For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాన్ని జపిస్తే భయం తొలగిపోతుందట...!

|

హిందూ పంచాగం ప్రకారం, మాఘ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు అంపశయ్యపై పడిపోయాడు. ఆ సమయంలో భీష్ముడి శరీరం మొత్తం బాణాలు చేరిపోయి.. తన శక్తి మొత్తం పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘ మాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ.. నీరు లేదు.. ఆహారం లేదు.

ఆ సమయంలో ఎక్కడి వారంతా తమ తమ రాజ్యాలకు వెళ్లిపోయారు. అలా సుమారు నెల రోజులు గడిచాయి. స్వచ్ఛంద మరణం కూడా పొందేవాడు. కానీ ఆయన ఇలాంటి బాధలన్నీ భరిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఉత్తరాయణం వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందులోనూ ముఖ్యంగా ఒక ఏకాదశి రోజున తన శరీరం నుండి నిష్క్రమించాలని ఆ దేవుడిని తలచుకుంటున్నాడు. మనసులో శ్రీక్రిష్ణుడిని తలచుకున్నాడు. అలా ఎంతో నిష్టగా ఉన్న ఆయన శ్రీక్రిష్ణ భగవానుడితో మాట్లాడగలిగేవాడు. అంత జ్ణానులైన మహనీయులకు ఎలాంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది.

మరి అలాంటి వారు ఏ రోజున శరీరం నుండి నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారనే భయం కూడా అవసరం లేదు. భీష్ముడు తనకి 'మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః' అని అనుకున్న ఆ మహనీయుడు తనకు సర్వం శ్రీక్రిష్ణ భగవానుడే అని విశ్వసించేవాడు. అందుకే ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం లభిస్తుంది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన రోజున శ్రీక్రిష్ణుడు భీష్మపితామహుడికి దేహానికి బాధ కలగకుండా ఓ వరం ఇస్తాడు. అంతేకాదు తన చేత పాండవులకు ఉపదేశం చేయిస్తాడు. ఆరోజేనే ఏకాదశి. అందుకే ఈ ఏకాదశి జయ భీష్మ ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తలుసుకుందాం...

అన్నిదానాల కంటే అన్నదానం ఎందుకు ముఖ్యమో తెలుసా...

ఒక దోషం..

ఒక దోషం..

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పొరపాటు చేస్తుంటారు. అలాగే భీష్ముడు కూడా ఒక తప్పు చేశాడు. తను చేసిన ఒక దోషం తనకు బాగా గుర్తుంటుంది. అందరికీ ప్రతి దోషం తమ శరీరంపై రాసి ఉంటుందట..అది తొలగిపోతే తప్ప ఎలాంటి సద్గతి రాదట.

భీష్ముడు చేయలేనిది..

భీష్ముడు చేయలేనిది..

మహాభారతంలో నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్ముడు ఏమి చేయలేకపోయాడు. తను ఎంతగానో ఇష్టపడే దైవ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయాడట. మరోవైపు ద్రౌపదికి శ్రీక్రిష్ణుడటంటే అమితమైన భక్తి. ఆ సమయంలో కౌరవులను ఎదిరించడానికి ఎవ్వరూ సాయం చేయలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనపెట్టారు.

శ్రీక్రిష్ణుడు తట్టుకోలేడు..

శ్రీక్రిష్ణుడు తట్టుకోలేడు..

అయితే తన భక్తులకు ఏదైనా ఆపద కలిగితే శ్రీక్రిష్ణుడు తట్టుకోలేడు. అలాంటి ద్రౌపదికి నిండు సభలో జరిగే అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులకు గుణపాఠం చెప్పాడు. అంతేకాదు ఆ దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టింది.

Ratha Saptami 2021:సూర్య దేవుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకుంటాయో తెలుసా...

ధర్మరాజు సందేహాల సమయంలో..

ధర్మరాజు సందేహాల సమయంలో..

మరో సందర్భంలో ధర్మరాజుకు భీష్ముడు ధర్మసందేహాలను తీరుస్తుంటే.. అక్కడే ఉన్న ద్రౌపది నవ్వుతూ ‘తాతా! ఆనాడు నాకు నిండు సభలో అవమానం జరుగుతుంటే, ఏమైంది ధర్మం అని అడిగిందట. అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా శరీరం అప్పుడు దుర్యోదనుడి ఉప్పు తిన్నది. నా అదుపులో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా శరీరం నా మాట వినలేదు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే నేను అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు.

పరిశుద్ధం చేసుకోవాలనే..

పరిశుద్ధం చేసుకోవాలనే..

ద్రౌపదితోనే భీష్మపితామహుడు ఇలా అన్నాడు. ‘నా శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకే నేను ఈరోజు ధర్మాలను చెప్పొచ్చు' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు.

శ్రీక్రిష్ణుడు వరం..

శ్రీక్రిష్ణుడు వరం..

శ్రీక్రిష్ణ భగవానుడు భీష్మపితామహుడికి శరీరం నుండి బాధలు రాకుండా వరం ఇచ్చి ఇలా చెప్పించాడు. అదే సమయంలో నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు. నీవే నేరుగా చెప్పొచ్చు కదా అని అడిగితే.. అందుకు క్రిష్ణుడు నేనే చెప్పొచ్చు. కానీ నీలాంటి అనుభవం ఉన్న వారు స్పష్టత ఉంటుంది. నేను చెబితే ఉండదు అని చెప్పారట.

సాగరం లాంటి దేవుడు..

సాగరం లాంటి దేవుడు..

దేవుడు సాగరం లాంటి వాడు. నీరు ఉంటుంది కానీ తాగేందుకు ఉపయోగపడదు. కానీ అదే నీటిని మేఘం నుడి రప్పిస్తే తాగేందుకే కాదు.. పంట పొలాలకు ఉపయోగం. అందుకే భగవంతుడి జ్ణానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా లోకానికి అందితే హితకరం.

భయం తొలగిపోతుంది..

భయం తొలగిపోతుంది..

అలా శ్రీక్రిష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీతను మాత్రం క్రిష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీవిష్ణు సహస్రనామాలన్ని భీష్ముడి ద్వారానే చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంటుంది. అంతేకాదు ఈ విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగిపోతుంది... శుభ ఫలితాలు వస్తాయి. అందుకే భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అందరికీ శుభం కలుగుతుంది.

English summary

Jaya bheeshma ekadashi Importance and Significance in Telugu

Here we are talking about the jaya bheeshma ekadashi importance and significance in Telugu. Read on