని పిలుస్తారు.

Interesting Facts about Srikanteshwara Swamy

అంతేకాదు శ్రీకంఠేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు. ఈ పేరుతో ఎందుకు పిలుస్తారంటే కంటిచూపు ప్రసాదిస్తాడనే నమ్మకంతో ఈ పేరుతో ఎక్కువగా ఉచ్చరిస్తారట ఈ ఆలయానికి వచ్చే భక్తులు. అయితే ఈ దేవాలయం కర్నాటకలో ఎక్కడ ఉంది. ఈ ఆలయం విశేషాలతో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...

కంబి నది తీరంలో..

కంబి నది తీరంలో..

కర్నాటక రాష్ట్రంలోని క్లీన్ సిటీ మైసూరుకు దక్షిణ వైపున సుమారు 18 కిలోమీటర్ల దూరంలో సంజనగూడలో అతి పురాతనమైన శ్రీకంఠేశ్వర ఆలయం ఉంది. ఇది కంబి నది తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది.

అతి పెద్ద గోపురం..

అతి పెద్ద గోపురం..

ఇక్కడ ఈ ఆలయాన్ని సంజన్ గూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గోపురం ఎత్తు ఏకంగా 120 అడుగుల వరకు ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే.. కంటి చూపు లేని వారు ఈ గుడిని సందర్శించి శివుడిని ప్రార్థిస్తే.. ఆ పరమేశ్వరుడు కంటిచూపు ప్రసాదిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్ర ప్రకారం అప్పటి మైసూరు రాజు టిప్పు సుల్తాన్ కూడా తన పట్టపుటేనుగుకు చూపు కోల్పోతే, ఈ స్వామినే ప్రార్థించాడని, దీంతో ఏనుగుకు కూడా చూపు వచ్చిందని స్థానికులు చెబుతారు.

మీ బాడీలోని ఈ 8 భాగాలలో మచ్చలుంటే మీ చేతిలో డబ్బే నిలబడదంట... అవెక్కడో చూసెయ్యండి...మీ బాడీలోని ఈ 8 భాగాలలో మచ్చలుంటే మీ చేతిలో డబ్బే నిలబడదంట... అవెక్కడో చూసెయ్యండి...

నంజుండేశ్వర పేరు ఎలా అంటే?

నంజుండేశ్వర పేరు ఎలా అంటే?

ఆ పరమేశ్వరుడికి ఇక్కడ నంజుండేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే.. పాలసముద్రంలో ఉద్భవించిన విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోవడం వల్లనే పరమేశ్వరుడికి నంజుండేశ్వర అనే పేరు వచ్చిందట. ఆ స్వామి పేరుతోనే ఆ పట్టణానికి నంజన్ గూడ్ అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు.

63 విగ్రహాలు..

63 విగ్రహాలు..

ఈ ఆలయం చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, ఇది అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం నిర్మాణం అంతా ద్రవిడుల పద్ధతుల్లోనే ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం చుట్టూ శైవభక్తులైన నాయనారులు 63 విగ్రహాలు ఉన్నాయి.

11వ శతాబ్దంలో..

11వ శతాబ్దంలో..

ఈ విగ్రహాలన్నీ 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు. ఈ ఆలయం ప్రాంగణంలో రాతిపై శివలీలలు అద్భుతమైన చిత్రాలతో రూపొందించబడ్డాయి.

శివుడితో పాటు..

శివుడితో పాటు..

ఈ శివాలయంలో శ్రీకంఠేశ్వరస్వామితో పాటు శ్రీసుబ్రహ్మణేశ్వర స్వామి వారు నెమలి వాహనంపై కూర్చొని ఉండగా, నాగేంద్రుడు సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది.

తీర్థయాత్ర పూర్తి కావాలంటే..

తీర్థయాత్ర పూర్తి కావాలంటే..

ఇదే నంజన్ గూడ పట్టణంలో పరశురామ ఆలయం కూడా ఉంది. అందరూ ముందుగా పరమేశ్వరుడిని దర్శించినప్పటికీ, ఆ పరశురామ ఆలయాన్ని దర్శించకుంటే తీర్థయాత్ర పూర్తి కానట్టే అని భక్తులు నమ్ముతారట.

హత్యా దోషాలు పొగొట్టుకోవడానికి..

హత్యా దోషాలు పొగొట్టుకోవడానికి..

ఈ పరశురాముని దేవాలయం కౌండిన్య నది గుట్టపై ఉంది. ఇక్కడ పరశురాముడు తన తల్లి యొక్క హత్యా దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేశాడని చాలా మంది నమ్ముతారు. ఈ స్వామిని దర్శించిన వారికి తెలిసి, తెలియకుండా చేసిన పాపాలతో పాటు దీర్ఘకాలిక రోగాలన్నీ నయమవుతాయట.

ఇక్కడి మృత్తికా..

ఇక్కడి మృత్తికా..

అలాగే ఈ ఆలయం ప్రాంగంణంలోని మృత్తికా ఎన్నో ఔషధాని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మృత్తికను చర్మ రోగాలను నయం చేసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారట.

English summary

Interesting Facts about Srikanteshwara Swamy

Here we talking about intersting facts about srikanteshwara swamy. Read on.
Story first published:Tuesday, June 9, 2020, 17:38 [IST]
Desktop Bottom Promotion