పూజలో కొబ్బరికాయ కుళ్లితే?! కొబ్బరికాయలో పువ్వు వస్తే?! దేనికి సంకేతం?!

Posted By:
Subscribe to Boldsky

హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.

కొన్ని శతాబాద్ధాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు. అలాగే గొప్ప ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయ గురించి ప్రస్తావించారు.

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ? హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి.కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయను పూజారి కొట్టడం జరుగుతుంటుంది. మరికొన్ని ఆలయాల్లో భక్తులే కొబ్బరికాయ కొట్టి స్వామికి అంజేస్తుంటారు.

పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు. అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది వారం వారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. మరికొందరు అమావాస్యకు కొడతారు. మరికొందరు పండుగల సమయంలో మాత్రమే కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం పాటిస్తారు. పెళ్లి సమయంలో, యగ్నాలు, హోమాల సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలు ఉపయోగిస్తారు. పూజలన్నింటిలోనూ కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరికాయ గురించి మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం...

బ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

బ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా ... చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది.

కొబ్బరికాయ సమానంగా పగలడం వలన,

కొబ్బరికాయ సమానంగా పగలడం వలన,

కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు.

 కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే,

కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే,

ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు.

కొబ్బరి కాయనానావంకరలుగా పగిలితే

కొబ్బరి కాయనానావంకరలుగా పగిలితే

అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానావంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది.

కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగిలితే

కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగిలితే

ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు.

కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే,

కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే,

కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ ... కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్నినింపుకుని, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు.

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయి కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది.

ఇంట్లో పూజ చేసేటప్పుడు

ఇంట్లో పూజ చేసేటప్పుడు

అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ.. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి.

 వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే..

వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే..

వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.

గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే

గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే

గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి త దహం భ క్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ॥

భగవద్గీతలో చెప్పినట్టుగా, భ

భగవద్గీతలో చెప్పినట్టుగా, భ

అని భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరి స్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడు.

 మంగళ ప్రదం.

మంగళ ప్రదం.

కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళ ప్రదం. మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు. భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు. తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

English summary

Is Rotten Coconut is Inauspicious thing?

during puja spoiled coconut is it bad-sign
Story first published: Thursday, February 9, 2017, 15:41 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter