For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానం చేయ్యకుండా దీపం పెట్టడం..పూజలు.. చెయ్యొచ్చా...?

|

మన భారతీయ జీవన విధానంలో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ప్రతీ రోజూ స్నానం చెయ్యడం మన పద్దతి. కొంతమంది రెండు పూటలా స్నానం చేస్తారు. పండగలొస్తే ప్రత్యేకంగా స్నంన చేయ్యడం అందిరికి తెలిసిన విషయమే....వస్తు గుణ దీపికలో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. తలంటు స్నానంను అభ్యంగన్నస్నానం అంటి అంటారు.

స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలోని చర్మ సమస్యలు, దుస్వప్నములు దరిచేరవు. శరీరం మీద మలినాలను, దుర్గందాలనును పోగొడుతుంది. సుఖంగా నిద్రపడుతుంది. శరీరం తేలికగా ఉండటం, దేహానికి పుష్టి, కాంతి, మ్రుదుత్వం కలుగుతుంది. కండ్లకు చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. వృద్యాప్యం తొందరగా రాదు, అలసటనూ, వాతమును పోగొడుతుంది. కాంతి, ఆయుష్ష పెరుగుతుంది, బుద్ది బలిమి, దేహ పుష్టి, వీర్య వృద్ది, కలుగుతాయి. జటరాగ్ని బాగుంటుంది. దేహం, కాళ్ళుచేతులు, గోళ్లు సిరస్సులందు పుట్టిన తాపంను మంటలను పోగొట్టును. మాడపట్టున చమురును వుంచి మర్థించడం వల్ల చెవులకు తక్కిన అవయవాలాకు బలం చేకూరుతుంది. తల వెంట్రుకలు పెరుగుతాయి, అరిపాదాలు చమురు మర్ధించడం వల్ల మంటలను పోవును. అరికాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

స్నానం వల్ల ఇన్ని లాభాలున్నందు వల్లే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధ్యాన్యత నిచ్చారు. ఆరోగ్య పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. పూజలు చేయునప్పుడు తప్పని సరిగా స్నానమాచరించవలయును. కొంత మందికి పూజ చేయడానికి ముందు స్నానం చేయాలా అని అడుగుతుంటారు...?

 శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి.

శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి.

ఇదేం ప్రశ్న? ఎవరైనా అసలు స్నానం చెయ్యకుండా పూజ చేస్తారా? చెయ్యకూడదు కదా!? నిజమేనండీ. చెయ్యకూడదు. మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనసూ, శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి.

కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు.

కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు.

కానీ కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు. దూర ప్రయాణాలలోకానీ, జబ్బుచెయ్యటవల్లకానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడుకానీ, వృధ్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్ధితుల్లో వుండక పోవచ్చు. అలాంటప్పుడు పూజ మానేయాలా? అక్కరలేదు.

 ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు.

ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు.

ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు. అప్పటిదాకా మనం చేసుకునే వూజ, పారాయణ వగైరాలన్నీ అలాంటి సందర్భాలలోకూడా మానకుండా చేసుకోవచ్చు. ఎలాగంటారా?

మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడు

మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడు

మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడండీ. వీలయితే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని, మగవారయితే భస్మాన్ని ధరించి, ఆడవారయితే పసుపు నీరు పైన చిలకరించుకుని, మానసిక పూజ చేసుకోవచ్చు.

దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.

దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.

అయితే ఇలాంటప్పుడు బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.

కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు

కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు

కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు, పూజలూ, అభిషేకాలూ, చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు.

అన్ని మానసికంగా చెయ్యవచ్చు.

అన్ని మానసికంగా చెయ్యవచ్చు.

అన్ని మానసికంగా చెయ్యవచ్చు. వృధ్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి లేక పోవచ్చు.

 మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.

మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.

వారు అలవాటయిన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.

మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.

మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.

మనం ఎక్కడ వున్నా, ఏ పరిస్ధితుల్లో వున్నా, మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.

ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా

ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా

ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా మానసిక పూజ చెయ్యటానికి స్నానంతో సంబంధం లేదు.

నిద్ర లేవగానే

నిద్ర లేవగానే

మామూలుగా ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్కమీదనుంచి దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే దిగాలి.

English summary

Is it okay to do Puja without bathing?

Generally, physical purity (suchi) is a common requirement for doing pujas which is done by bathing as water acts as a purifier. But apart from bathing pranayama is also an purifier. A simple method for puja is said in Bhagavatam as thus:
Desktop Bottom Promotion