మీ జీవితంలో వ్యతిరేక భావనలు తొలగించే కాలాష్టమి

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

ఫ్రెండ్స్, మీ జీవితంలో ఉండే భయాలను, కష్టాలను ఇతర అవాంతరాలను పారద్రోలేందుకు పరిహారం ఉందంటే మీరెలా భావిస్తారు? నేటిప్రపంచం వివిధారాకాల భయాందోళనలతో, మృత్యుభయం, ఓటమి భయం, పోటీదారుల భయం, ఒకటేమిటి రకరకాల భయాలతో నిండి ఉంది. పగలురాత్రి వివిధారాకాల కష్టాలతో సతమతమవుతున్న ప్రజలు మన చుట్టూ కనిపిస్తారు.

ఏదేమైనా, ఆ భగవంతుడు మనందరిని అన్నిటికీ సన్నద్ధులగానేచేసి ఈ భూమి మీదకు పంపుతారు. మనకు ఏదైనా కష్టంఎదురయ్యేటప్పుడు, చేతనైనవిధంగా సహాయపడటానికి ఆయనెపుడు తయారుగా ఉంటారు. మనకు అవసరమైనదల్లా కాస్తంత భక్తి మరియు నమ్మకంతోపాటు ఆ భగవంతుని మెప్పించడానికి కొద్దిపాటి ఆచారాలు పాటించడమే!

Whether it is the fear of failure

ఓటమి భయాన్ని జయించడానికి తగిన పరిష్కారం పొందటానికి కాలాష్టమి రోజు సరైనది. కాలాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పౌర్ణమి పోయిన ఎనిమిదవ రోజు కాలాష్టమి. కనుక ఇది కృష్ణపక్షంలో వస్తుంది.ఈ సంవత్సరం ఏప్రిల్ ఎడవతేది, అనగా శనివారం కాలాష్టమి. ఈ రోజునే కలభైరవుడు జన్మించాడు. కనుక ఈ రోజున కాలభైరవుని పూజిస్తారు. ఈరోజునే కాలభైరవాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా అంటారు. కాల అనగా సమయం, ఇది మృత్యుదేవత అనగా యమునికి సంకేతం. శివుని యొక్క ఉగ్రరూపమే యముడు, విధ్వంసకర్త. ఈ విధంగా కాలాష్టమి పేరు ఉద్భవించింది. ఈ రోజున శివుని కాలభైరవునిగా కొలుస్తారు. కాలభైరవుడు నల్లని కుక్కపై భయంకరమైన అవతారం కలిగి చేతిలో గదతో ఉంటారు.

కాలాష్టమి పూజను ఎలా చేయాలి?

ఈ రోజున ప్రజలు కాలభైరవ విగ్రహారాధన చేస్తారు. ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. భక్తులు కాలభైరవాష్టకం పఠించి నల్లని కుక్కకు ఆహారం అందిస్తారు. కొంతమంది ఉపవాసం కూడా చేస్తారు.

ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి ఆ భగవంతుని ఆశీస్సుల వలన జీవితంలో చెడు పరిహారమవుతుంది. కాలసర్ప పూజ, శక్తి పూజ, రక్ష పూజ మొదలైనవి వారి అవసరాల అనుసారం చేస్తారు. ఒక జ్యోతీష్కుడిని సంప్రదించి తరువాత ఒక వ్యక్తి తన యొక్క జన్మసమయంలో గ్రహ సంచారమును బట్టి ఏ పూజ అవసరమనేది నిర్ణయిస్తారు.

కాలాష్టమి వెనకున్న కథ: కాలాష్టమి యొక్క విశిష్టత ఆదిత్య పురాణంలో వివరించబడినది. హిందూ గ్రంధముల అనుసారం ఒకసారి బ్రహ్మ, విష్ణు మరియు శివుని మధ్య వారిలో ఎవరు గొప్పవారు అనే వివాదం తలెత్తింది. ఈ సందర్భంలో బ్రహ్మ శివుని యెడల అనుచిత వ్యాఖ్య చేసాడు. బ్రహ్మదేవుడు అక్కడ ఋషులు, మునులు చెప్పినట్లు అందరూ సమనమనే వాదనతో ఏకీభవించలేదు. బ్రహ్మదేవుని గర్వానికి కోపిగించుకున్న శివుడు ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ధ్యానంలో ఉన్న శివుడు ఎంతలా శాంతంగా ఉంటాడో ,కోపం వచ్చినప్పుడు అంతే ఆవేశం ఉంటాడని మనకు తెలిసినదే!

బ్రహ్మదేవుని గర్వభంగం కలిగించాలన్న యోచనతో శివుడు మాహాకాళేశ్వర రూపం ధరించి బ్రహ్మదేవుని నాలుగు శిరస్సులలో ఒకదానిని ఖండించారు. అప్పుడు ముక్కోటిదేవతలు శివుని శాంతించమని వేడుకొన్నారు. బ్రహ్మదేవుడు కూడా తన తప్పిదాన్ని గ్రహించి మన్నించమన్నాడు. ఈ రోజునే మనం మహాకాలాష్టమిగా కూడా జరుపుకుంటాం.

ఈ అష్టమి నాడు మీ యొక్క చింతలు, చికాకులు మరియు ఇతర వ్యతిరేక భావనలు తొలగి మీ మనస్సు, ఆత్మ ఆనందం, సంతోషం వంటి అనుకూల భావనలు ఆ మహాకాల, కాలభైరవుల ఆశీస్సులతో మీరుకూడా పొందాలనేదే మా కోరిక కూడా.

English summary

Kalashtami Will Drive Away All The Negativies From Your Life

Kalashtmi is the the eighth day after the Poornima that is the full moon day. So, it falls in the Krishna Paksh. This year, the day falls on 7th of April, which is a Saturday. This is the day when lord Kaalbhairav was born.So, on this day, Kaalbhairav is worshipped. Hence, it is also known as Kaalbhairav Jayanti and also Kaalbhairav Ashtmi.
Story first published: Tuesday, April 10, 2018, 13:30 [IST]