For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartika Masam 2021 :కార్తీక మాసంలో సోమవారం ఉపవాస నియమాలేంటో తెలుసా...

కార్తీక మాసంలో సోమవారం రోజున ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం.. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి పరమ పవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు.

Kartika Masam 2021 : How to Do Fasting in Karthika Somavaram in Telugu

కార్తీకమాసంలో సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

Kartika Masam 2021 : How to Do Fasting in Karthika Somavaram in Telugu
ఈ సందర్భంగా కార్తీక సోమవారాల్లో ఉపవాస నియమాలేంటి? ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వచ్చే ఫలితాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Kartik Month 2021:కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...Kartik Month 2021:కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...

ఉపవాసం అంటే..

ఉపవాసం అంటే..

మనలో చాలా మంది ఉపవాసం అంటేనే వారికి భక్తి భావాలు చాలా ఎక్కువగా ఉంటాయనుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఉపవాసం అంటే దేవుడి కోసం కాదు.. మన కోసమే. మన జీర్ణ వ్యవస్థ శుద్ధి కోసం అని సైన్స్ చెబుతోంది. అయితే ఆధ్యాత్మికంగా ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం. మొత్తం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. అంటే మన మనసును ఎంతో భక్తి శ్రద్ధలతో దేవునికి దగ్గరగా లగ్నం చేయడం అన్న మాట.

కార్తీక మాసంలో ఉపవాసం..

కార్తీక మాసంలో ఉపవాసం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏడాది.. ప్రతి నెలా ఎన్నో పండుగలు, వ్రతాలు వస్తుంటాయి.. అయితే నెల రోజులూ పండుగలా జరుపుకునేది ఒక్క కార్తీక మాసంలోనే. సూర్యోదయానికి ముందే స్నానాలు, పూజలు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, వనభోజనాలు అబ్బో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. అయితే కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు.

మనసులో నియంత్రణ..

మనసులో నియంత్రణ..

ఈ కాలంలో పరమేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు మీరు ఎక్కువ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. ఈ మాసమంతా మీ మనసును అదుపులో ఉంచుకుంటే చాలు. అలాంటి నియమంలో ఒకటి ఉపవాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్రం దర్శనం అనంతరం భోజనం చేయడం వల్ల శివుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని కార్తీక పురాణంలో పేర్కొనబడింది.

Kartik Month 2021: కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...Kartik Month 2021: కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...

ఆరోగ్య పరంగానూ..

ఆరోగ్య పరంగానూ..

కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగానూ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు మనలో ప్రతి ఒక్కరికీ వారానికి ఒక రోజు సెలవు అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు విరామం ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థను తిరిగి బలంగా మారేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాం.

మానసిక ఔషధం..

మానసిక ఔషధం..

ఉపవాసం అనేది మానసిక ఔషధంగా కూడా పని చేస్తుంది. ఉపవాసం వల్ల మీ శరీరానికి మాత్రమే కాదు.. మీ మనసుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది.

కార్తీక సోమవారాలు..

కార్తీక సోమవారాలు..

కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీక్షలో ఉండొచ్చు. అలా లేని వారు కనీసం కార్తీక సోమవారంలో అయినా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. మరో కథనం మేరకు.. చంద్రునికి 27 నక్షత్రాలతో పెళ్లి చేయగా.. ఎక్కువగా క్రుతికా నక్షత్రం దగ్గరకే ఉండేవాడట. మిగతా నక్షత్రాలతో పోలిచూస్తే ఈ నక్షత్రం చాలా ఆకర్షణగా, అందంగా ఉంటుంది. దీంతో మిగిలిన చంద్రులకు శాపగ్రస్తుడయ్యాడని, తర్వాత నుంచి క్రుతికా నక్షత్రం తన అందాన్ని కోల్పోయిందని నమ్ముతారు. కాబట్టి మీ మనసును అదుపులో పెట్టుకోవడం అవసరం. ఈ మాసంలో శివుని ప్రీతి పొందడానికి సోమవారం నాడు వ్రతం చేయాలి. ఎవరికి వారు తాము ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి.

English summary

Kartika Masam 2021 : How to Do Fasting in Karthika Somavaram in Telugu

Here we are talking about the kartika masam 2021: Never do these mistakes in kartika somavaram in Telugu. Have a look
Story first published:Monday, November 8, 2021, 9:00 [IST]
Desktop Bottom Promotion