For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Labh Panchami 2021:లాభ పంచమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందామా...

|

హిందూ పంచాంగం ప్రకారం, 2021లో నవంబర్ 9వ తేదీన అంటే మంగళవారం వాడు నాడు లాభ పంచమి వచ్చింది. ఇది లాభం మరియు అదృష్టానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది.

ఈ పండుగ గుజరాత్ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెంది. ఇది దీపావళి పండుగ యొక్క వేడుకల చివరి రోజును సూచిస్తుంది. ఇప్పటికే దీపావళి పండుగను అందరం ఘనంగా జరుపుకున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో దేశమంతా బాణసంచా వెలుగుల్లో అందంగా కనిపించింది. ఈ సమయంలో చాలా మంది ఇళ్లలో లక్ష్మీదేవి, గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదిలా ఉండగా.. దీపావళి వేడుకల చివరి రోజైన లాభ పంచమి రోజున గుజరాత్ రాష్ట్రంలో లక్ష్మీదేవిని, వినాయకుడిని ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సందర్భంగా లాభ పంచమి ఎప్పుడొచ్చింది? శుభ సమయం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...

లాభ పంచమి శుభ సమయం..

లాభ పంచమి శుభ సమయం..

కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమిని ‘లాభ పంచమి' లేదా ‘సౌభాగ్య పంచమి' అని కూడా అంటారు. జైనులు దీనిని ‘జ్ణాన పంచమి' అని కూడా పిలుస్తారు. 2021 సంవత్సరంలో నవంబర్ 9వ తేదీన అంటే మంగళవారం నాడు లాభ పంచమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శుభ ముహుర్తం ఉదయం 6:39 గంటల నుండి ఉదయం 10:16 గంటల వరకు ఉంటుంది. పంచమి తిథి ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది.

లాభ పంచమి ఆచారాలు..

లాభ పంచమి ఆచారాలు..

దీపావళి రోజున పూజలు చేయలేని వారు లాభ పంచమి రోజున శారదా పూజను చేస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు వారి పని స్థలాలను తెరచి, వారి కొత్త లెడ్జర్ ను పూజిస్తారు. కుటుంబ శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదం కోసం మాతా లక్ష్మీ పూజను జరుపుతారు. కొందరు తెలివితేటలు పెంచుకోవడానికి పుస్తకాలకు కూడా పూజలు చేస్తారు. ప్రజలందరూ తమ బంధువులు మరియు స్నేహితులను సందర్శించి శుభాకాంక్షలు చెప్పుకుని, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈరోజున పేదలకు దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. మరికొన్ని చోట్ల వినాయకుని దేవాలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...

లాభ పంచమి ప్రాముఖ్యత..

లాభ పంచమి ప్రాముఖ్యత..

లాభ పంచమిని సౌభాగ్య పంచమి, జ్ణాన పంచమి మరియు సౌభాగ్య-లాభ పంచమి అని కూడా అంటారు. సౌభాగ్య అంటే అదృష్టం మరియు లాభం. కాబట్టి ఈరోజు అదృష్టం మరియు లాభంతో ముడిపడి ఉంది. ఈరోజున కొత్త వెంచర్లు ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందది. గుజరాత్ రాష్ట్రంలో లాభ పంచమిని కొత్త సంవత్సరం తొలి రోజుగా పరిగణిస్తారు. వ్యాపారవేత్తలు ఈరోజున కొత్త లెడ్జర్ లేదా ‘ఖాటు'ని తెరుస్తారు. అలాగే పుస్తకం మధ్యలో ఎడమవైపు ‘సాథియా' అని, ‘శుభ్' అని కుడి వైపు ‘లాభం' అని రాసి ఉంటుంది.

కొత్త వ్యాపారం ప్రారంభం..

కొత్త వ్యాపారం ప్రారంభం..

లాభ పంచమి రోజున ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున మీ శరీరం, మనస్సు రియు మేధస్సును అందరి ఆనందం, సంక్షేమం, శ్రేయస్సు కోసం శాంతిని వ్యాప్తి చేయండి. మనసు యొక్క సూచనలను అనుసరించడం వల్ల లాభం ఉండదు. కానీ మనసు ఇంద్రియాలను అనుసరించడం వల్ల కచ్చితంగా నష్టం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున వ్యాపారం ప్రారంభిస్తే, ఎలాంటి ఆటంకాలు లేకుండా.. పనులన్నీ సాఫీగా సాగుతాయి.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని నమ్మడం.. నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇవ్వబడింది.

2021లో లాభ పంచమి ఎప్పుడొచ్చింది?

2021 సంవత్సరంలో నవంబర్ 9వ తేదీన అంటే మంగళవారం నాడు లాభ పంచమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శుభ ముహుర్తం ఉదయం 6:39 గంటల నుండి ఉదయం 10:16 గంటల వరకు ఉంటుంది. పంచమి తిథి ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది.

English summary

Labh Panchami 2021: Date, Time, Rituals, Puja Vidhi, Mantras and Significance in Telugu

Here we are talking about labh panchami 2021:Date, time, rituals, puja vidhi, mantras and significance in Telugu. Have a look
Story first published: Tuesday, November 9, 2021, 8:00 [IST]