For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Last Solar Eclipse 2020 : చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా...

చివరి సూర్య గ్రహణం తేదీ, సమయం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇప్పటికే చాలా వరకు సూర్య, చంద్ర గ్రహణాలు చాలానే సంభవించాయి. తాజాగా ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం మన దేశంలో డిసెంబర్ 14వ తేదీ మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Last Solar Eclipse 2020 : Know date, time, significance in Telugu

ఇది భారతదేశంలో 14వ తేదీ రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12:23 గంటల సమయంలో ముగుస్తుంది. అంటే సుమారు ఐదు గంటల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది.

Last Solar Eclipse 2020 : Know date, time, significance in Telugu

ఈ గ్రహణంతోనే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పబడుతుంది. ఇప్పటికే మన దేశంలో మూడు సూర్యగ్రహణాలు ముగిసిపోయాయి. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు పూర్తిగా చంద్రుని నీడలో తలదాచుకుంటాడు.

Last Solar Eclipse 2020 : Know date, time, significance in Telugu

అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? దీని వల్ల ఏమైనా ప్రభావాలుంటాయా.. గ్రహణం సమయంలో ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...

ఇండియాలో కనిపించదు..

ఇండియాలో కనిపించదు..

ఈ చివరి సూర్య గ్రహణం ఇండియాలో కనిపించదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దీని ప్రభావం మనపై ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే హిందూ పంచాంగం ప్రకారం, ఈ చివరి సూర్యగ్రహణం, వృశ్చికరాశిలో, జ్యేష్ట నక్షత్రంలో సంభవించనుంది.

ఎక్కడ కనిపిస్తుందంటే..

ఎక్కడ కనిపిస్తుందంటే..

ఈ చివరి సూర్య గ్రహణం టెముకో, విల్లారికా, సియెర్రా కొలాడా, చిలీ మరియు అర్జెంటీనా వంటి నగరాలలో మాత్రమే కనిపిస్తుంది. పాక్షిక సూర్య గ్రహనం పసిఫిక్ మహా సముద్రం, అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికాలో దక్షిణం నుండి ఇది కనిపిస్తుంది. ఇలా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీన్ని సూతక కాలంగా పరిగణించరు.

ఎంతసేపు జరుగుతుంది..

ఎంతసేపు జరుగుతుంది..

ప్రతి సంవత్సరం రెండు లేదా 5 సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. ప్రతి ఒక్కటి పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి క్యాలెండర్ సంవత్సరాల్లో ఎక్కువగా రెండు సూర్య గ్రహణాలు కచ్చితంగా ఉంటాయి. అదే సమయంలో ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదు గ్రహణాలు ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

నాసా ప్రకారం..

నాసా ప్రకారం..

నాసా లెక్కల ప్రకారం, గత 5 వేల సంవత్సరాల్లో కేవలం 25 సంవత్సరాలు మాత్రమే 5 సూర్య గ్రహణాలు కలిగి ఉన్నాయి. ఇది చివరిసారిగా 1935లో జరిగింది. తరువాతి సమయం 2206లో జరుగుతుంది.

వృశ్చికరాశిలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది...!వృశ్చికరాశిలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది...!

ఎప్పుడు ప్రత్యేకమంటే..

ఎప్పుడు ప్రత్యేకమంటే..

సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే రోజున ఈ సూర్యగ్రహణం పడుతోంది. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ఆగమనం చేసినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు. ధనస్సు సంక్రాంతి రోజున సూర్యగ్రహణం పడటం చాలా ప్రత్యేకమైనదిగా చాలా మంది భావిస్తారు. మకరరాశిలో సూర్యుడు సంచారం చేస్తే.. దాన్ని మకర సంక్రాంతి అంటారు.

తొలి గ్రహణం..

తొలి గ్రహణం..

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం జూన్ 21వ తేదీన ఏర్పడింది. ఈ గ్రహణం తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కూడా మనం కరోనా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. కరోనా దెబ్బకు ఈ భూమి మీద లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. అది కూడా సూర్యగ్రహణం తర్వాతే ఎక్కువ మంది చనిపోవడం గమనార్హం.

అప్రమత్తంగా ఉండండి..

అప్రమత్తంగా ఉండండి..

సూర్య గ్రహణానికి చెందిన సూతక్ కాలం ఈ సారి మన దేశంలో చెల్లుబాటు కాకపోవచ్చు. అయితే గ్రహణం ప్రభావం విశ్వమంతా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోండి. ముఖ్యంగా గ్రహణ కాలంలో తినడం లేదా తాగడం మానుకోండి. శుభకార్యక్రమాలు జరపకండి.

చాలా ప్రమాదకరం..

చాలా ప్రమాదకరం..

గ్రహణం సమయంలో జీవిత భాగస్వాములను కూడా నియంత్రణలో ఉంచాలి. ప్రెగ్నెన్సీ మహిళలు ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో ప్రతికూల శక్తులకు బలం పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇక సైన్స్ పరంగా ఈ సమయంలో సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

English summary

Last Solar Eclipse December 2020 : Know date, time, significance in Telugu

Here we talking about the last solar eclipse 2020 : know date, time, significance in Telugu. Read on.
Desktop Bottom Promotion