For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kansa Vadh 2020 : కంసుడిని శ్రీక్రిష్ణుడు వధించడానికి గల కారణాలేంటో తెలుసా...

కంసుడి శ్రీక్రిష్ణుడు చిన్నప్పుడే ఎందుకు వధించాడో కారణాలను తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం, శ్రీమహా విష్ణువు భూమి మీద జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు తను పలు అవతరాల్లో భూమి మీదకు వస్తాడు. అలా శ్రీక్రిష్ణుని రూపంలో భూమి మీదకు వచ్చి.. తన చిన్నతనంలోనే మేనమామ వరుసయ్యే కంసుడిని సంహరిస్తాడు.

Kansa Vadh 2020 Date, Time, Rituals and Significance

అదే రోజున కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి కొత్త రాజుగా తిరిగి నియమించబడ్డాడు. రాక్షస అంశుతో పుట్టిన దుష్టుడైన కంసుడు చనిపోవడంతో.. ఈ సమయాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. అప్పటినుండి ఈరోజును కంసుని వధించిన రోజుగా ఒక పండుగలా జరుపుకుంటారు.

Kansa Vadh 2020 Date, Time, Rituals and Significance

అలా ప్రతి ఏటా జరుపుకునే కంసుని వధ పండుగ ఈ సంవత్సరం నవంబర్ 24వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా కంసుడిని శ్రీక్రిష్ణుడు ఎందుకు చంపాడు.. ఈ పండుగను ఎప్పుడు.. ఎలా జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కంసుని వధ ఎప్పుడు జరుపుకుంటారు?

కంసుని వధ ఎప్పుడు జరుపుకుంటారు?

పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో శుద్ద క్రిష్ణ పక్షం యొక్క దశమి రోజున కంసుని వధ వేడుకలను జరుపుకుంటారు. శ్రీకిష్ణుడు మరియు అతని మేనమామ కంసుడి మధ్య జరిగిన యుద్ధాన్ని ఈరోజు సూచిస్తుంది. కంసుడిని సంహరించిన తర్వాత శ్రీక్రిష్ణుడు తన జీవ సంబంధమైన తల్లిదండ్రులు దేవకి మరియు వసుదేవులను ఉగ్రసేన రాజు విడుదల చేస్తారు.

ఈ పండుగ ఆచారాలు..

ఈ పండుగ ఆచారాలు..

కంసుని వధించిన సందర్భంగా శ్రీక్రిష్ణ భగవానుడికి, రాధదేవికి భక్తులందరూ ప్రార్థనలు చేస్తారు. అదే సమయంలో అందరికీ వివిధ రకాల స్వీట్లు మరియు నైవేద్యాలను సమర్పిస్తారు. ఈరోజు ‘హరే రామ హరే క్రిష్ణ' అనే మంత్రాన్ని జపిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు కంసుని విగ్రహాన్ని తయారు చేసి దానిని దహనం చేస్తారు. మధుర ప్రజలు వారి నగరంలో ఈరోజున సంగీతం, గానం, న్రుత్యం మరియు అనేక కల్చరల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ‘కంసుని వధ లీలా' అనే చిన్న నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు. దీన్ని చూసి ప్రజలందరూ ఆనందిస్తారు.

కంసుడు-క్రిష్ణుడి ప్రాముఖ్యత..

కంసుడు-క్రిష్ణుడి ప్రాముఖ్యత..

కంసుడు శక్తివంతమైన దుష్టపాలకుడు. తన పాలనలో అనేక చెడ్డ పనులు చేస్తాడు. ఆకాశవాణి చెప్పిన విషయంతో తన చెల్లెల్లికి పుట్టిన బిడ్డలను వెంటనే చంపేస్తారు. అదే సందర్భంలో దేవకి, వసుదేవుడిని ఒక చెరసాలలో బంధిస్తాడు. అయితే శ్రీక్రిష్ణుడు పుట్టిన విషయం మాత్రం తనకు తెలియకుండా వారు జాగ్రత్తపడతారు. ఈ విషయం తెలుసుకున్న కంసుడు రేపల్లెలోని పిల్లలందరినీ చంపేస్తాడు. ఒక అందమైన అమ్మాయిని కూడా హత్య చేస్తాడు. అంతటితో ఆగకుండా ఒక రాక్షసిని ఆ ఊరి మీదకు పంపి తన పాలలో విషమిచ్చి పిల్లలందరినీ చంపిస్తాడు. అయితే క్రిష్ణుడు అదే సమయంలో ఆమె శరీరంలోని పాలతో పాటు తన రక్తాన్నంత పీల్చేసి తనను చంపేస్తాడు. ఆ తర్వాత పెరిగి పెద్దయిన శ్రీక్రిష్ణుడు కంసుని రాజ్యానికి తన అన్న బలరాముడితో కలిసి వెళ్తాడు. అప్పటికే వాళ్లను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసింటాడు కంసుడు. కానీ ఫలితం మాత్రం శూన్యమేనని తనకు తెలియదు. చివరకు శ్రీక్రిష్ణుడు ఇన్నాళ్లు మామయ్య అన్న ఒకేఒక్క కారణంతో నీ దుశ్చర్యలను సహించాను. ఇక సహించను అని కంసుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి రాజుగా మారతాడు.

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

కార్తీక మాసంలోని శుద్ధ క్రిష్ణ పక్షంలో మంగళవారం ఉదయం 8:58 నుండి 9:42 గంటల వరకు రాత్రి 10:54 నుండి 11:57 గంటల సమయంలో ఈ వేడుకలను జరుపుకుంటారు.

English summary

Kansa Vadh 2020 Date, Time, Rituals and Significance

The incident is popularly known as 'Kansa Vadh' and it symbolises the triumph of good over bad. On this day King Ugrasen was reinstated as the new king of Mathura.
Story first published:Monday, November 23, 2020, 23:36 [IST]
Desktop Bottom Promotion