బుధవారాలు జపించాల్సిన కృష్ణ స్తోత్రం

By: Deepti
Subscribe to Boldsky

ప్రాచీన భారత మహర్షులు వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడ్ని పూజించటానికి నియమాలు ఏర్పరచారు. ఆ దేవుడ్ని ఆరోజు పూజించటం వలన వారు త్వరగా ప్రసన్నులయి, మీకు మంచి వరాలు అందిస్తారని నమ్మకం.

బుధవారం శ్రీకృష్ణుడికి అంకితం చేసిన రోజు. కృష్ణభక్తులు ఆ రోజులు ఆయన గుడికి వెళతారు. ఆరోజు వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. శ్రీకృష్ణాలయాలలో ఆరోజు ప్రత్యేక పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు.

ఇళ్ళలో, భక్తులు పొద్దున్నే లేచి స్నానం చేస్తారు. పూజాస్థలిని శుభ్రపరిచి, శ్రీకృష్ణుడి కోసం పూజ చేస్తారు. అతనికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను సమర్పిస్తారు. అరటి, పంచదార, వెన్న వంటివి కూడా నైవేద్యంగా పెడతారు. భక్తులందరూ కలిసి సత్సంగాలు నిర్వహిస్తారు. భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.

హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।

హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే ॥

బుధవారాలు పఠించే మంత్రాలలో ఇది చాలా ప్రసిద్ధమైనది. శ్రీకృష్ణున్ని స్తుతించే అనేక ఇతర మంత్రాలు కూడా ఉన్నాయి. మేము ఈ రోజు మీ కోసం శ్రీకృష్ణున్ని స్తుతించే ఒక స్తోత్రాన్ని పరిచయం చేస్తున్నాం. ఇది ప్రతిరోజూ పఠించవచ్చు.

బుధవారం నాడు చదివితే ప్రత్యేకంగా శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందవచ్చు. దీన్నే శ్రీకృష్ణ స్తోత్రం అంటారు. రండి, ఇక ఈ స్తోత్రం చదివి, అర్థం తెలుసుకోండి.

శ్రీకృష్ణ స్తోత్రం

శ్రీకృష్ణ స్తోత్రం

వందే నవ ఘన శ్యామం, పీఠ కౌసేయ వాససం,

సనందం సుందరం సూధం, శ్రీ కృష్ణం ప్రాకృతే పరం.

"నీలిమేఘాల రంగున్న శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. పసుపు వస్త్రాలతో, అందంగా, స్వచ్చంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే స్వామికి నమస్కరిస్తున్నాను."

"సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను.

రాధేశం రాధిక ప్రాణ వల్లభం, వల్లవే సుతం,

రాధ సేవిత పదాబ్జం, రాధ వక్ష స్థల స్థిహం.

"సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. యశోద తనయుడు, రాధకి ప్రాణప్రేమికుడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం."

రాధ ఎల్లప్పుడూ పూజించే శ్రీకృష్ణ భగవానుడే నా దైవం

రాధ ఎల్లప్పుడూ పూజించే శ్రీకృష్ణ భగవానుడే నా దైవం

రాధానుగం రాధికేశం రాధానుక మానసం,

రాధాధరం భవధరం సర్వధరం నమామితం.

" రాధ ఎల్లప్పుడూ పూజించే శ్రీకృష్ణ భగవానుడే నా దైవం.ఆయన రాధ హృదయంలో నివసించి, అనుక్షణం ఆమెతోనే ఉంటారు. ఆమె మనస్సు కేవలం ఆయనపట్లే ఆకర్షితం. రాధను సంరక్షించే ఓ శ్రీకృష్ణా, మమ్మల్ని కూడా సంరక్షించు."

“రాధ హృదయంలాంటి పద్మంలోనే నీవు నివసిస్తావు

“రాధ హృదయంలాంటి పద్మంలోనే నీవు నివసిస్తావు

రాధా హృత్ పద్మ మధ్యే చ వసంతం సంతతం శుభం,

రాధా సహ చరం సస్వద్రదంగ పరిపాలకం.

