For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jagannath Puri Rath Yatra 2021: జగన్నాథుని ఆశీస్సులు ఆన్ లైన్ నుంచే...!

2021లో జగన్నాథ రథయాత్ర తేదీ, సమయం, ప్రాముఖ్యత, విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జులై మాసంలో సుమారు పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి.

Jagannath Puri Rath Yatra 2021, date, time, importance, rules and guidelines

కరోనా కారణంగా గత ఏడాది నామ మాత్రపు భక్తులతోనే ఈ రథయాత్ర వేడుకలు జరిగాయి. ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి భక్తులు లేకుండానే జగన్నాథుడి రథయాత్ర సాదాసీదాగా జరగనుంది.

Jagannath Puri Rath Yatra 2021, date, time, importance, rules and guidelines

మరో నెల రోజుల్లో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జగన్నాథుడి రథయాత్ర తేదీ, సమయంతో పాటు జగన్నాథుని ప్రాముఖ్యత, కరోనా గైడ్ లైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

జులై 12 నుండి..

జులై 12 నుండి..

2021లో జగన్నాథుడి రథయాత్ర జులై 12వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దేవశయని ఏకాదశి అనగా జులై 20వ తేదీ ఈ రథయాత్ర ముగుస్తుంది. యాత్ర మొదటి రోజున జగన్నాథుడు ప్రసిద్ధ గుండిచ మాతా ఆలయాన్ని సందర్శిస్తాడు. అయితే ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్ర బోసిపోయేలా కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒడిశా సర్కారు రథయాత్రకు భక్తులెవరినీ అనుమతించడం లేదని ప్రకటించేసింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది దేవుళ్లకు కూడా తీరని కష్టాలొచ్చాయి.

పరిమితంగా భక్తులు..

పరిమితంగా భక్తులు..

కరోనా రెండో సంవత్సరంలో కూడా పూరి జగన్నాథ యాత్రను భక్తులు లేకుండా నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిద్ నియమ నిబంధనలను పాటిస్తూ.. రథయాత్రను నిర్వహిస్తామని పరిమిత స్థాయిలో భక్తులు, పండితులు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారని తెలిపింది.

అనుమతి ఎవరికంటే..

అనుమతి ఎవరికంటే..

జగన్నాథుడి రథయాత్రకు ఈసారి ఎవరెవరికి అనుమతి దొరకుతుందంటే.. ఎవరైతే కరోనా నెగిటివ్ రిపోర్టు తెచ్చుకుంటారో మరియు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న రథయాత్రకు అనుమతి సులభంగా లభిస్తుంది. మరోవైపు జగన్నాథ రథయాత్ర నిర్వహించే రోజున పూరిలో కర్ఫ్యూ విధిస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు.

జగన్నాథుని రథయాత్ర ప్రాముఖ్యత..

జగన్నాథుని రథయాత్ర ప్రాముఖ్యత..

హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు తన సోదరుడు బాలభద్ర మరియు సోదరి సుభద్ర అవతారమైన జగన్నాథుడి రథయాత్రో పూరిలో నిర్వహించబడుతుందది. ఈ రథయాత్ర పది రోజుల పాటు కన్నులపండుగగా జరుగుతుంది. తలధ్వజ అని పిలువబడే బాలభద్ర రథం ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉంటుంది. మధ్యలో సుభద్ర రథం వెళ్తుంది. వీటినే దర్పదాలన లేదా పద్మ రథం అంటారు. చివరగా నంది ఘోష్ అని పిలువబడే జగన్నాథ ప్రభువు రథం కదులుతుంది. ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూసిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని, స్వేచ్ఛ లభిస్తుందని మరియు మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

800 సంవత్సరాల పురాతనమైనది..

800 సంవత్సరాల పురాతనమైనది..

జగన్నాథుని ఆలయం భారతదేశంలో అతి పెద్ద తీర్థయాత్రల్లో ఒకటి. దీనికి నాలుగో స్థానం వచ్చింది. ఈ ఆలయం 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఈ ఆలయం చుట్టూ నాలుగు గోడలు ఉంటాయి. ఈ ఆలయంలో జగన్నాథడు, తన సోదరుడు బాలభద్ర మరియు సోదరి సుభద్ర దేవతలు భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం.

ప్రతి ఏటా కొత్త రథాలు..

ప్రతి ఏటా కొత్త రథాలు..

ఇక్కడి రథయాత్రలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలను సిద్ధం చేస్తారు. అవి స్వచ్ఛమైన మరియు నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు. వీటిలో గోర్లు, ముళ్లు లేదా ఇతర లోహాలను ఉపయోగించరు. ఈ రథం మూడు రంగులలో ఉంటుంది. జగన్నాథుని రథం ఎత్తు 45 అడుగుల వరకు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు కేవలం పదిహేను రోజుల ముందు జగన్నాథుడు అనారోగ్యానికి గురయ్యాడని, ఆ దేవుడు కోలుకున్నతర్వాత ఈ ఊరేగింపు బయటకు వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

English summary

Jagannath Puri Rath Yatra 2021, date, time, importance, rules and guidelines

Here we are talking about the Jagannath Puri Rath Yatra 2021, date, time, importance, rules and guidelines. Read on
Desktop Bottom Promotion