For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విష్ణుమూర్తి గురించి మీకు తెలియని ఆశ్చర్యకర రహస్యాలు..!!

హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తి గురించి పురాణ గాధలలో శాంతాకారం భుజగశయనం అని రాసి ఉంటుంది. అంటే ఏమిటి ? ఆయన శేషనాగుపై ఎందుకు విశ్రాంతి తీసుకుంటారు ?

By Swathi
|

హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తి గురించి పురాణ గాధలలో శాంతాకారం భుజగశయనం అని రాసి ఉంటుంది. అంటే శేషనాగుపై విష్ణువు సేదతీరుతుంటాడు. ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే సమాధానం వినిపిస్తుంది.

Interesting Things About Lord Vishnu That No One Knows

అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేదతీరుతారు ? పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణమేంటి ? విష్ణుమూర్తికి హరి, నారాయణ అనే పేర్లు ఎందుకు ? గంగానదితో విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏంటి ? వంటి రకరకాల ఆసక్తికర విషయాలు మీకు వివరించబోతున్నాం.

అయితే విష్ణుమూర్తి గురించి చాలా పవర్స్, సీక్రెట్స్ ని పురాణాలు వివరిస్తున్నాయి. ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరిచేవిగా, ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. మరి విష్ణుమూర్తి గురించి ఆసక్తికర రహస్యాలేంటో చూద్దామా..

రెండు ముఖాలు

రెండు ముఖాలు

పురాణాలు విష్ణుమూర్తి రెండు ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడు, రెండో ముఖం భయపెట్టే రూపం. అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చుని ఉన్న రూపం.

శేషనాగుపై ఎందుకు ?

శేషనాగుపై ఎందుకు ?

విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేదతీరుతారు. అనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు, పనులతో నిమగ్నమై ఉంటుంది. వాటిలో చాలా వరకు కుటుంబం, సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి.

బాధ్యతలు

బాధ్యతలు

ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి. ఆందోళన కలిగించేవి ఉంటాయి.

ఓర్పు అవసరం

ఓర్పు అవసరం

ప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది. అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తారు.

నారాయణుడిగా ఎందుకు పిలుస్తారు

నారాయణుడిగా ఎందుకు పిలుస్తారు

హిందూ పురాణం ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు. నారదుడు ఎప్పుడూ నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పేర్లన్నింటికీ నారణయ అని జోడిస్తారు. ఉదాహరణకు సత్య నారాయణ, అనంత నారాయణ, లక్ష్మీ నారాయణ, శేష నారాయణ.

మరో పురాణ గాధ

మరో పురాణ గాధ

నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని మరో పురాణం చెబుతోంది. విష్ణుపాదోదకం అనే పదం నుంచి గంగా నది పేరు వచ్చింది. అంటే విష్ణువు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయని అర్థం. అలాగే నీరు (neer)లోనే విష్ణుమూర్తి ఎప్పుడూ నివసిస్తాడు. కాబట్టి నీరు అనేది నారాయణుడిని పలికిస్తుంది. విష్ణువు నీటిలో నివసిస్తాడని అర్థం.

హరి అని ఎందుకు పిలుస్తారు

హరి అని ఎందుకు పిలుస్తారు

విష్ణుమూర్తిని హరి అని పిలుస్తామని మనందరికి తెలుసు. కానీ ఎందుకు హరి అని పిలుస్తారు ? అనేది చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడు అని అర్థం.

పాపాలు

పాపాలు

హరి హరతి పాపాని అని విష్ణుమూర్తిని స్మరిస్తారు. అంటే.. జీవితంలో చేసిన పాపాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆ హరి హర నాథుడే తొలగిస్తాడని సూచిస్తుంది.

English summary

Interesting Things About Lord Vishnu That No One Knows

Interesting Things About Lord Vishnu That No One Knows. According to Hindu mythology, Lord Vishnu is considered to the creator of the world.
Story first published: Wednesday, December 7, 2016, 15:42 [IST]
Desktop Bottom Promotion