For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kamada Ekadashi 2021 : అంటే ఏమిటి? తెలీక చేసిన తప్పులన్నీ ఈ ఒక్కరోజు చేసే పూజ, వ్రతంతో తొలగిపోతాయట...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే వీటిలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

ఇదిలా ఉండగా.. తెలుగు వారి నూతన సంవత్సరంలోని ఛైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశినే కామద ఏకాదశి అని లేదా దమన ఏకాదశి అని పిలుస్తారు.

ఈ పవిత్రమైన రోజున వ్రతం చేస్తూ.. విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. సుఖసంతోషాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఫ్లవ నామ సంవత్సరంలో కామద ఏకాదశి ఎప్పుడొచ్చింది.. కామద ఏకాదశి శుభ సమయం, వ్రత విధానం.. పూజా విధానం.. ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శాస్త్రాల ప్రకారం, ఇలాంటి ఆహారం పొరపాటున కూడా తినకూడదట.. ఎందుకో తెలుసా...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2021 ఫ్లవ నామ సంవత్సరంలో కామద ఏకాదశి ఏప్రిల్ గురువారం రాత్రి 11:35 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది తిరిగి మరుసటి రోజు అంటే 23వ తేదీ శుక్రవారం రాత్రి 9:47 గంటలకు ముగుస్తుంది.

విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు..

విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు..

కామద ఏకాదశి రోజున మహిళలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేస్తారు. అంతకుముందు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయానికి వెళ్లి తమ సౌభాగ్యాన్ని కాపాడాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, తమ కష్టాలన్నీ తొలగిపోవాలని విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున కొందరు స్త్రీలు నోములు, వ్రతాలు చేస్తారు. అదే సమయంలో ఉపవాసం ఉంటూ.. జాగరణ నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

వైవాహిక జీవితంలో..

వైవాహిక జీవితంలో..

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలైనా ముగిసిపోతాయని, దీనికి నిదర్శనంగా పురాణ సంబంధమైన ఒక కథ కూడా వినిపిస్తూ ఉంటారు. వరాహ పురాణంలో శ్రీక్రిష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించాడు. వశిష్ట మహాముని దిలీప్ మహారాజుకి ఈ ఏకాదశి కథను వివరించారు.

Ram Navami 2021: రామునికి రెండు తెలుగు రాష్ట్రాలతో ఎలాంటి అనుబంధం ఉండేదో తెలుసా...

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం, పూర్వకాలంలో రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పాలించేవాడు. తన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, అప్సరసలు, కవులు, కళాకారులందరూ తమ ప్రదర్శనలతో రాజును ఆకట్టుకునేవారు. అయితే ఓ రోజు గంధర్వులలో ఓ గంధర్వుడి సతి సభలో లేనందుకు, చాలా దిగాలుగా ఉంటాడు. ఆ సమయంలో తను చేయాల్సిన పనిని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేకపోతాడు. ఇది గమనించిన రాజు గంధర్వుడికి శిక్ష విధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడుతూ అడవిలోకి ప్రయాణించింది. అలా వెళ్తున్న సమయంలో, అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా, ఒక శ్రింగి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి తన బాధనంతా ఆ మహర్షితో చెప్పుకుని.. తమ బాధలు పోగొట్టుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకొంది.

భక్తి శ్రద్ధలతో..

భక్తి శ్రద్ధలతో..

అప్పుడు శ్రింగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని తనకు వివరించాడు. ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య లలిత సంతోషంతో ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి, ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవ భగవంతుడిని మనసులో తలచుకుంటూ వింత ఆకారంలో ఉన్న తన భర్తకు పూర్వ ఆకారం ప్రసాదించాలని కోరుకుంటుంది. దీంతో వారికి మోక్షం లభించింది. కాబట్టి మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజ, ఆచరించే వ్రతం, ఉపవాసం ఉండటం వల్ల పోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.

కొత్త పనికి మంచిగా..

కొత్త పనికి మంచిగా..

హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 23వ తేదీన పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈరోజున కొత్త పని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. ఈరోజున శుభకార్యాలను కూడా ప్రారంభించొచ్చు. మీరు ఏదైనా ప్రయత్నంలో సులభంగా విజయం సాధించే అవకాశం ఉంది.

English summary

Kamada Ekadashi 2021 Date, Muhurat, Puja Vidhi in Telugu

Know about the 2021 Kamada ekadashi date, time, shubh muhurat, importance and vrat puja vidhi in Telugu.
Desktop Bottom Promotion