"రాధ హృదయంలాంటి పద్మంలోనే నీవు నివసిస్తావు. ఎప్పుడూ మంచి పనులను చేపట్టే స్వచ్చమైన హృదయం కలవాడా, రాధ సహచరి మరియు ఆమె సమస్త కోరికలు తీర్చే స్వామీ, నీకు నమస్కరిస్తున్నాను."

మహాయోగులు నిన్ను వారి యోగశక్తితో చేరతారు

మహాయోగులు నిన్ను వారి యోగశక్తితో చేరతారు

ధ్యాయంతే యోగినో యోగాత్ సిద్ధ, సిద్ధేశ్వరశ్చ యం,

తం ధ్యాయేత్ సంతతం సూధం భగవంటం సనాతనం.

"మహాయోగులు నిన్ను వారి యోగశక్తితో చేరతారు. మృత్యువు, నాశనం లేని ఓ దేవా ! నీవు నీ అజేయ మంత్ర, తంత్ర శక్తులకు ప్రసిద్ధుడవు. అలాంటి నీకు నమస్కారం !."

సకల దేవతలు, మహర్షులు, బ్రహ్మ,పరమశివుడు నిన్ను పూజిస్తారు

సకల దేవతలు, మహర్షులు, బ్రహ్మ,పరమశివుడు నిన్ను పూజిస్తారు

సేవంత సతతం సంతో బ్రహ్మేశ శేష సంజ్ఞాక,

సేవంతే నిర్గుణం. బ్రహ్మ భగవంతం సనాతనం.

"సకల దేవతలు, మహర్షులు, బ్రహ్మ,పరమశివుడు నిన్ను పూజిస్తారు. మహర్షులు నీ నామం జపించి మోక్షం పొందుతారు. రూపం లేనివాడా, సత్యానికి మూలం నువ్వు. సృష్టిలో దేనితో బంధింపబడని వాడా, నీకు వందనము."

మృత్యువు లేనివాడా, బంధాలు, కోరికలు లేని స్వామి

మృత్యువు లేనివాడా, బంధాలు, కోరికలు లేని స్వామి

నిర్లిప్తం చ నిరేహం చ పరమానందమీశ్వరం,

నిత్యం సత్యంచ పరమం భగవంతం సనాతనం.

"మృత్యువు లేనివాడా, బంధాలు, కోరికలు లేని స్వామి. నీవు కేవలం ఆనందమే. నీవు ఎప్పటికీ ఉంటావు, నీవే సత్యం మరియు నీవే నిత్యం."

సృష్టికి పూర్వమే ఉన్న దేవా, నీవే సృష్టికర్తవి

సృష్టికి పూర్వమే ఉన్న దేవా, నీవే సృష్టికర్తవి

యం శ్రేష్టరాధి భూతంచ సర్వ బీజం పరాత్పరం,

యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనం.

" సృష్టికి పూర్వమే ఉన్న దేవా, నీవే సృష్టికర్తవి. వివిధ అవతారాలకి, జన్మలకు కారణం నీవే."

నీవే అన్నిటికీ బీజానివి. కారణాలన్నిటికీ కారణం నీవు

నీవే అన్నిటికీ బీజానివి. కారణాలన్నిటికీ కారణం నీవు

బీజం ననావతరణం సర్వకారణ కారణం,

వేద వేద్యం వేద బీజం వేద కారణ కారణం.

"నీవే అన్నిటికీ బీజానివి. కారణాలన్నిటికీ కారణం నీవు. వేదాలు కూడా నిన్ను పూర్తిగా వర్ణించలేవు. వేదాల సృష్టికి కారణం కూడా నీవే."

English summary

Krishna Stotram To Chant On Wednesdays

The wise men and Sages of ancient India allotted a day of the week to worship a particular God. It is believed that prayers and poojas to the God on the day dedicated to them pleases them easily and helps you to reap good benefits.
Story first published: Wednesday, August 23, 2017, 10:00 [IST]
Subscribe Newsletter