For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని ప్రేమించే వారే భాగస్వామి కావాలనుకుంటే... ఈ పరిహారాలను పాటించండి...

|

పెళ్లి అనే రెండక్షరాలు చాలా మంది జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలను.. అనేక సంప్రదాయాలను, కటుబాట్లను అనుసరించి జరిపే ఒక ప్రధానమైన కారణం. ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి మూడు పదుల వయసు దాటినప్పటికీ.. పెళ్లిళ్లు కావటం లేదు. కరోనా వైరస్ వంటి మహమ్మారి కూడా కళ్యాణం వంటి కమనీయ కార్యక్రమాలకు బ్రేకులేసింది.

కొంతమందికి వివాహం విషయంలో ఏవేవో కారణాల వల్ల ఆలస్యమవుతుంటే.. మరికొంతమందికి ఉద్యోగం, సంపాదన వంటి కారణాల వల్ల.. ఇంకొందరికి లాక్ డౌన్ ప్రభావం వల్ల పెళ్లి అనే తంతు వాయిదా పడుతూ వస్తోంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివాహం ఆలస్యం కావడానికి కారణం జాతకాల్లో ఏవైనా దోషాలు ఉండటమేనని పండితులు చెబుతున్నారు. మీ జాతకంలో పంచమ స్థానంలో రాహువు గాని లేదా కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ ద్రుష్టి లేకున్నా సంతానం ఆలస్యం కావడం.. సంతానం లేకపోవడం, గర్భం తొలగించడం వంటివి జరుగుతాయి. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం ఉంటుంది. దీని నివారణకు ఏమి చేయాలో.. ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ దోషాలు తొలగిపోయి.. మీరు కోరుకున్న కోరికలు నెరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ 5 రాశులవారు ఆహారాన్ని చాలా ఇష్టపడతారు - కడుపు నిండా తింటారు!

నాగదోష నివారణకు..

నాగదోష నివారణకు..

నాగ దోష నివారణకు మీరు శుభతిథులను ఎంచుకోవాలి. నాగదేవతలకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం విశిష్టం.ఇలాంటి పవిత్రమైన రోజులలో పూజలు చేస్తే మీరు దుష్ఫలితాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, క్రిష్ణ పక్షాలు నాగదేవతల పూజలకు అనువైనవి కావని గమనించాలి.

ఆలయాల దర్శనం..

ఆలయాల దర్శనం..

అయితే నాగదోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. నాగదోషం తీవ్రంగా ఉంటే, మీకు దగ్గర్లోని దుర్గా మాత ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివుని దర్శనం చేసుకుని, రాహు,కేతువుల పూజలు, దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే ఆరు ముఖాలు, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుట వల్ల శుభం కలుగుతుంది.

మానసిక ఐక్యత పెరగడానికి..

మానసిక ఐక్యత పెరగడానికి..

కొందరు పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే విడాకులు తీసుకుంటారు. అది కూడా జాతకంలో ఏదో దోషం వల్లే జరుగుతుంది. వివాహం అయిన మొదటి కొన్ని రోజులలో, విడాకులు తీసుకున్న జంట కన్నీళ్లు పెట్టుకోకుండా స్వయంవర పార్వతీ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య మానసిక ఐక్యతను పెంచుతుంది. మీ ఇద్దరి మధ్య దూరం తొలగించబడినప్పుడు సాన్నిహిత్యం పెరిగేకొద్దీ పిల్లవాడు ఆశీర్వదించబడతాడు.

గ్రహ దోషాలు

గ్రహ దోషాలు

స్త్రీ, పురుష గ్రహాలలోని లోపాలు వివాహా బంధంలో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, భార్యాభర్తల మధ్య దూరం పెరిగేలా చేస్తాయి. ఇలాంటి అడ్డంకులను అధిగమించి, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని ఏర్పరచుకుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఓ పరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని ఆత్మవిశ్వాసంతో చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మంగళవారం మరియు శుక్రవారం నాడు రాహుపాద పూజలు చేయాలి. ఐదు ఆకులను, ఐదు పసుపు కొమ్మలను కలిపి పూజలు చేయాలి. స్వయంవర పార్వతీ మంత్రాన్ని పఠించాలి. అనంతరం సమీపంలోని సుమంగళిగా ఉండే మహిళలకు వాటిని దానం చేయాలి. ఈ విధంగా చేస్తే మీ అడ్డంకులన్నీ త్వరలో వివాహం జరుగుతుంది. అలాగే ఆలుమగల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

మీకు ఇలాంటి చెవులుంటే మీరు రాజకీయంగా... రచయితగా రాణిస్తారంట...!

ఈ రెండురోజుల్లోనే..

ఈ రెండురోజుల్లోనే..

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా వరకు దేవాలయాలను ఇంకా పూర్తిగా తెరవలేదు. కాబట్టి ఆలయాలకు వెళ్లడం దాదాపు సాధ్యం కాదు. ఎందుకంటే వివాహం త్వరగా కావాలనుకునేవారు దుర్గామాత ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. మిగిలిన దేవాలయాలన్నీ తెరిచిన తర్వాత రాహువుకు సంబంధించిన పూజలను కేవలం మంగళవారం, శుక్రవారాల్లో చేయాలి. అప్పుడే దుర్గామత, పార్వతీదేవి ఆశీర్వాదం లభిస్తుంది.

108 సార్లు ఈ మంత్రాన్ని..

108 సార్లు ఈ మంత్రాన్ని..

వివాహం త్వరగా జరిగేందుకు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పత్నీం మనోరమాం దేహి మనోవరుత్తానుసారిణీమ్!

తారణీం దుర్గసంసారసాగరస్వకలోద్భువామ్!!

అలాగే కనకధారా స్తోత్రం 21 సార్లు 90 రోజులు పఠించండి. మీ జాతాక రీత్యా శని, కుజ, చంద్ర, గురు, దోషాలుంటే ఆయా గ్రహాలకు పరిహారాలు చేసుకోండి.

కుజ దోష నివారణకు..

కుజ దోష నివారణకు..

కుజ దోషం ఉండే వారు.. ఈ దోష నివారణకు దేవీ అష్టోత్తర స్తోత్రం, కుజ స్తోత్రం 21 సార్లు జపించాలి. సౌందర్య లహరిలో 1 నుండి 27వ శ్లోకం వరకు పఠించాలి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు చేయాలి.

ఇవి దానం చేయాలి..

ఇవి దానం చేయాలి..

కుజ దోషం ఉన్న వారు తియ్యని తండూరీ రొట్టెలు దానం చేయాలి. అలాగే పేదలకు వస్త్రాలు, ఇతర వస్తువులను దానం చేయొచ్చు. పై పరిహారాలను దేవుని మీద విశ్వాసంతో చేయండి. తప్పకుండా మీ వివాహం జరుగుతుంది. అలాగే మీ వివాహ బంధంలో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

English summary

Late Marriage remedies in telugu

There are several factors that contribute to delays in marriage such as planetary positions, impact of rahu and ketu etc. All those boy and girls whose marriage is getting delayed unnecessarily should carefully read this article and follow these remedies.