For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్గశిర మాసంలో మంచి ముహుర్తాలుంటాయా? పెళ్లిళ్లకు ఈ నెల మంచిదా? కాదా?

మార్గశిర మాసంలో పెళ్లిళ్లు చేసుకోవడం మంచిదా కాదా ఇప్పుడే తెలుసుకోండి.

|

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.

Is Margasira Masam Good for Marriage

కార్తీక మాసం వచ్చే ఈ మాసంలో పెళ్లిళ్లు చాలా జరుగుతాయి. అంతేకాదు ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు కూడా జరుపుతారు. ఇప్పటికే చాలా చోట్ల పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం.

Is Margasira Masam Good for Marriage

తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మార్గశిర మాసం ప్రారంభమైంది. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది.

Is Margasira Masam Good for Marriage

ఈ మాసాన్ని ముక్తికి మార్గంగా కూడా చెబుతారు. ఇదిలా ఉండగా.. కొందరికి ఈ మాసంలో పెళ్లిళ్లు చేసుకోవచ్చా లేదా అనే సందేహాలున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసంలో పెళ్లి చేసుకోవచ్చా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Margasira Month 2021: ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసా...Margasira Month 2021: ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసా...

ఈ నెలలో పెళ్లి చేసుకుంటే..

ఈ నెలలో పెళ్లి చేసుకుంటే..

శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశీర్షం. శ్రీక్రిష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో.. ఈ కాలంలో పొలాల నుండి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని.. అందుకే ఈ మాసాన్ని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. అందుకే ఈ మాసంలో పెళ్లి చేసుకుంటే తమ జీవితం సంతోషంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

ధనస్సులోకి సూర్యుడు..

ధనస్సులోకి సూర్యుడు..

ఇదే మాసంలో నవ గ్రహాలలో రాజుగా పరిగణించబడే సూర్యుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలాన్ని ధనస్సు సంక్రాంతి అంటరు. ఇది చలికాలం ఆరంభాన్ని సూచిస్తుంది. 2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనస్సులోకి సంచారం చేయనున్నాడు.

Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...

ఎన్నో పండుగలు..

ఎన్నో పండుగలు..

మార్గశిర మాసంలో గీతా జయంతి, దత్తాత్రేయుని జయంతి, అయ్యప్ప స్వామి మండలి పూజ ప్రారంభం వంటి ఎన్నో పండుగలు వస్తాయి. శ్రీ మహా విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసంగా మార్గశిర మాసాన్ని చెబుతారు. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే ప్రతి ఒక్క కోరికా నెరవేరుతుందట.

చాలా రోజులు మంచివే..

చాలా రోజులు మంచివే..

మార్గశిర మాసంలో దాదాపు అన్నీ రోజులు మంచిగా ఉంటాయని పండితులు చెబుతారు. ఈ నెలలో శుభకార్యాలు ప్రారంభించడానికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో వివాహం చేసుకోవడానికి ఎన్నో అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఇప్పటికే 9,10, 11, 12వ తేదీల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరిగాయి. డిసెంబర్ 9వ తేదీన బాలీవుడ్ ప్రముఖులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. అదే విధంగా 17, 18, 19వ తేదీన కూడా మరికొన్ని వివాహాలు జరగనున్నాయి. వీటితో పాటు నెలఖారులో కూడా చాలా మంది బ్రహ్మచారులు పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ధనుర్మాస వ్రతం..

ధనుర్మాస వ్రతం..

మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం' చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు' అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.

FAQ's
  • 2021 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమైంది?

    2021 సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమైంది. ఈ మాసంలోనే గీతా జయంతి వస్తుంది. శ్రీక్రిష్ణుడు మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి రోజున అర్జునుడికి గీతోపదేశం చేశాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ మాసాన్ని శ్రీక్రిష్ణుడికి అంకితమిచ్చారు.

English summary

Is Margasira Masam Good for Marriage?

Here we are talking about is margasira masam good for marriage. Have a look
Desktop Bottom Promotion