For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kansa Vadh 2021:కంసుడి సంహారం దేన్ని సూచిస్తుంది.. ఈ పండుగ ప్రత్యేకతలేంటో తెలుసా...

|

హిందూ పురాణాల ప్రకారం, శ్రీమహా విష్ణువు భూమి మీద జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు పలు అవతరాల్లో భూమి మీదకు వస్తాడు. అలా శ్రీక్రిష్ణుని రూపంలో భూమి మీదకు వచ్చి.. తన చిన్నతనంలోనే మేనమామ వరుసయ్యే కంసుడిని సంహరిస్తాడు.

అదే రోజున కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి కొత్త రాజుగా తిరిగి నియమించబడ్డాడు. రాక్షస అంశుతో పుట్టిన దుష్టుడైన కంసుడు చనిపోవడంతో.. ఈ సమయాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. అప్పటినుండి ఈరోజును కంసుని వధించిన రోజుగా ఒక పండుగలా జరుపుకుంటారు.

అలా ప్రతి ఏటా కంసుని వధ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 13వ తేదీన శనివారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా కంసుడిని శ్రీక్రిష్ణుడు ఎందుకు చంపాడు.. ఈ పండుగను ఎప్పుడు.. ఎలా జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీక మాసంలో ప్రభోధ ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే.. ఎంతో పుణ్యం లభిస్తుందట...!

కంస వధ 2021 తేదీ..

కంస వధ 2021 తేదీ..

హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పదో రోజున కంస వధ సంఘటన జరిగింది. ఈ రోజే శ్రీక్రిష్ణుడు మరియు తన మేనమామ కంసుడి మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాతే దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు దేవకి మరియు వసుదేవులను ఉగ్రసేన రాజు విడుదల చేస్తారు. 2021 సంవత్సరంలో నవంబర్ 13వ తేదీన కంస వధను జరుపుకోనున్నారు.

కంస వధ ప్రాముఖ్యత..

కంస వధ ప్రాముఖ్యత..

కంసుడు తన జీవిత కాలంలో, రాక్షసుల సైన్యంతో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాడు. రోజురోజుకు భూమి మీద తన అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోతాయి. ఈ సమయంలో ప్రజలందరూ విష్ణుమూర్తి శరణు కోరగా.. శ్రీమహావిష్ణువు క్రిష్ణుని రూపంలో కంసుడి పాపాలను అంతం చేసేందుకు భూమి మీదకు వస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా చీకటి జీవితం గడుపుతున్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు కంసుడిని సంహరిస్తాడు. ఈ సందర్భంగా ప్రజలందరూ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.

పూజా విధానం..

పూజా విధానం..

కంస వధ సందర్భంగా శ్రీక్రిష్ణుడు మరియు రాధా రాణికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో పాటు ప్రత్యేక వంటకాలను తయారు చేసి భోగ్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ దేవుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అదే సమయంలో కంసుని వధ మరియు పాపాల ముగింపును సూచించే ఒక దిష్టిబొమ్మ లేదా బొమ్మ రూపంలో ఉండే విగ్రహానికి నిప్పంటించి దహనం చేస్తారు.‘కంసుని వధ లీలా' అనే చిన్న నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు. దీన్ని చూసి ప్రజలందరూ ఆనందిస్తారు.

కంస సంహారం సందర్భంగా భారీ ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ సమయంలో క్రిష్ణ భక్తులంతా ‘హరే క్రిష్ణ హరే రామ' అనే నామాలను జపిస్తారు. మధురతో పాటు శ్రీ క్రిష్ణుని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, శోభా యాత్రలు నిర్వహిస్తారు.

కంస వధ కథ..

కంస వధ కథ..

కంసుడు శక్తివంతమైన దుష్టపాలకుడు. తన పాలనలో అనేక తప్పుడు పనులు చేస్తాడు. ఆకాశవాణి చెప్పిన విషయంతో తన చెల్లెల్లికి పుట్టిన బిడ్డలను వెంటనే చంపేస్తారు. అదే సందర్భంలో దేవకి, వసుదేవుడిని ఒక చెరసాలలో బంధిస్తాడు. అయితే శ్రీక్రిష్ణుడు పుట్టిన విషయం మాత్రం తనకు తెలియకుండా వారు జాగ్రత్త పడతారు. ఈ విషయం తెలుసుకున్న కంసుడు రేపల్లెలోని పిల్లలందరినీ చంపేస్తాడు. ఒక అందమైన అమ్మాయిని కూడా హత్య చేస్తాడు. అంతటితో ఆగకుండా ఒక రాక్షసిని ఆ ఊరి మీదకు పంపి తన పాలలో విషమిచ్చి పిల్లలందరినీ చంపిస్తాడు. అయితే క్రిష్ణుడు అదే సమయంలో ఆమె శరీరంలోని పాలతో పాటు తన రక్తాన్నంత పీల్చేసి తనను చంపేస్తాడు. ఆ తర్వాత పెరిగి పెద్దయిన శ్రీక్రిష్ణుడు కంసుని రాజ్యానికి తన అన్న బలరాముడితో కలిసి వెళ్తాడు. అప్పటికే వాళ్లను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసింటాడు కంసుడు. కానీ ఫలితం మాత్రం శూన్యమేనని తనకు తెలుసుకోలేకపోతాడు. చివరకు శ్రీక్రిష్ణుడు ఇన్నాళ్లు మామయ్య అన్న ఒకేఒక్క కారణంతో నీ దుశ్చర్యలను సహించాను. ఇక సహించను అని కంసుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి రాజుగా మారతాడు. అనంతరం దేవకి, వసుదేవులను విడుదల చేస్తారు.

కంసుడిని ఎవరు చంపారు?

హిందూ పురాణాల ప్రకారం, తనకు మేనమామ వరుస అయిన కంసుడిని శ్రీక్రిష్ణ పరమాత్ముడు మట్టుబెట్టాడు. భూమి మీద కంసుడి అన్యాయాలను, అక్రమాలను అడ్డుకునేందుకే విష్ణుమూర్తి క్రిష్ణుడి రూపంలో జన్మించి తన చిన్నతనంలోనే మామ అయిన కంసుడిని సంహరించాడు. దీంతో ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు.

కంసుడిని శ్రీక్రిష్ణుడు ఎప్పుడు వధించారు?

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున కంసుడిని శ్రీక్రిష్ణుడు వధించాడు. ఆ తర్వాత ప్రజలంతా పండుగ జరుపుకుంటారు.

2021లో కంస వధను ఎప్పుడు జరుపుకోనున్నారు?

2021 సంవత్సరంలో నవంబర్ 13వ తేదీన అంటే శనివారం రోజున కంస వధ పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున రాధాక్రిష్ణులకు ప్రత్యేక పూజలు చేస్తారు.

English summary

Kansa Vadh 2021: Date, time, story, rituals, significance, and importance in Telugu

Know Kansa Vadh 2021: Date, Rituals, Puja Vidhi, Katha and Significance in Telugu.