For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kurma Jayanti 2021: శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో ఎందుకొచ్చాడో తెలుసా...

2021లో కూర్మ జయంతి తేదీ, తిథి మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

శ్రీ మహా విష్ణువు దశావతారాలలో కూర్మావతరం(తాబేలు) ఒకటి. పురాణాల ప్రకారం విష్ణువు సత్య యుగంలో రెండో అవతారం కూర్మ. ఈ పవిత్రమైన రోజునే తన 'కూర్మా' అవతారంలో 'క్షీరా సాగర మదనం' చేశారని, ఈ సందర్భంగా బ్రహ్మాండమైన మందరాంచల్ పర్వతాన్ని తన వెనుకభాగంలో ఎత్తుకున్నారని చాలా మంది నమ్ముతారు.

Kurma Jayanti 2021: Date, Tithi and Significance in Telugu

అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూర్మ జయంతిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ పౌర్ణమి రోజున శుక్ల పక్షంలో కూర్మ జయంతి జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈరోజు అంటే మే 26వ తేదీన ఈ వేడుకల జరుపుకుంటారు. ఈ సందర్భంగా కూర్మ జయంతి తిథి, ప్రాముఖ్యతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2021 సంవత్సరంలో మే 26వ తేదీన అంటే బుధవారం రోజున కూర్మ జయంతి వచ్చింది. కూర్మ జయంతి శుభ ముహుర్తం ఇదే రోజున సాయంత్రం 4:26 నుండి సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. అంటే మొత్తం 17 నిమిషాల పాటు ఈ శుభ ముహుర్తం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూర్ణిమ తిథి మే 25వ తేదీన రాత్రి 8:29 గంటలకు ప్రారంభమై 26వ తేదీన సాయంత్రం 4:43 గంటలకు ముగుస్తుంది.

కూర్మ జయంతి ఆచారాలు..

కూర్మ జయంతి ఆచారాలు..

ఇతర హిందూ పండుగల మాదిరిగానే కూర్మ జయంతి రోజున భక్తులందరూ ఉపవాసం ఉండాలి, శ్రీ మహావిష్ణువుకు తులసి ఆకులు, కుంకుమ, ధూపం కర్రలు, పువ్వులు మరియు స్వీట్లను అర్పించాలి. పూజ, ఆరాధన పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రసాదాన్ని పంపిణీ చేయాలి. అయితే ఈ ప్రసాదాన్ని పరిశీలన నిమిత్తం వచ్చిన వారికి ఇవ్వకూడదు. ఈరోజున ‘విష్ణు సహస్రనామ' పఠనం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

కూర్మ జయంతి ప్రాముఖ్యత..

కూర్మ జయంతి ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, సత్య యుగంలో విష్ణువు దశావతారంలో భాగంగా రెండో అవతారంలో కూర్మ అవతారంలో వచ్చాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ అవతారం ఎత్తారని పండితులు చెబుతుంటారు. ఓ రోజు దేవుళ్లు, రాక్షసులు అమ్రుతం కోసం క్షీర సాగరడం చిలకడం మొదలు పెట్టారు. అప్పుడు మందగిరిని కవ్వంగా, వాడుకుని తాడుగా చేసుకుని దేవాసరులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సాగరంలోకి జారిపోతూ సాగర మదనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుండి బయటపడేలా దేవతలు విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు కూర్మావతారంలో వచ్చి సాగరంలో మందరగిరి మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్బవించినదే కూర్మావతారం.

భక్తుని కోరిక మేరకు..

భక్తుని కోరిక మేరకు..

మరో కథనం ప్రకారం.. కూర్మావతారుడు తన భక్తుని కోరిక మేరకు స్వయంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అడుగుపెట్టాడు. అప్పటినుండి అక్కడ శ్రీకూర్మం క్షేత్రంగా విరాజిల్లుతోంది. క్రుత యుగంలో శ్వేతరాజు, తన భార్యం వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో ఉంది.

శ్వేత గుండం..

శ్వేత గుండం..

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణి శ్వేత గుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైనది. ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత ఈ పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఎవరైనా చనిపోతే వారి అస్తికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితురులకు ఉత్తమ గతులు కలుగుతాయని చాలా మంది విశ్వాసం.

English summary

Kurma Jayanti 2021: Date, Tithi and Significance in Telugu

Here we are talking about the kurma jayanti 2021: Date, tithi and significance in Telugu. Read on
Story first published:Wednesday, May 26, 2021, 10:24 [IST]
Desktop Bottom Promotion