For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019; పండుగ రోజున ఆనందం కోసం ఈ మంత్రాలను జపించాలి..

|

కృష్ణుడి మంత్రాలను జపించి ఆయన ఆశీస్సులు పొందేందుకు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కృష్ణాష్టమి రోజున అందరూ ఆనందంగా ఉండేందుకు.. ప్రతి ఒక్కరూ జపించాల్సిన మంత్రాల గురించి.. చేయాల్సిన పనుల గురించి ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం. ఇంతకుముందే కృష్టాష్టమి పూజా, ప్రాముఖ్యతల గురించి ఇంతకు ముందు స్టోరీలో వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మంత్రాలను జపిద్దాం.

Krishnastami 2019

శ్రీకృష్ణుని మహామంత్రం "హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే" ఈ మంత్రం అర్థమేమిటంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని స్తుతించారు. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కారాలను తెలియజేస్తున్నాం.

కృష్ణ భక్తి మంత్రం

"జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద

శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసడై గౌర్ భక్తా వృంద"

దీని అర్థమేమిటంటే.. ఈ మంత్రంలో శ్రీ కృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించబడింది. వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది.

కృష్ణాష్టకం -1

కృష్ణాష్టకం -1

"వసుదేవ సూతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్"

ఈ మంత్రం అర్థమేమిటంటే.. వసుదేవ తనయా, నీవు కంసుని అలాగే చాణూరుని వంటి రాక్షాసులను వధించిన శక్తిమంతుడవు. దేవకి మాతకు పరమానందాన్ని కలిగించావు. నీవు ఈ విశ్వానికే దేవుడవు. వాసుదేవునికి వందనం.

కృష్ణాష్టకం -2 :

కృష్ణాష్టకం -2 :

"అతసీ పుష్పసంకాశం హార నూపుర శోభితం

రత్న కనకన కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్"

ఈ మంత్రం అర్థమేమిటంటే అతసీ పువ్వులను అలంకరించుకుని కడియాలతో, పూల మాలలతో మెరుస్తున్న వాసుదేవుడు కుడిచేతికి రత్నాలతో చేయబడిన కడియాలు వేసుకున్నాడు. వాసుదేవునికి వందనం.

కృష్ణాష్టకం -3

కృష్ణాష్టకం -3

"కుటిలలాకా సంయుక్తం పూర్ణచంద్ర నిభాననామ్

విలసత్ కుండల ధరమ్ కృష్ణం వందే జగద్గురుమ్"

ఈ మంత్రం అర్థమేమిటంటే.. శ్రీ కృష్ణుని కురులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఆయన ముఖం చంద్రబింబాలా ప్రకాశిస్తోంది. చెవులు మెరుస్తున్నాయి. శ్రీ కృష్ణునికి వందనం.

కృష్ణాష్టకం -4

కృష్ణాష్టకం -4

"మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం

బర్హి పింజావ చూదంగం కృష్ణం వందే జగద్గురుమ్"

ఈ మంత్రం అర్థమేమిటంటే.. మందార పూల పరిమళంతో మెరుస్తున్న శ్రీ కృష్ణభగవానుడి చిరునవ్వు, నాలుగు చేతులూ అత్యంత సుందరమైనవి. శ్రీ కృష్ణ పరమాత్ముని కురులపై నెమలి పింఛం కొలువైంది. శ్రీ వాసుదేవునికి వందనాలు.

 కృష్ణమంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలు:

కృష్ణమంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలు:

ఈ మంత్రాలను ఏ సమయంలో జపించాలి:

శ్రీ కృష్ణుని మంత్రాలను బ్రహ్మముహూర్త వేళల్లో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరుగంటలలోపు ఈ మంత్రాలను పఠిస్తే మంచి ఫలితం ఉంటుందని పురాణాల్లో పేర్కొనబడింది. కృష్ణుని ముందు కూర్చొని కృష్ణమంత్రాన్ని తులసి మాలతో 108 సార్లు పఠించాలి. జపమాలని మూడు వేళ్లపైన ఉంచి జపిస్తూ ఉండాలి. (చిటికిన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలిని కలుపుతూ) బోటనవేలుని సపోర్ట్ గా పెట్టుకోవాలి. చూపుడువేలుని ఒంపుగా ఉంచాలి. సవ్యదిశలోనే జపమాలని తిప్పాలి.

కృష్ణమంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలు:

ఈ మంత్రాన్ని జపించడం వల్ల అన్ని రకాల భయాలు, కలవరాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా పెరుగుతాయి. దాంతో పాటు అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపద బాగా పెరుగుతుంది. ఇళ్లలోని నెగిటివ్ వైబ్రేషన్స్ మాయమవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. విద్యార్థులకు మేథస్సు మెరుగవుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులు ఎదుగుదల కలుగుతుంది.

English summary

Krishnastami 2019: Krishna Mantras To Chant For Prosperity And Happiness

The day came when everyone was eagerly waiting for Krishna's chants and blessings. On the day of Krishnashtami to make everyone happy ... This is the story of the Krishtashtami Pooja and the significance of the earlier story. Let us chant mantras directly without delay.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more